Jump to content

ఆఖరి యోధులు స్వతంత్ర పోరాట పదాతి సైనికులు

వికీపీడియా నుండి

ఆఖరి యోధులు (స్వతంత్ర పోరాట పదాతి సైనికులు) ఆఖరి యోధులు(స్వతంత్ర పోరాట పదాతి సైనికులు), రచయిత మెగాసెసే అవార్డు గ్రహీత శ్రీ పి.సాయినాథ్, తెలుగు అనువాదం శ్రీ ఎస్.వినయకుమార్. నవతెలంగాణ ప్రచురణ సంస్థ ప్రచురణ.

సాయినాథ్ సుప్రసిద్ధ జర్నలిస్టు. ఎన్నో ఏళ్లుగా శ్రమించి, మనం మరచిన స్వాతంత్ర్య స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న త్యాగధనుల చరిత్రలను ఈ గ్రంథం ద్వారా పరిచయం చేశారు. ఆనాటి విస్తృత పోరాటవీరుల కథలను, వారి త్యాగాలను, సాహస గాథలను గ్రంథస్థంచేసి పరిచయం చేశారు.

ఈ 260 పుటల పుస్తకంలో సాధారణ పాఠకులకు తెలియని అజ్ఞాత వీరులను, ఎటువంటి గుర్తింపు, సహాయం లేకుండా, కటిక పేదరికంలో జీవిస్తున్న దేశభక్తుల త్యాగాులను, ఫోటోలను సేకరించి ఇందులో ఇచ్చారు. ప్రొఫెసర్ రొమెలా థాపర్ వంటి చరిత్రకారుల ప్రశంసలను అందుకొన్న గ్రంథం ఇది.

ఈ పుస్తకంలో 16 భాగాలున్నాయి. పోరాటంలో పాల్గొన్న తిరుగుబాటు దారులు, నటులు, సిపాయిలు, గూఢచారులుగా పనిచేసినవారి చరిత్రలు, బ్రిటిష్ సామ్రాజ్యంపై విరుచుకుపడిన శ్రీమతి చేమంతిదేవి సాలిహాన్ వంటి వీరవనితల పోరాట చరిత్ర వీరు గ్రంథస్థం చేయకపోయివుంటే ఎవరికీ తెలిసేదికాదు. తెలంగాణలో 'స్వరాజ్యం కోసం తపన' వంటి భాగాలు బాగా ఆసక్తి రేకెత్తించేవి. పుస్తకమంతా ఆసక్తికరంగా ఉంది. మనం విస్మరించిన దేశభక్తులు చరిత్ర, చరిత్ర పుటలకెక్కని పోరాటాల చరిత్ర. తప్పక చదవవలసిన రచన.


మూలాలు

[మార్చు]
  • ఆఖరి యోధులు(స్వతంత్ర పోరాట పదాతి సైనికులు), ఆంగ్ల గ్రంథం రచయిత:మెగాసెసే అవార్డు గ్రహీత శ్రీ పి.సాయినాథ్, తెలుగు అనువాదం: శ్రీ ఎస్.వినయకుమార్, నవతెలంగాణ సంస్థ ప్రచురణ.