Coordinates: 8°28′N 76°58′E / 8.47°N 76.96°E / 8.47; 76.96

అట్టుకల్ భగవతి క్షేత్రం

వికీపీడియా నుండి
(ఆట్టుకాలమ్మ భగవతి క్షేత్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అట్టుకల్ భగవతి క్షేత్రం
అట్టుకల్ భగవతి క్షేత్రం is located in Kerala
అట్టుకల్ భగవతి క్షేత్రం
కేరళ పటంలో క్షేత్రం
భౌగోళికం
భౌగోళికాంశాలు8°28′N 76°58′E / 8.47°N 76.96°E / 8.47; 76.96
దేశంభారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాతిరువనంతపురం
ప్రదేశంఅట్టుకల్
సంస్కృతి
దైవంభద్రకాళి/దుర్గ/కణ్ణగి
ముఖ్యమైన పర్వాలుఅట్టుకల్ పొంగల్
చరిత్ర, నిర్వహణ
వెబ్‌సైట్Attukal Bhagavathy Temple

అట్టుకల్ భగవతి క్షేత్రం, మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ దేవాలయం, కేరళలోని 'తిరువనంతపురంలో ఉంది. అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఓ ఆసక్తికరమైన జానపద కథ వినిపిస్తుంది.

కథనం[మార్చు]

పూర్వం కన్నగి - కోవలన్ అనే దంపతులు ఉండేవారు. పేదరికం తమ పట్ల విశ్వరూపాన్ని చూపుతున్నా వాళ్లెప్పుడూ చింతించలేదు. తమ పరిస్థితిని భగవంతుడి చెంత ఏకరువు పెడుతూ ఆయనని నిందించనూలేదు.

అలాంటి పరిస్థితుల్లో చేయని నేరానికి కోవలన్ శిక్షించబడతాడు. మహాపతివ్రత అయిన కన్నగి, తన భర్తను అంతం చేసిన పాండ్యరాజు ఆస్థానంలో మహా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆ తరువాత ఆమె అక్కడి నుంచి వెనుదిరిగి వెళుతూ అలసిపోయిన కారణంగా ఈ ప్రదేశంలో సేదతీరిందట. ఈ ప్రదేశంలోనే నేడు మనకి ఆమె ఆలయం దర్శనమిస్తుంది. ఆ రోజున అలసిన ఆమెకి ఇక్కడి గ్రామస్థులు ఆహారంగా ఏవైతే అందించారో, అవే నేటికీ నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

మరో కథనం[మార్చు]

స్థలపురాణం ప్రకారం మరో కథ కూడా చెబుతారు. పూర్వం కేరళలోని ముల్లొవీడు కుటుంబానికి చెందిన యజమాని (కరనవర్) కి ఒక కల వచ్చిందట. దాంట్లో ఆయన కిల్లియర్ నదిలో స్నానానికి వెళ్లారు. ఆవలి తీరం నుంచి ఒక అమ్మయి రక్షించమని కేకలు వేసింది. నీటి వేగాన్ని ఎదురీదే శక్తి, స్థితి ఆయనకు లేకపోయినా ఈదాడు. తేజోమైమయిన బాలికను చూసి మేల్కోన్నాడు. మర్నాడు కూడా కలలో దేవి ప్రత్యక్షమై నదీ తీరంలో మూడు గీతలు ఉన్న చోట ఆలయం నిర్మించమంది. ఆ ప్రకారం నిర్మించినదే ఈ ఆలయం అని చెప్తారు.[1]

ఆలయ విశేషాలు[మార్చు]

ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ఆవరణలో నిర్మించబడిన ఈ ఆలయం, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. కన్నగిని అమ్మవారి అవతారంగా భావించి అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ఆమె ఆవేదనను చల్లార్చి ఆనందాన్ని కలిగించడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలను జరుపుతుంటారు. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించడానికి వేలాదిగా మహిళా భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆమెకి కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు. శబరిమలను పురుషులు మాత్రమే దర్శించునట్టు, స్త్రీలు మాత్రమే ఆట్టుకాలమ్మను దర్శిస్తూ వుండటం ఇక్కడి విశేషం.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రాజగోపాలన్, భవానీ చీరత్ (1998-03-22). "మహిళల పాలిటి శబరిమల ఆట్టుక్కాల్ కోవెల". ఈనాడు ఆదివారం.

వెలుపలి లంకెలు[మార్చు]