అసిటిలిన్ గ్యాసు సిలిండరు
అసిటిలిన్ గ్యాసును సిలిండరులలో నింపి, వెల్డింగుచెయ్యు ప్రదేశంకు సిలిండరును తీసికెళ్లెదరు.అసిటిలిన్ సిలిండరుకు మరూన్ (maroon) రంగు వెయ్యబడివుండును.[1] సిలిండరు పొడవుగా గొట్టం (వర్తులాకారం) లో వుండును. అడుగు భాగంలోపలికి (పుటాకారంగా) నొక్కబడివుండును. పైభాగంచివర అర్ధగోళాకారంగా వుండి దానికి కవాటం (valve) వుండును. కవాటానికి మరలు ఎడమ వైపుకు తిరెగేలా వుండును.అంతేకాక వాటిమీద మరలదిశను గుర్తుకు తెచ్చెలా చిన్న గాట్లు వుండును. సిలిండరును రవాణా చెయ్యునప్పుడు కవాటం దేనినైన తాకి పాడవ్వకుండగా దానిమీద ఒక రక్షక టోపి (protector cap) వుండును. సిలిండరును ఉక్కులోహంతో 1552KN/M2 (15.5 బారు) వత్తిడిని తట్టుకొనేలా చెయ్యబడివుండును.[2] సిలిండరులో 2800 నుండి 5800 లీటర్ల వాయువును వత్తిడితో సంకోచింపచేసి, సిలిండరులో నింపడం జరుగుతుంది.సిలిండరు లోపలి వ్యాసం 30 సెం.మీ (12 అంగుళాలు) వుండును.సిలిండరు పొడవు 101.25 సెం.మీ (40.5 అంగుళాలు) సిలిండరు యొక్క గోడ మందము 4.38 మి.మీ (.175 అంగుళాలు) వుండును.[3] సిలిండరులోపల స్పాంజి వంటి రంద్రాలు అనేకంగా వున్న ఒకపదార్థం నింపబడివుండును.మొదటి రోజుల్లో బల్సా (balsa) చెక్క లేదా అటువంటి పదార్థాన్ని నింపేవారు.ప్రస్తుతం డైఅటొమస్ అనేఒకరకం మన్ను (ఒకరకమైన సున్నపురాయికలిగినది), కర్రబొగ్గు, అస్బెటొస్, సిమెంట్ తో తయారుచేసిన మిశ్రమాన్ని సిలెండరులోపల నింపుచున్నారు.[4] ఇలా నింపబడిన స్పాంజివంటి పదార్థం అసిటోన్/ఆసిటొన్ (Acetone) అనే రసాయన ద్రావణిచే సంతృప్తపరచబడి (saturated) వుండును.ఎక్కువ వత్తిడి వద్ద అసిటిలిన్ వాయువు స్థిరత్వం కలిగి వుండని కారణంగా, అధిక వత్తిడివద్ద అసిటిలిన్ గ్యాసును అసిటోన్ ద్రావణిలో కరగించి/శోషింపచేసి వుంచెదరు.అసిటోను అధికమొత్తంలో అసిటిలిన్ వాయువును తనలో కరగించుకొని, వత్తిడితగ్గెకొలది దానికనుగుణ్యంగా వాయువును విడుదల చేయును.లోపలి స్పాంజివంటి పదార్థం నెమ్మదిగా విడుదల అయ్యేటందుకు సహకరించును.అసిటిలిన్ వాయుచు సిలిండరును ఎప్పడు నిలువుగానే వుంచవలెను.సిలిండరు యొక్క కవాటాన్ని (వాల్వు/valve) దానిని తెరచుటకై నిర్దేశించిన రించ్ (wrench) తో మాత్రమే తెరచవలెను.కవాటానికి బిగించిన రబ్బరుగొట్టానికి ఒక ఫ్లాష్ అరెష్టరు (Flash arrester) అమర్చవలెను, పొరబాటున నాజిల్ వద్దనున్న మంటగొట్టంలో వెనుకకు ప్రవహించినప్పటికి, అసిటిలిన్ సిలెండరులోకి వెళ్ళకుండ మంటను ఫ్లాష్ అరెస్టరు ఆర్పుతుంది. రక్షణకై అసిటిలిన్ సిలెండరుకు ఒకటికాని, రెండుకాని అధికఉష్ణోగ్రతవద్ద కరిగే విధంగా కరిగే బిరడా (fusible Plug) ను అమర్చబడివుండును.సిలెండరు ఉష్ణోగ్రత్త 1040C చేరగానే ఫ్లుజిబుల్ ఫ్లగ్ కరిగి సిలెండరులోని అసిటిలిన్ వాయువు బయటికి ప్రవహిస్తుంది.
