సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం
Appearance
బాలసాహిత్యం అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాన్ని 2010నుండి అమలు చేస్తున్నారు. ప్రతీ ఏడాదీ గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి ఈ పురస్కారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం పొందే బాలసాహిత్య పుస్తకం ఆ అవార్డును ఇచ్చే సంవత్సరానికి ముందు సంవత్సరానికన్నా ఐదేళ్ల కాలంలో వెలువడిఉండాలి. ఉదాహరణకు 2016లో అవార్డుకు పరిగణించే పుస్తకం 2011-2014 సంవత్సరాల మధ్యకాలంలో ప్రచురింపబడి ఉండాలి. ఈ పురస్కారం క్రింద రూ 50,000/- నగదు, జ్ఞాపిక బహూకరిస్తారు.
తెలుగు భాషకు చెందిన బాల సాహిత్య పురస్కార విజేతలు
[మార్చు]సంవత్సరం | బొమ్మ | పుస్తకం | సాహితీ విభాగం | రచయిత | మూలము |
---|---|---|---|---|---|
2010 | అడవి తల్లి | నవల | కలువకొలను సదానంద | [1] | |
2011 | ఉగ్గుపాలు | కథాసంపుటి | ఎం.భూపాల్ రెడ్డి | [2] | |
2012 | చిరుదివ్వెలు | కవితా సంపుటి | రెడ్డి రాఘవయ్య | ||
2013 | ఆటలో అరటిపండు | కథాసంపుటి | డి. సుజాతాదేవి | [3] | |
2014 | ఆనందం | కథాసంపుటి | దాసరి వెంకటరమణ | [4] | |
2015 | బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి | చొక్కాపు వెంకటరమణ | [5] | ||
2016 | స్వర్ణపుష్పాలు | కవితా సంపుటి | అలపర్తి వెంకటసుబ్బారావు | [6] | |
2017 | బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి | వాసాల నరసయ్య | [7] | ||
2018 | ఆనందలోకం | జానపద నవల | నారంశెట్టి ఉమామహేశ్వరరావు | [8] | |
2019 | తాత మాట వరాల మూట | కథల సంపుటి | బెలగాం భీమేశ్వరరావు | [9] | |
2022 | బాలల తాత బాపూజీ | గేయ కథ | డా. పత్తిపాక మోహన్ | [10] |
మూలాలు
[మార్చు]- ↑ 2010 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన
- ↑ 2011 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన[permanent dead link]
- ↑ "2013 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-06-29.
- ↑ "2014 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-06. Retrieved 2016-06-29.
- ↑ "2015 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన". Archived from the original on 2016-03-18. Retrieved 2016-06-29.
- ↑ "2016 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-08-04. Retrieved 2016-06-29.
- ↑ "2017 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2017-07-12. Retrieved 2017-06-23.
- ↑ "2018 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2018-07-12. Retrieved 2018-06-25.
- ↑ "Sahitya Akademi announces Bal Sahitya Puraskar and Yuva Puraskar 2019". pib.gov.in. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
- ↑ telugu, NT News (2022-08-24). "పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం". Namasthe Telangana. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.