అసని తుపాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మే 7, 8 తేదీల్లో కనిపించిన రెండు ఇన్‌ఫ్రారెడ్ శాటిలైట్ విజువల్స్ లూప్
2022 మే 10న అసని తుపాను తీవ్రత

అసని తుపాను (ఆంగ్లం: Cyclone Asani) అనేది ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుపాను. 2022 మే మొదటి వారంలో మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (MJO), ఈక్వటోరియల్ రాస్బీ వేవ్ (ERW) ల బలమైన పల్స్ ఈ బేసిన్‌లో ప్రబలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మే 4న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా తుపాను ఏర్పడటానికి దారితీసింది.[1][2] మే 8 నాటికి, సిస్టమ్ సైక్లోనిక్ స్టార్మ్ అసనిగా వ్యవస్థీకృతమై, సీజన్‌లో మొదటి తుఫానుగా మారింది.[3] అసని అనే పేరును శ్రీలంక అందించింది. దీని అర్థం సింహళ భాషలో కోపం.[4][5] ఉమ్మడి తుపాన్ హెచ్చరిక కేంద్రం (JTWC) దానిని కేటగిరీ 1 స్థితికి అప్‌గ్రేడ్ చేసింది.[6] మైక్రోవేవ్ ఇమేజింగ్ బాగా వ్యవస్థీకృత వ్యవస్థను చూపుతున్నందున భారత వాతావరణ శాఖ (IMD) దానిని తీవ్ర తుపానుగా పరిగణించింది.[7] అసని తుపాను ఆంధ్రప్రదేశ్‌ సహా భారతదేశంలోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది.

తుపాను గమనం[మార్చు]

మే 8 - బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి తుపానుగా మారి వాయవ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది.

మే 9 - బంగాళాఖాతం మధ్యలో ప్రస్తుతానికి గంటకు 115-125 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను కారణంగా 9, 10, 11, 12 తేదీల్లో సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 10, 11 తేదీల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

మే 10 - ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని  తుపాను కొనసాగుతోంది. ప్రస్తుతం కాకినాడ, విశాఖలకు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ, వాయవ్య దిశగా 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా అసని కదులుతోంది. అసని తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

మే 11 - ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుపాను, తుపానుగా బలహీన పడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 12 కి.మీ. వేగంతో అసని తుపాను కదులుతోంది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి తుపాను రానుంది. కాకినాడ వద్ద మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మే 12 సాయంత్రానికి వాయుగుండంగా ఈ తుపాను బలహీనపడనుంది.

మే 12 - భారీ వర్షాలు, ఈదురు గాలులతో మూడు రోజులుగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. మే 11న తుపానుగా మారిన అసని రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా బలహీనపడి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.[8] గత రాత్రి కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద తీరం దాటే సమయంలో 55 నుంచి 75 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి.

మే 13 - అల్ప పీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే నేటి నుంచి నాలుగు రోజుల పాటు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

అసని తుపాను ఆంధ్రాతీరంలో మే 12 వేకువజామున బలహీనపడిన ప్రభావంతో రాజధాని చెన్నైతో పాటు తమిళనాడులో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలున్నాయి.[9]

మూలాలు[మార్చు]

  1. "North Indian Ocean Extended Range Outlook for Cyclogenesis" (PDF). rsmcnewdelhi.imd.gov.in. New Delhi, India: India Meteorological Department. May 5, 2022. Archived from the original (PDF) on 2022-05-07. Retrieved May 7, 2022.
  2. "Tropical Weather Outlook for the North Indian Ocean (the Bay of Bengal and the Arabian Sea)" (PDF). rsmcnewdelhi.imd.gov.in. New Delhi, India: India Meteorological Department. May 6, 2022. Archived (PDF) from the original on 2022-05-07. Retrieved May 6, 2022.
  3. R.K Jenamani (May 8, 2022). "Tropical Cyclone Advisory No.1 for the North Indian Ocean (the Bay of Bengal and the Arabian Sea)" (PDF). rsmcnewdelhi.imd.gov.in. New Delhi, India: India Meteorological Department. Archived from the original (PDF) on 2022-05-08. Retrieved May 8, 2022.
  4. "Naming of Tropical Cyclones over the North Indian Ocean" (PDF). rsmcnewdelhi.imd.gov.in. New, Delhi: India Meteorological Department. Archived from the original (PDF) on September 25, 2021. Retrieved September 25, 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; సెప్టెంబరు 3, 2021 suggested (help)
  5. Simran Kashyap (May 6, 2022). "How Cyclone Asani got its name? Why naming is important?". www.oneindia.com. New Delhi, India: Oneindia. Archived from the original on May 9, 2022. Retrieved May 8, 2022.
  6. Prognostic Reasoning for Tropical Cyclone 02B (Asani) Warning No. 5 (Report). United States Joint Typhoon Warning Center.
  7. R.K Jenamani (May 8, 2022). "Tropical Cyclone Advisory No.5 for the North Indian Ocean (the Bay of Bengal and the Arabian Sea)" (PDF). rsmcnewdelhi.imd.gov.in. New Delhi, India: India Meteorological Department. Archived from the original (PDF) on 2022-05-09. Retrieved May 8, 2022.
  8. "asani cyclone: తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన అసని.. ఉత్తర కోస్తాలో అపార నష్టం - cyclone asani landfall between machilipatnam and narasapuram after weakening into a deep depression | Samayam Telugu". web.archive.org. 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Rain alert.. రేపు 11 జిల్లాలకు భారీ వర్షసూచన - Andhrajyothy". web.archive.org. 2022-05-13. Archived from the original on 2022-05-13. Retrieved 2022-05-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)