అసిటిలిన్ వాయువు అనునది ఒక కార్బోహైడ్రొజను సమ్మేళనం.ఇది కర్బన సమ్మేళనాలలో అల్కైన్ (alkyne) సమూహంలేదా వర్గానికి చెందినది.వర్ణరహితమైన వాయువు. అతి త్వరగా వేగంగా మండే, ప్రేలుడు స్వాభావమున్నది.దినిని ఈథైన్ (ethyne) అనికూడా వ్యవరిస్తారు.అసిటిలిన్ అణువులో రెండు కార్బను (కర్బనం),, రెండు హడ్రొజను (ఉదజని) అణువులు సంయోగం చెంది యుండును.కార్బను-కార్బను పరమాణువు (atom) ల మద్య మూడు ద్విబంధాలున్నాయి.ఫార్ములా C2H2[5].అసిటిలిన్ వాయువును ఆక్సిజనుతో కలిపి మండించి నప్పుడు బొగ్గుపులుసు వాయువు, నీరు ఏర్పడి, అధిక మొత్తంలో ఉష్ణం విడుదల అగును. ఆక్సిజనుతో అసిటిలిన్ రెండు దశలలో దహనచర్య జరుపుతుంది.మొదటి దశలో అసిటిలిన్ వాయువులోని కార్బను అక్సిజనుతో చర్య జరపడం వలన కార్బనుమొనాక్సైడు, ఉదజని వాయువు,, కొంతం ఉష్ణశక్తి విడుదల అగును.రెండో దశలో కార్బనుమొనాక్సైడు, ఉదజని అణువులు అక్సిజనుతో చర్య జరపడంవలనకార్బనుడయాక్సైడు, నీటి అణువులు, ఉష్ణశక్తి వెలువడును.[6] దహన చర్య. మొదటి దశ.
దహన చర్య. రెండోదశ:
అసిటిలిన్ వాయు జనకాలు
[మార్చు]గ్యాసు వెల్డింగులో ఉపయోగించు అసిటిలిన్ గ్యాసును సిలెండరులో నింపి వెల్డింగు లేదా కటింగు సమయంలో వాడుట పరిపాటి.అయితే ఎక్కువ పరిమాణంలో వెల్డింగు చేయు అవసరమున్నప్పుడు వెల్డింగు చేయు ప్రదేశం వద్ద అసిటిలిన్ వాయువును ఉత్పత్తి చేసి వెల్డింగులో ఉపయోగిస్తారు.అసిటిలిన్ ను ఉత్పత్తి చేయు పరికరాన్ని అసిటిలిన్ జనకం (acetylene Generator) ఆంటారు.అయితే ఈ అసిటిలిన్ వాయు జనకాలు ఉత్పత్తి చెయ్యు వాయువు వత్తిడి అధికంగా వుండదు. వత్తిడి 0.1 నుండిం.6 బార్ వుంటుంది.
అసిటిలిన్ వాయు జనకాలు రెండురకాలు.1.తక్కువ వత్తిడి వాయు జనకం,2.మధ్యస్త వత్తిడి వాయుజనకం.
