Jump to content

అష్టశంభు శివ ఆలయాలు

అక్షాంశ రేఖాంశాలు: 20°14′37.28″N 85°50′10.04″E / 20.2436889°N 85.8361222°E / 20.2436889; 85.8361222
వికీపీడియా నుండి
అష్టశంభు శివ ఆలయాలు
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిశా
జిల్లా:ఖుర్దా
ప్రదేశం:భువనేశ్వర్
ఎత్తు:33 మీ. (108 అ.)
భౌగోళికాంశాలు:20°14′37.28″N 85°50′10.04″E / 20.2436889°N 85.8361222°E / 20.2436889; 85.8361222
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:కళింగ ఆర్కిటెక్చర్

అష్టశంభు శివాలయాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరంలోని 8 శివాలయాల సముదాయం.[1]

ఆలయం

[మార్చు]

ఉత్తరేశ్వర శివాలయం ఆవరణలో ఉన్న ఒకేలాంటి పరిమాణం, కొలతల్లో ఉన్న 8 ఆలయాలను స్థానికంగా అష్ట శంభు అని పిలుస్తారు. అష్ట అన్న పదానికి ఎనిమిది అని అర్థం కాగ, శంభు అన్న పదం శివుడిని సూచిస్తోంది. వీటిలో ఐతు ఆలయాలు ఒకే వరుసలో ఉండడంతో పంచ పాండవ అంటారు. ఆలయం ప్రైవేటు యాజమాన్యం క్రింద రత్నాకర గర్గబటు, కుటుంబం నిర్వహణలో ఉంది. బద విభాగం, పభగ అచ్చులు వంటి వాస్తు శాస్త్ర పద్ధతులను బట్టి చూస్తే 10వ శతాబ్దిలో నిర్మించినట్టు తెలుస్తోంది. నిర్మాణం రాతితో కట్టారు, రేఖా దేవళ్ వర్గీకరణకు చెందింది. తూర్పున గోదావరి కొలను, పశ్చిమాన ఉత్తరేశ్వర శివాలయ ప్రహరీ గోడ, దక్షిణాన ప్రహరీ గోడ వెనుక బిందుసాగర్ కొలను హద్దులుగా ఉన్నాయి. ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి.

నిర్మాణ శైలి

[మార్చు]

ఆలయంలో నలుచదరపు విమానం 2.45 మీటర్లది 0.53 ముందువాకిలితో ఉంది. పంచరథ (ఐదు రథాలు) నెలకొని ఉంది. ఎత్తున, విమానం పభగ నుంచి కలిశం వరకూ 5.72 మీటర్ల పొడవున ఉంది. బద, గంది, మస్తక వంటివి కింది నుంచి పై వరకూ ఉన్నాయి.


అలంకరణ లక్షణాలు

[మార్చు]

ఆలయ ద్వారం 1.20 మీటర్ల ఎత్తు, 0.84 మీటర్ల వెడల్పు ఉన్న పొడవాటి నిర్మాణాలు అలంకరించి ఉంది. ద్వారం మొదలులో ద్వారపాలకులు అటూ ఇటూ 0.28 మీటర్ల ఎత్తు, 0.12 మీటర్ల వెడల్పున శైవ ద్వారపాలకుల శైలిలో త్రిశూలం పట్టుకుని నిలిచి ఉంటారు. లలాటబింబం వద్ద గజలక్ష్మి పద్మాన్ని ఎడమ చేతిలో, వరద ముద్ర కుడిచేతిలో పట్టుకుని ఉంటుంది. ద్వారంపైన తోరణంలో నవగ్రహాల విగ్రహాలు, అటూ ఇటూ రెండు ప్రమథ గణాలు ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. కె. సి. పాణిగ్రాహి, ఆర్కియజికల్ రిమైన్స్ ఆఫ్ భుబనేశ్వర్, కలకత్తా, 1961. పేజీ. 19.
  2. టి. ఇ. డొనాల్డ్ సన, హిందూ టెంపుల్ ఆర్ట్ ఆఫ్ ఒడిశా, వాల్యూమ్. I, లీడెన్, 1985, పేజీ. 64.

నోట్స్

[మార్చు]
  1. Iconography of the Buddhist Sculpture of Orissa: Text .P.42.Thomas E. Donaldson