ఆనంద గోత్రీకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనంద గోత్రీకులు సా.శ. 335-425 కందారపురాన్ని రాజధాని చేసుకొని పరిపాలించారు.ఇక్ష్వాకుల పతనం తరువాత ఆనంద గోత్రికలు పరిపాలించారు.ఆనంద గోత్రికులు శైవమతాన్ని ఆరాధించారు.వీరు ఆనంద గోత్రానికి చెందినవారని పేర్కొన్నారు.[1][2]

శాసనాలు

[మార్చు]

వీరి చరిత్రను తెలుసుకోవడానికి మూడు శాసనాలు మాత్రమే లభ్యమయ్యాయి. దామోదరవర్మ వేయించిన మట్టిపాడు తామ్రశాసనం, అత్తి వర్మ వేయించిన గోరంట్ల తామ్రశాసనం, చేజర్ల శిలా శాసనలు లభించాయి. దామోదరవర్మ 14 మంది బ్రాహ్మణులకు కంగూర గ్రామదానం అగ్రహారంగా ఇస్తూ, మట్టెపాడు శాసనం వేయించాడు.[3]

రాజ్య పాలన

[మార్చు]

కందరు రాజు పల్లవులపై యుద్ధాలు గెలిచి అమరావతి ప్రాంతం నుండి తరిమికొట్టాడు. కందరు రాజు అనంతరం దామోదరవర్మ రాజ్యనికి వచ్చాడు.దామోదర వర్మ అనంతరం అత్తి వర్మ ఆనంద గోత్రికులలో చివర రాజు అత్తివర్మ శివుని భక్తుడు.అత్తివర్మ అనంతరం రాజ్యాన్ని విష్ణుకుండినులు ఆక్రమించారు. 

మూలాలు

[మార్చు]
  1. Sen, Sailendra Nath (1999). Ancient Indian History and Civilization (in ఇంగ్లీష్). New Age International. p. 433. ISBN 9788122411980.
  2. "CRACKING GROUPS: ANANDA GOTRIKAS". CRACKING GROUPS. 2013-05-26. Retrieved 2020-01-23.
  3. Lakshmanna, Chintamani (1973). Caste dynamics in village India (in ఇంగ్లీష్). Nachiketa Publications. p. 27.