ఆంధ్రానిక్ వోస్కన్యాన్
వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
జనన తేదీ | 1990 ఏప్రిల్ 11 | ||
జనన ప్రదేశం | యెరెవాన్, ఆర్మేనియా | ||
ఎత్తు | 1.85 మీ. (6 అ. 1 అం.) | ||
ఆడే స్థానం |
డిఫెండరు మిడ్-ఫీల్డరు | ||
క్లబ్ సమాచారం | |||
ప్రస్తుత క్లబ్ | అలష్కర్ట్ ఎఫ్.సి. | ||
సంఖ్య | 4 | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
2008–2015 | ఎఫ్.సి.మికా | 114 | (6) |
2015– | అలష్కర్ట్ ఎఫ్.సి. | 42 | (0) |
జాతీయ జట్టు‡ | |||
2011 | అర్మేనియా U-21 యువ జట్టు | 7 | (0) |
2012– | ఆర్మేనియా జాతీయ ఫుట్ బాల్ జట్టు | 1 | (0) |
† Appearances (Goals). |
ఆంధ్రానిక్ వోస్కన్యాన్ (జననం, 1990 ఏప్రిల్ 11) ఒక ఆర్మేనియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను ప్రస్తుతం ఆర్మేనియన్ జాతీయ జట్టు, ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్ క్లబ్ అలష్కర్క్ ఎఫ్.సి.లో డిఫెండర్ గా తన పాత్ర పోషించారు.
క్లబ్ కెరీర్
[మార్చు]ఆంధ్రానిక్ వోస్కన్యాన్ కు ఫుట్బాల్ అంటే చిన్ననాటి నుండి ఇష్టము. అతను మొదటి గ్రేడ్ లో ఉన్నప్పుడు, ఒక ఫుట్బాల్ కోచ్ ఫుట్బాల్ అంటే ఇష్టం ఉన్న పిల్లల కోసం వాళ్ళ పాఠశాలను సందర్శించారు. వోస్కన్యాన్ ఆ అవకాశం వదులుకోకుండా శిక్షణకు వెళ్ళడం ప్రారంభించారు. అతను తన కెరీర్ ను మల్టియా యెరెవాన్ ఫుట్బాల్ పాఠశాలలో (ఇప్పుడు ఆ పాఠశాల బననాంట్స్ యెరెవాన్ యొక్క ఆస్తి) హకోబ్ అండ్రెయాస్యాన్ నేతృత్వంలో ప్రారంభించారు.
అతను ఆర్మేనియన్ మొదటి లీగ్ లో మిక-2 ను 2008వ సంవత్సరంలో ఆడారు. రెండు సంవత్సరాల తరువాత, వోస్కన్యాన్ యొక్క తొలి పరిచయాం మిక యెరెవాన్ ద్వారా ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అయ్యింది. అతను ఆ సంవత్సరం మూడు ఆటలు ఆడారు. 2011 లో జరిగిన సీజన్ లో, అతను ఒక స్టార్టర్ డిఫెన్సు స్థానాన్ని, ఒక ప్రధాన ఆటగాడిగా అవతరించారు. 2011-12 యు.ఇ.ఎఫ్.ఎ యూరోపా లీగ్ లో, మికాకు వ్యతిరేకంగా నార్వేజియన్ క్లబ్ వలెరెంగా ఫూట్బాల్ తో జరిగిన మ్యచ్ లో వోస్కన్యాన్ ఆడలేదు, అతను ఆ మ్యాచ్ అంతటా టచ్-లైన్లలో ఉండిపోయారు.[1][2]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2011లో, ఆర్మేనియన్ జాతీయ జట్టు చీఫ్ కోచ్ వోస్కన్యాన్ యొక్క నైపుణ్యాలను చూసి అతన్ను అర్మేనియా U-21 యువ జట్టులోకి నియమించుకున్నారు. అదే సంవత్సరంలో జూన్ 7 న అతను క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఆడి తొలి యువత జాతీయ జట్టులోకి చేరి 2013 యు.ఇ.ఎఫ్.ఎ యూరోపియన్ అండర్-21 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఆడారు. తన తొలి ప్రారంభ మ్యాచ్ మోంటెనెగ్రో U-21 యువ జట్టు కు వ్యతిరేకంగా వచ్చింది, ఇందులో ఆర్మేనియన్ యూత్ 4-1తో అణిచివేయబడింది.[3] అతను యువ జట్టులో 5 ఆటలు ఆడగా అన్నీ 2011లోనే ఉన్నాయి.
ఫిబ్రవరిలో, అతను ఆర్మేనియా జాతీయ ఫుట్ బాల్ జట్టు లోకి ప్రవేశించారు. తన తొలి మ్యచ్ సెర్బియాకు వ్యతిరేకంగా ఒక స్నేహపూర్వక మ్యాచ్. వోస్కన్యాన్ ఆటలో 77వ నిముషంలో వరజ్డాత్ హరోయాన్ కు బదులుగా ప్రవేశించారు, కానీ 0-2తో ఆర్మేనియా ఓటమితో మ్యాచ్ పూర్తయ్యింది.[4]
గౌరవాలు
[మార్చు]క్లబ్
[మార్చు]ప్యునిక్ యెరెవాన్
- ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్లో రన్నర్-అప్ (1) : 2009
- ఆర్మేనియన్ కప్పు (1) : 2011
- ఆర్మేనియన్ సూపర్-కప్పు (1) : 2012-13
సూచనలు
[మార్చు]- ↑ "Vålerenga vs. Mika 1 - 0". Soccerway.com. Retrieved 28 March 2013.
- ↑ "Mika vs. Vålerenga 0 - 1". Soccerway.com. Retrieved 28 March 2013.
- ↑ "Armenia U21 vs. Montenegro U21 4 - 1". Soccerway.com. Retrieved 28 March 2013.
- ↑ "Armenia vs. Serbia 0 - 2". Soccerway.com. Retrieved 28 March 2013.