ఆదిత్య సింగ్ రాజ్‌పుత్
ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ | |
---|---|
![]() | |
జననం | [1] ఢిల్లీ, భారతదేశం | 1990 ఆగస్టు 19
మరణం | 2023 మే 22 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 32)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003 – 2023 |
బంధువులు | ఏక్తా వెబ్‌స్టర్ (సోదరి) |
ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ (1990 ఆగష్టు 19 - 2023 మే 22) భారతీయ టెలివిజన్ నటుడు. ఆయన హిందీ టెలివిజన్ షోలను హోస్ట్ చేయడంతో పాటు, బాలీవుడ్ చిత్రాలలో, అలాగే వివిధ టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించేవాడు.[2][3]
కెరీర్[మార్చు]
ఢిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ తల్లి ఉషా సింగ్.[4] మోడల్‌గా తన కెరీర్ 11వ ఏట ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. ఆయన దాదాపు 300లకు పైగా వాణిజ్యప్రకటనలలో నటించాడు. స్ప్లిట్స్ విల్లా-9 వంటి రియాలిటీ షోలతో పాటు, లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్-4తో వంటి టీవీ షోల్లోనూ పాల్గొన్నాడు.[5]
సినిమాలు[మార్చు]
- 2008 – ఆడి కింగ్
- 2010 - మమ్ అండ్ డాడ్: లైఫ్‌లైన్ లవ్[6]
- 2016 - లవర్స్
టెలివిజన్[మార్చు]
- రాజ్‌పుతానా (2015-2020)
- లవ్
- ఆషికి
- కోడ్ రెడ్ (2015)
- ఆవాజ్ (సీజన్ 9)
- స్ప్లిట్స్‌విల్లా (సీజన్ 9) (2016)
- బ్యాడ్ బాయ్ (సీజన్ 4) ఎపిసోడ్ 2 (2018)
- కంబాలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (2007-2009)
మరణం[మార్చు]
ఆయన ముంబైలో స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోని బాత్‌రూమ్‌లో 2023 మే 22న చనిపోయాడు. ఆయన డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించాడని నివేదించబడింది.[4]
మూలాలు[మార్చు]
- ↑ "Exclusive Interview With Aditya Singh Rajput". About Uttarakhand. 24 జూన్ 2010. Archived from the original on 28 నవంబరు 2011. Retrieved 24 జూన్ 2015.
- ↑ "Splitsvilla's Aditya Singh Rajput, 32, found dead at Andheri residence". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-05-22. Retrieved 2023-05-22.
- ↑ Team, Tellychakkar. "Aditya Singh Rajput to feature in a highly emotional music video along with Shweta Kothari for Zee Music". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-10.
- ↑ 4.0 4.1 Kashyap, Shubham. "Aditya Singh Rajput Age, Wife's Name, Biography, Wiki, Death Reason, TV Shows, Family, and Net Worth". See Future News. Shubham Kashyap. Retrieved 22 May 2023.
- ↑ "Bollywood Actor Aditya Singh Rajput Found Dead in Bathroom Due To Drugs - Sakshi". web.archive.org. 2023-05-22. Archived from the original on 2023-05-22. Retrieved 2023-05-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Krantiveer... then and now". The Times of India. 31 May 2010. Retrieved 24 June 2015.