ఆకొండి వేంకటకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకొండి వేంకటకవి ప్రముఖ తెలుగు కవి. ఇతడు 1820 ప్రాంతమువాడు.

వీరి తండ్రి: జగన్నాధ శాస్త్రి. తల్లి: అచ్చమాంబ. వీరి నివాసము: విశాఖపట్టన మండలములోని గజరాయనివలస.

రచనలు

[మార్చు]
  • తత్త్వసంగ్రహ రామాయణము.
  • శతకములు: మూడు (ఆముద్రితములు).

తత్త్వసంగ్రహ రామాయణము

[మార్చు]

ఈ కవిచే నాంధ్రీకరింపబడిన "తత్త్వసంగ్రహ రామాయణము" నందలి బాలకాండము ఆంధ్ర విజ్ఞాన సమితి వెలువరించినది. ఈ రామాయణమును సంస్కృతములో రచించినవారు శ్రీ బ్రహ్మానందభారతీ స్వాములు. భారత, విష్ణు, కూర్మ బ్రహ్మాండాది నానా పురాణములనుండి సంగ్రహింపబడిన కథ లెన్నో యిందున్నవి. ఈ వేంకటకవి మేనమామలు పెద్ద పండితులు. వారిని గూర్చి కావ్యాది నిట్లు చెప్పుకొనెను:

సీ. పండిత దృమ మనఃపల్లవముకుళ వుష్ప వికాస జైత్రుండు పాత్ర సూరి
స్వాభ్యంత నిఖిల శాస్త్రాబ్ధి జిన్ఞానామృతేష్టానుభవుడు కౌరీణ్మనీషి
ప్రభుసభాప్రథిత విద్వజ్జయేద్బవ మహో న్నత నద్యశుడు జగన్నాథ శాస్త్రి
స్వకృత ప్రబంధ పుష్ప గుళుచ్ఛసురభితార్ణవ మధ్య దేశుండు రామసుకవి

 గీ.. యనదగు సమాఖ్య లొప్ప భూమ్యధిప దత్త
మణివలయుకుండలాది భూషనము లమర
నలుపు మీఱ జెలంగునా నలుపు రైన
మాతులుల కెఱగెద గీర్తి మాతులులకు.

మూలాలు

[మార్చు]
  • ఆకొండి వేంకటకవి, ఆంధ్ర రచయితలు : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950. పేజీలు: 50-2.