ఆచంట శారదాదేవి
Appearance
ఆచంట శారదాదేవి | |
---|---|
జననం | శారదాదేవి 1922 |
మరణం | 1999 |
వృత్తి | అధ్యాపకురాలు |
పద్మావతి కళాశాల, తిరుపతి | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత్రి |
గుర్తించదగిన సేవలు | పారిపోయిన చిలుక ఒక్కనాటి అతిథి |
జీవిత భాగస్వామి | ఆచంట జానకీరామ్ |
ఆచంట శారదాదేవి 1922లో విజయవాడలో జన్మించేరు. తెలుగు యం.ఏ. పట్టభద్రులు. ఇంగ్లీషు యం.ఏ. చదివేరు కానీ పరీక్ష రాయలేదు., హిందీ విశారద డిప్లమా ఉంది .సంస్కృతం పరిచయం ఉంది. సంగీతం నేర్చుకున్నారు. 1945నుండి చిన్న కథలు రాయడం ప్రారంభించేరు. 1954నుండి 1977వరకూ తిరుపతి పద్మావతి కాలేజీలో తెలుగు లెక్చరరుగా పని చేసేరు. 1944లో ఆచంట జానకిరామ్ తో వివాహం అయింది. 1999లో ఆమె మరణం తిరపతిలో సంభవించింది.
కథా సంకలనాలు
[మార్చు]- పారిపోయిన చిలుక. విజయవాడ, ఆదర్శ గ్రంథమండలి, 1963
- ఒక్కనాటి అతిథి. విజయవాడ, ఆదర్శ గ్రంథమండలి, 1965.
- మరీచిక. విజయవాడ, ఆదర్శ గ్రంథమండలి, 1969
- వానజల్లు. హైదరాబాదు, సాహితి, 1991.