ఆనందలోకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనందలోకం
కృతికర్త: నారంశెట్టి ఉమామహేశ్వరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: జానపద నవల (బాలసాహిత్యం)
ప్రచురణ: మంచి పుస్తకం, సికిందరాబాద్
విడుదల:
పేజీలు: 128


ఆనందలోకం నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన బాలల జానపద నవల. ఈ నవలకు 2018 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది.[1]

ఇతివృత్తం[మార్చు]

హేళాపురి రాజ్యాన్ని విక్రమదేవుడు పాలిస్తాడు. ఆయన భార్య మహారాణి వకుళాదేవి. వారికి చాలాకాలం తర్వాత కుమారుడు పుడతాడు. అతనికి 'విజయుడు' అని పేరు పెడతారు.[2] యువరాజు దేశాటనకు బయలుదేరి వివిధ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ సాగే కథ కావడంతో ఎన్నో గమ్మత్తు కథల సమాహారంగా దీన్ని చదువుకోవచ్చు. సందర్భోచితంగా రచయిత చొప్పించిన నీతి వాక్యాలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. అద్భుతదీవి, మాంత్రికుడు, మరుగుజ్జు, గంధర్వుడు, మునులు, కరుటమంత్రి .. ఇలా ఒకటేమిటి పిల్లలు ఊహాలోకంలో విహరించడానికి కావలసిన అంశాలెన్నో ఉన్నాయి ఇందులో.[3]

మూలాలు[మార్చు]

  1. "2018 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2018-07-12. Retrieved 2018-06-25.
  2. తంగిరాల చక్రవర్తి (20 August 2016). "ఆసక్తికరం ఆనందలోకం". నవతెలంగాణ. Archived from the original on 23 ఆగస్టు 2016. Retrieved 25 June 2018.
  3. పిల్లలు మెచ్చే ‘మంచి పుస్తకాలు'
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందలోకం&oldid=3911976" నుండి వెలికితీశారు