1.తక్కువ వత్తిడి అసిటిలిన్ వాయు జనకం:ఇందులో ఉత్పత్తి అగు అసిటిలిన్ వాయువు వత్తిడి 0.1 బార్ లేదా అంతకన్న తక్కువ వుందును.ఇలాంటి వాయు జనకంలో వాయు వుత్పత్తి పరిమాణం 15లీటర్లు నిమషానికి వుంటుంది.ఈ రకం వాయు జనక పరికరాన్ని సులభంగా ఒక చోటునుండి మరో చోటుకు సులభంగా తీసుకెళ్లవచ్చును.
2.మధ్యస్త వత్తిడి అసిటిలిన్ వాయు జనకం:ఈ వాయు జనక పరికరంలో వుత్పత్తి అగు వాయువు వత్తిడి 0.6బార్ (15PSI) వరకుంటుంది.మధ్యస్త వత్తిడి వాయుజనకాల్లో 200 నుండి 3000 వేలలీటర్ల వరకు వాయువును ఉత్పత్తి చేయు రకాలున్నాయి.ఈ రకం వాయు జనకాలను ఒక చోటు నుండి మరో చోటుకు తరలించుటకు వీలుకాదు.ఇలాంటి వాటిని, వర్కుషాపుల వద్ద ఒకేచోట స్థిరంగా వుంచెదరు.
కాల్సియం కార్బైడు
[మార్చు]అసిటిలిన్ వాయువును కాల్సియం కార్బైడ్ (calcium carbide) అను తెల్లగా వున్నకాల్సియం-కార్బను సమ్మేళన పదార్థాన్ని నీటితో చర్య జరిపించి ఉత్పత్తి చెయ్యడం జరుగుతుంది.కాల్సియం కార్బైడు ఫార్ములా CaC2.సున్నపురాయి లేదా క్విక్ లైమ్, బొగ్గును సంయోగపరచటం వలన కాల్సియంకార్బైడు ఉత్పత్తి చెయ్యబడును.[7]
కాల్సియం కార్బైడు నీటితో చర్య జరపడం వలన అసిటిలిన్ వాయువు ఉత్పత్తి
కాల్సియం కార్బైడును నీటితో చర్యనొందించడం వలన అసిటిలిన్ వాయువును ఉత్పత్తి చెయ్యవచ్చునని సా.శ.1862 లో ఫ్రెడ్రిచ్ హోలెర్ (Friedrich Wöhler) కనుగొన్నాడు.[8]
ఎక్కువ ప్రమాణంలో, అధిక వత్తిడిలో అసిటిలిన్ వాయువు అవసరమైనచో ఒకటికన్న ఎక్కువ సిలెండరులను సమాంతరశ్రేణి (manifold) లో కలిపి ఉపయోగిస్తారు.ఈ విధానాన్ని మాన్ ఫోల్డింగు పద్ధతి అంటారు. అసిటిలిన్, ఆక్సిజను వాయు సిలెండరుకు ఉపయోగించు, ప్రెసరు రెగ్యులెటరు, రెంచిలు రెండు వేరు, వేరుగా వుండి, రెగ్యులెటరు మరలు (threads) సవ్య, అప సవ్యదిశలలో వుండి, అక్సిజను సిలెండరు రెగ్యులెటరు, అసిటిలిన్ సిలెండరుకు, అసిటిలిన్ రెగ్యులెటరు ఆక్సిజను సిలెండరుకు బిగించుటకు వీలుకాని విధంగా నిర్మించబడివుండును. రెగ్యులెటరు మీద ఏ వాయువునకు సంబంధినదో తెయునట్లు గుర్తులు, గాట్ల రూపంలో వుండును.
మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-03-19. Retrieved 2013-11-02.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-08. Retrieved 2013-11-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-27. Retrieved 2013-11-02.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-03-10. Retrieved 2013-11-02.
- ↑ http://www.thefreedictionary.com/acetylene
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-15. Retrieved 2013-11-03.
- ↑ http://www.thefreedictionary.com/calcium+carbide
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-27. Retrieved 2013-11-03.