అసద్ వాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసద్ వాలా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అసదోల్లా వాలా
పుట్టిన తేదీ (1987-08-05) 1987 ఆగస్టు 5 (వయసు 37)
పోర్ట్ మోర్స్బీ, పాపువా న్యూ గినియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం off break
బంధువులుపాకే సియాకా (భార్య)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 10)2014 8 నవంబరు - Hong Kong తో
చివరి వన్‌డే2023 5 April - Canada తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.13
తొలి T20I (క్యాప్ 9)2015 15 జూలై - Ireland తో
చివరి T20I2023 21 సెప్టెంబరు - Hong Kong తో
కెరీర్ గణాంకాలు
పోటీ ODI T20I FC LA
మ్యాచ్‌లు 66 43 7 101
చేసిన పరుగులు 2,003 839 700 2,986
బ్యాటింగు సగటు 30.81 23.97 63.63 30.78
100లు/50లు 1/12 0/6 3/3 2/18
అత్యుత్తమ స్కోరు 104 93* 144* 105*
వేసిన బంతులు 2,388 389 341 2,702
వికెట్లు 55 27 5 69
బౌలింగు సగటు 28.70 15.81 33.20 26.24
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/17 3/7 2/80 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 34/– 19/– 6/– 46/–
మూలం: Cricinfo, 21 September 2023

అసద్ వాలా (జననం 1987, ఆగస్టు 5) పాపువా న్యూ గినియా క్రికెట్ ఆటగాడు, జాతీయ జట్టుకు కెప్టెన్.[1] [2] ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణిస్తున్నాడు. 2005 నుండి పాపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.[3]

తొలి జీవితం

[మార్చు]

అసద్ వాలా 1987, ఆగస్టు 5న పాపువా న్యూ గినియాలో జన్మించాడు.[3] అసద్ వాలా మొదటిసారిగా అండర్-19 స్థాయిలో పాపువా న్యూ గినియాకు ప్రాతినిధ్యం వహించాడు, బంగ్లాదేశ్‌లో 2004 అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు.[4] 2005 ఐర్లాండ్‌లో జరిగిన ఐసిసి ట్రోఫీలో సీనియర్ జట్టు కోసం అరంగేట్రం చేసాడు, అక్కడ ఏడు లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు.[5]

సంవత్సరం తర్వాత అండర్-19 స్థాయికి తిరిగి వచ్చాడు, దక్షిణాఫ్రికాలోని బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో ఆఫ్రికా/తూర్పు ఆసియా-పసిఫిక్ అండర్-19 ఛాంపియన్‌షిప్‌లో ఆడాడు. 2006లో, ఆస్ట్రేలియన్ నేషనల్ కంట్రీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో సంయుక్త తూర్పు ఆసియా పసిఫిక్ జట్టు కోసం ఆడాడు. 2007, 2008లో మళ్లీ ఆడాడు.[4]

2007లో, వాలా డార్విన్‌లోని వరల్డ్ క్రికెట్ లీగ్‌లో మూడవ డివిజన్‌లో ఆడాడు. 2007 సౌత్ పసిఫిక్ గేమ్స్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు,[4] అక్కడ అతను క్రికెట్ టోర్నమెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[6]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2014 నవంబరు 8న ఆస్ట్రేలియాలో హాంకాంగ్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[7] 2015 జూలై 15న 2015 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో ఐర్లాండ్‌పై తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[8]

2015 జూన్ లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రంలో, అతను 2015-17 ఐసిసి ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో నెదర్లాండ్స్‌పై 124 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. [9] తన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేశాడు, ఐర్లాండ్ (120), నమీబియా (144 నాటౌట్ )పై కూడా సెంచరీలు చేశాడు.[10]

2018 ఫిబ్రవరిలో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు ముందు చూడవలసిన పది మంది ఆటగాళ్లలో వాలాను ఒకరిగా పేర్కొంది.[11] 2018 జూన్ లో, పాపువా న్యూ గినియా క్రికెట్ అవార్డులలో, ఉత్తమ ఆటగాడిగా టోనీ ఎల్లీ పతకాన్ని గెలుచుకున్నాడు.[12]

2018 ఆగస్టులో, 2018–19 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో గ్రూప్ ఎ కోసం పాపువా న్యూ గినియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[13] ఆరు మ్యాచ్‌లలో 294 పరుగులతో టోర్నమెంట్‌లోని గ్రూప్ ఎలో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[14] 2019 మార్చిలో, 2018–19 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ రీజినల్ ఫైనల్స్‌కు పాపువా న్యూ గినియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[15] మరుసటి నెలలో, అతను నమీబియాలో 2019 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ కోసం పాపువా న్యూ గినియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[16]

