ఆదర్శ లోకాలు (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదర్శ లోకాలు
ఆదర్శ లోకాలు పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కె.ఎల్. నరసింహారావు[1]
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: అభ్యుదయ ప్రెస్ (విజయవాడ), కళావాణి ప్రచురణలు (రేపాల)
విడుదల: 1948
పేజీలు: 107


ఆదర్శ లోకాలు కె.ఎల్. నరసింహారావు 1948లో రాసిన సాంఘీక నాటకం.[2][3] గాంధీ స్మారక దినోత్సవం సందర్భంగా 1948, ఫిబ్రవరి 12న మునగాల గ్రామంలో ఈ నాటకాన్ని ప్రదర్శింపజేశాడు.[4]

కథానేపథ్యం[మార్చు]

ఎన్నో విప్లవశక్తుల త్యాగఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. త్యాగాల విలువ తెలియని అభివృద్ధి నిరోధకులు, మత అహంకారులు, గుండాలు మన దేశంలో అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారు. అలాంటి వారినుండి దేశాన్ని రక్షించుకోవడం ద్వారానే ఆదర్శలోకాలు ఏర్పడుతాయని ఈ నాటక సారాంశం.

పాత్రలు[మార్చు]

 1. అబ్బాస్ (ముస్లిం యువకుడు, 25 సం.)
 2. మధు (హిందూ యువకుడు, 24 సం.)
 3. సేఠ్జీ (పెట్టుబడిదారు, 45 సం.)
 4. శివరామయ్య (అగ్రహారికుడు, 50 సం.)
 5. రఘుపతి (గుండా నాయకుడు, 29 సం.)
 6. బలరాం (గుండా నాయకుడు, 27 సం.)
 7. లీల (సేఠ్జీ కూతురు, 16 సం.)
 8. ప్రభ (సంగీత పాఠకురాలు, 15 సం.)
 9. భిక్షకుడు
 10. వాలంటీర్లు
 11. ప్రజలు

మొదటి ప్రదర్శన[మార్చు]

 1. పరగణా కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్ సాయంతో 1948, ఫిబ్రవరి 12న మునగాలలో 10వేలమంది సమక్షంలో మొదటి ప్రదర్శన ఇవ్వబడింది.

నటవర్గం

 • వి.ఆర్.కె. మూర్తి (అబ్బాస్)
 • కె.ఎం. శ్రేష్ఠి (మధు)
 • టి.ఆర్. ఆచార్య (సేఠ్జీ)
 • వి.ఆర్. నాయకులు (శివరామయ్య)
 • ఎస్.ఎల్. దాస్ (రఘుపతి) (గుండా నాయకుడు, 29 సం.)
 • ఎం. అబ్బయ్య (బలరాం)
 • కె. లక్ష్మయ్య (లీల)
 • వి.ఎన్. సింహం (ప్రభ)
 • సి.ఎస్. నారాయణరావు (భిక్షకుడు)
 • గంథం నర్సయ్య (భిక్షక కుర్రవాడు)
 • ఎం.ఎల్. నారాయణ, ఎం. మల్లేశ్వర్ (వాలంటీర్లు)
 • ఎస్. రామదాస్ (ప్రజలు)

సాంకేతికవర్గం

 • రచన, దర్శకత్వం: కె.ఎల్. నరసింహారావు
 • పద్యాలు: వారణాసి వెంకటనారాయణశాస్త్రి
 • పాటలు: వారణాసి కె.ఎల్, శ్రీరామకవచం సత్యనారాయణ
 • ఆర్ట్, మేకప్: ఎం.వి. భద్రం
 • హార్మోనియం: తేరాల సూర్యనారాయణశర్మ
 • తబలా: వట్టికోట సింగరాచార్యులు
 • ఫిడెల్: శ్రీరాయపురం మంగాచార్యులు
 • నిర్మాణం: గ్రామవెలుగు నాట్యమండలి, రేపాల

మూలాలు[మార్చు]

 1. నవతెలంగాణ, సోపతి (25 March 2017). "నాట‌కం బ‌తికేవుంది". NavaTelangana. డా. జె. విజయ్ కుమార్జీ. Archived from the original on 3 నవంబరు 2018. Retrieved 18 December 2019.
 2. మన తెలంగాణ, ఎడిటోరియల్ (28 November 2016). "సమకాలీనత గుబాళించిన తెలంగాణ సాంఘిక నాటకం". Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 18 December 2019.
 3. నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (9 September 2016). "జనచేతన నాటకాలు". www.ntnews.com. సిలివేరు లింగమూర్తి. Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 18 December 2019.
 4. నమస్తే తెలంగాణ, సూర్యాపేట వార్తలు (23 October 2016). "తెలంగాణ మాండలిక తొలి నాటక రచయిత కేఎల్". www.ntnews.com. డా. భీంపల్లి శ్రీకాంత్. Archived from the original on 18 డిసెంబరు 2019. Retrieved 18 December 2019.

ఇతర లంకెలు[మార్చు]