అశ్విని వైష్ణవ్
అశ్విని వైష్ణవ్ | |||
![]()
| |||
భారత రైల్వే శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | పీయూష్ గోయెల్ | ||
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | రవి శంకర్ ప్రసాద్ | ||
కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | రవి శంకర్ ప్రసాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జోధ్పూర్, రాజస్థాన్ | 1970 జూలై 18||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సునీతా వైష్ణవ్[1] | ||
సంతానం | 2 | ||
వృత్తి | సమారంభకుడు ఐఏఎస్ అధికారి |
అశ్విని వైష్ణవ్ భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు , ఐఏఎస్ అధికారి. 2021 జూలై 8 నుండి కేంద్ర రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2] 2019 జూన్ నెలలో భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ ఎంపీగా ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నికయ్యాడు.[3]
తొలినాళ్ళ జీవితం[మార్చు]
వైష్ణవ్ 1970 లో రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ లో జన్మించాడు. వీరి కుటుంబం మొదట రాజస్థాన్ లోని పాలి జిల్లాలోని రాణిలోని జీవాండ్ కల్లన్ గ్రామంలో నివసించేది; తరువాత వీరు జోధ్పూర్ లో స్థిరపడ్డారు. వైష్ణవ్ 1991 లో జోధ్‌పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జెఎన్‌వియు) నుండి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సులో బంగారు పతకంతో పట్టభద్రుడయ్యాడు ఆ తరువాత ఐఐటి కాన్పూర్ నుండి ఎం.టెక్ పూర్తి చేశాడు. 1994 యుపిఎస్సి సివిల్ సర్వీసు పరీక్షలో దేశంలోనే 27 వ ర్యాంకు సాధించాడు. 2008 లో వైష్ణవ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ నుండి MBA చేయడానికి యుఎస్ వెళ్ళాడు.
కెరీర్[మార్చు]
సివిల్ సర్వీసులో[మార్చు]
1994 లో, వైష్ణవ్ ఒడిషా కేడర్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరాడు. ఒడిశాలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పనిచేశాడు, బాలసోర్ ఇంకా కటక్ జిల్లాల జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.ఆ తరువాత 2003లో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 2008లో సెలవు తీసుకొని ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు.
సమారంభకునిగా[మార్చు]
MBA పూర్తి చేసిన తరువాత, వైష్ణవ్ తిరిగి భారతదేశానికి వచ్చి GE ట్రాన్స్‌పోర్టేషన్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరాడు. తరువాత అతను సిమెన్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా చేరాడు.
2012 లో, అతను కార్పొరేట్ రంగాన్ని విడిచిపెట్టి గుజరాత్లో త్రీ టీ ఆటో లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీ గీ ఆటో కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లు రెండింటినీ ఏర్పాటు చేశాడు.
రాజకీయ నాయకునిగా[మార్చు]
2019 జూన్ నెలలో భారత పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ ఎంపీగా ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నికయ్యాడు.[4][5]
2021 జూలై 8 నుండి కేంద్ర రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
మూలాలు[మార్చు]
- ↑ "Shri Ashwini Vaishnaw | National Portal of India". www.india.gov.in. Retrieved 8 July 2021.
- ↑ "Ashwini Vaishnav RS Candidature Fuels BJD-BJP Deal Talk". ODISHA BYTES (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-21. Archived from the original on 2019-11-16. Retrieved 2019-11-16.
- ↑ "Statewise Retirement". 164.100.47.5. Retrieved 2019-06-28.
- ↑ Sep 15, TNN | Updated; 2019; Ist, 14:29. "Jual Oram to head parliamentary panel on defence". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-11-22.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ OdAdmin (2019-10-31). "Rajya Sabha Committees constituted; Prasanna Acharya to head the Committee on Petitions". OdishaDiary (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-11-22.