2019 జూన్ లో, 2019 పసిఫిక్ గేమ్స్‌లో పురుషుల టోర్నమెంట్‌లో పాపువా న్యూ గినియా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు.[17] 2019 సెప్టెంబరులో, వాలా 2019 యునైటెడ్ స్టేట్స్ ట్రై-నేషన్ సిరీస్ కోసం పాపువా న్యూ గినియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[18] సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో, 114 బంతుల్లో 104 పరుగులతో తన మొదటి వన్డే సెంచరీని సాధించాడు.[19]

2019 సెప్టెంబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ఐసిసి టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు పాపువా న్యూ గినియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[20][21] టోర్నమెంట్‌కు ముందు, ఐసిసి అతన్ని పాపువా న్యూ గినియా జట్టులో కీలక ఆటగాడిగా పేర్కొంది.[22] ఎనిమిది మ్యాచ్‌లలో 197 పరుగులతో టోర్నమెంట్‌లో పాపువా న్యూ గినియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[23]

2020 నవంబరులో, వాలా ఐసిసి పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.[24] 2021 ఆగస్టులో, వాలా 2021 ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాపువా న్యూ గినియా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[25]

మూలాలు

[మార్చు]
  1. "Assad Vala". ESPNCricinfo. Retrieved 23 October 2016.
  2. "PNG squad for Inter-continental Cup match against Namibia". ESPN Cricinfo. Retrieved 17 October 2016.
  3. 3.0 3.1 CricketArchive profile
  4. 4.0 4.1 4.2 Other matches played by Asad Vala Archived 18 అక్టోబరు 2012 at the Wayback Machine at CricketArchive
  5. List A matches played by Asad Vala at CricketArchive
  6. Points table for the 2007 South Pacific Games cricket tournament at CricketArchive
  7. "Hong Kong tour of Australia, 1st ODI: Papua New Guinea v Hong Kong at Townsville, Nov 8, 2014". ESPN Cricinfo. Retrieved 8 November 2014.
  8. "ICC World Twenty20 Qualifier, 23rd Match, Group A: Ireland v Papua New Guinea at Belfast, Jul 15, 2015". ESPN Cricinfo. Retrieved 15 July 2015.
  9. "ICC Intercontinental Cup, Netherlands v Papua New Guinea at Amstelveen, Jun 16-18, 2015". ESPN Cricinfo. Retrieved 18 June 2015.
  10. "ICC Intercontinental Cup Results". ESPNCricinfo. Retrieved 23 October 2016.
  11. "10 stars to look out for at CWCQ". International Cricket Council. 27 February 2018. Retrieved 27 February 2018.
  12. "Assad Vala, Pauke Siaka win top PNG Cricket awards". International Cricket Council. Retrieved 20 June 2018.
  13. "Squads and fixtures announced for 2020 ICC World T20 - EAP Group 'A' 2018". International Cricket Council. Retrieved 9 August 2018.
  14. "ICC World Twenty20 East Asia-Pacific Region Qualifier A, 2018, Most Runs". ESPN Cricinfo. Retrieved 29 August 2018.
  15. "Squads and Fixtures Announced for 2020 ICC Men's T20 World Cup EAP Final 2019". Cricket Philippines. Retrieved 22 March 2019.
  16. "Barras on a mission". The National (Papua New Guinea). Retrieved 3 April 2019.
  17. "Athlete List for Samoa 2019 Pacific Games". Pacific Games Council. Retrieved 21 June 2019.
  18. "First One Day International to be played in USA". International Cricket Council. Retrieved 10 September 2019.
  19. "Vala century in vain as Namibia see off PNG". International Cricket Council. Retrieved 24 September 2019.
  20. "Barras named for qualifiers". The National. Retrieved 4 October 2019.
  21. "Captains enthusiastic ahead of ICC Men's T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 12 October 2019.
  22. "Team preview: Papua New Guinea". International Cricket Council. Retrieved 12 October 2019.
  23. "ICC Men's T20 World Cup Qualifier, 2019/20 - Papua New Guinea: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 November 2019.
  24. "ICC Awards of the Decade announced". International Cricket Council. Retrieved 25 November 2020.
  25. "Papua New Guinea unveil T20 World Cup squad". International Cricket Council. Retrieved 24 August 2021.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అసద్_వాలా&oldid=4184716" నుండి వెలికితీశారు