Jump to content

ఆత్మిక

వికీపీడియా నుండి
ఆత్మిక
జననం
ఆత్మిక బానుచంద్రన్

(1995-02-09) 1995 ఫిబ్రవరి 9 (వయసు 29)
విద్యఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
మీసయ మురుక్కు (2017)

ఆత్మిక (జననం 1995 ఫిబ్రవరి 9) తమిళ సినిమా రంగానికి చెందిన భారతీయ నటి, మోడల్. మీసాయ మురుక్కు (2017)తో అరంగేట్రం చేసిన ఆమె తన తొలి చిత్రంతోనే ప్రసిద్ధి చెందింది.

ఆమె తన తమిళ సినిమాలు తెలుగులో విజయ్ రాఘవన్ (2022), నరకాసురుడు (2023)[1] చిత్రాలుగా విడుదలవడంతో టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపుపొందింది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆత్మిక కోయంబత్తూరులో జన్మించింది. చెన్నైలోని ఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[2]

కెరీర్

[మార్చు]

రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్‌లో నటించడం ద్వారా ఆత్మిక తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. కాలేజీ రోజుల్లో నటన పట్ల ఆసక్తితో ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. అప్పుడే కొన్ని మోడలింగ్ అసైన్‌మెంట్‌లు కూడా చేసింది. ఆన్‌లైన్‌లో ఆమె ప్రొఫైల్‌ను చూసిన హిప్‌హాప్ తమిజాకి చెందిన ఆది ఆమెకు మీసాయ మురుక్కులో మహిళా ప్రధాన పాత్రకు ఎంపికచేసాడు.[3][4] ఆ సినిమాలో ఆత్మిక నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.[5][6][7][8] ఆమె 2017లో కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన తన రెండవ చిత్రం నరగాసూరన్‌కు సంతకం చేసింది. అదే సంవత్సరంలో ఆమె OPPO చెన్నై టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2017లో న్యాయనిర్ణేతగా పనిచేసింది.[9]

2018లో మూడు మహిళా ప్రధాన పాత్రలలో కట్టేరిలో ఓవియా స్థానంలో ఆత్మిక నటించింది.[10] ఫిబ్రవరి 2019లో ఉదయనిధి స్టాలిన్‌తో కన్నై నంబాతే,[11].సెప్టెంబర్ 2020లో ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన కోడియిల్ ఒరువన్[12] చిత్రాలలో ఆమె నటించింది.[13][14]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2017 మీసాయ మురుక్కు నీలా
2021 కోడియిల్ ఒరువన్ వేధవతి
2022 కట్టేరి కామిని
2023 కన్నై నంబాతే దివ్య [15]
తిరువిన్ కురల్ భవానీ [16]

మూలాలు

[మార్చు]
  1. "naragasooran first look release - Sakshi". web.archive.org. 2023-06-02. Archived from the original on 2023-06-02. Retrieved 2023-06-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. IndiaGlitz Tamil Movies (2 July 2020). Actress Aathmika வீட்டில் திடீர் சோகம் | Meesaya Murukku, Hip Hop Aadhi, Emotional | Tamil News. Archived from the original on 29 January 2021. Retrieved 23 January 2021 – via YouTube.
  3. Rajendran, Gopinath (20 July 2017). "Aathmika: The accidental heroine". The New Indian Express. Archived from the original on 21 December 2019. Retrieved 23 February 2020.
  4. Manohar, Niveda (24 July 2017). "Aathmika is on cloud nine". Deccan Chronicle. Archived from the original on 27 April 2019. Retrieved 21 August 2020.
  5. Ramanujam, Srinivasa (21 July 2017). "'Meesaya Murukku' review: Sound engineering". The Hindu. Archived from the original on 6 September 2020. Retrieved 21 August 2020.
  6. "Meesaya Murukku review: Clicks mainly because of real life connect". Sify. 24 July 2017. Archived from the original on 16 January 2020. Retrieved 21 August 2020.
  7. "Meesaya Murukku review roundup: Hiphop Tamizha infuses life in this coming of age film". Firstpost. 22 July 2017. Archived from the original on 22 September 2018. Retrieved 21 August 2020.
  8. Menon, Thinkal (28 July 2017). "Meesaya Murukku Review {3/5}: The film has ample moments for youngsters to cheer". The Times of India. Archived from the original on 22 July 2017. Retrieved 21 August 2020.
  9. "Say hello to Chennai's freshest faces". The Times of India. 7 November 2017. Archived from the original on 16 November 2017. Retrieved 14 June 2021.
  10. Subramanian, Anupama (25 April 2018). "Aathmika replaces Oviya in Kaatteri". Deccan Chronicle. Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
  11. "Udhayanidhi Stalin, Aathmika team up for a crime thriller". The News Minute. 6 February 2019. Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020.
  12. "'Kodiyil Oruvan': Five reasons to watch Vijay Antony's action drama". The Times of India. 16 September 2021. Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  13. "Vijay Antony, Aathmika begin shooting for Ananda Krishnan's political thriller". The Times of India. 2 September 2020. Archived from the original on 6 September 2020. Retrieved 6 September 2020.
  14. "Vijay Antony's next titled Kodiyil Oruvan". News Today. 24 September 2020. Archived from the original on 23 January 2021. Retrieved 23 January 2021.
  15. "Kannai Nambathey Movie Review: Kannai Nambathey falters despite a thrilling setup". The Times of India. Archived from the original on 17 March 2023. Retrieved 19 March 2023.
  16. Balachandran, Logesh. "Arulnithi stars in emotional drama with Bharathirajaa". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 3 April 2023. Retrieved 5 April 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆత్మిక&oldid=3933629" నుండి వెలికితీశారు