ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.
Jump to navigation
Jump to search
'వరుస సంఖ్య | విషయం | చిహ్నం |
1 | రాష్ట్ర గీతం | మా తెలుగు తల్లికి మల్లె పూదండ |
2 | రాష్ట్ర గీత రచయిత | శంకరంబాడి సుందరాచారి |
3 | రాష్ట్ర చిహ్నం | పూర్ణకుంభం |
4 | రాష్ట్ర క్రీడ | కబాడీ |
5 | రాష్ట్ర పక్షి | రామచిలుక |
6 | రాష్ట్ర వృక్షం | వేప చెట్టు |
7 | రాష్ట్ర ఫలం | మామిడి పండు |
8 | రాష్ట్ర జంతువు | కృష్ణ జింక |
9 | రాష్ట్ర పువ్వు | మల్లెపువ్వు |
చిత్రమాలిక
[మార్చు]-
శంకరంబాడి సుందరాచారి
-
పూర్ణకుంభం
-
గ్రామాలలో కబాడీ ఆడుతున్న దృశ్యము
-
06-06-2018 నుంచి కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు G.O No.59
-
రామచిలుక
-
వేప చెట్టు
-
మామిడి పండు
-
కృష్ణ జింకలు
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.