Jump to content

అసైలేషన్

వికీపీడియా నుండి

అసైలేషన్  ఒక సమ్మేళనంతో అసైల్ గ్రూపును జోడించే ప్రక్రియ. అసైల్ గ్రూప్ అందించే సమ్మేళనాన్ని అసైలేటింగ్ ఏజెంట్ అంటారు.

అసైల్ హలైడ్లు లోహ ఉత్ప్రేరకాలతో చర్య జరిపినపుడు అవి బలమైన ఎలెక్ట్రోఫైల్స్ ను ఏర్పరుస్తాయి కాబట్టి వాటిని తరచుగా ఈ విధానంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఫ్రీడెల్ - క్రాఫ్ట్స్ అసైలేషన్ చర్యలో ఎసిటైల్ క్లోరైడ్ (CH3COCl) ను అసైల్ గ్రూపును జోడించే సమ్మేళనం గాను, అల్యూమినియం క్లోరైడ్ (AlCl3) ను ఉత్ప్రేరకం గా ఉపయోగించినపుడు "ఎసిటైల్" (CH3CO-) బెంజీన్కు జోడించబడుతుంది.

Friedel-Crafts acylation of benzene by ethanoyl chloride
Friedel-Crafts acylation of benzene by ethanoyl chloride

పై చర్యా విధానమును ఎలెక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ ప్రతిక్షేపణ చర్య అంటారు.

అసైల్ హాలైడ్లు, కార్బాక్సిలిక్ ఆమ్లాల ఎన్‌హైడ్రైడ్లు సాధారణంగా అసైలేట్ అమైన్ల నుండి అమైన్లు గానూ లేదా అసైలేట్ ఆల్కహాల్ లనుండి ఎస్టర్లుగా మారుటకు అసైలేట్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అమైన్లు, అల్కహాళ్ళు నూక్లియోపైల్స్: నూల్కియోఫిలిక్ అసైల్ ప్రతిక్షేపణచర్య విధానం. సఖినిక్ ఆమ్లం సాధారణంగా ప్రత్యేక రకమైన అసైలేషన్ కు సాధారణంగా ఉపయోగపడుతుంది. దీనిని సఖినేషన్ ఆంటారు. ఎక్కువ సఖినేషన్ చర్య ఒక సఖినేట్ కలసి ఏకబంధం ఏర్పడినపుడు ఏర్పడుతుంది.[1] ఆల్కలేషన్ లో సాధారణంగా సంభవించే పునరమరిక చర్యలను నివారించుటకు అసైలేషన్ ను వడుతారు.

మూలాలు

[మార్చు]
  1. Vollhardt, Peter; Schore, Neil (2014). Organic Chemistry: Structure and Function (7th ed.). New York, NY: W.H. Freeman and Company. pp. 714–715. ISBN 978-1-4641-2027-5.
"https://te.wikipedia.org/w/index.php?title=అసైలేషన్&oldid=3390218" నుండి వెలికితీశారు