ఆపరేటర్ ఓవర్‌లోడింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారము ఇంకా కొన్ని ఇతర గుర్తులను ఆంగ్లములో ఆపరేటర్లు అంటారు. అవి క్రమంగా +, -, *, % వంటివి. వీటిని ఉపయోగించి వేగంగా అధిక ప్రయోజనం పొందటమే ఆపరేటర్ ఓవర్‌లోడింగ్.

c++[మార్చు]

c++ కోసము ఈ సంజ్ఞ్యా అధికోపకారిణిని అభివృద్ది చేశారు. c++ ప్రత్యేక లక్షణాలలో ఈ ఆటరేటార్ ఓవర్ లోడింగ్ ముఖ్యమైనది. వాడుకరి సమాచారాన్ని ఇచ్చి, తనకు అనువుగా ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఆపరేటర్లను ఓవర్ లోడ్ చేయటమంటే ఎక్కువ డేటా లేక ఎక్కువ సమాచారము ఇచ్చి ఫలితం రాబట్టటము.

ఉదాహరణ:

గమనిక: ఈ క్రింద వ్రాసిన కోడింగ్ కేవలము అర్ధమవటం కోసమే. c++లో గాని, ఇతర సాఫ్ట్ వేర్లలో పని చేయదు.

ప్రోగ్రాం

a=5. b=6.

a=a+b.

print a.

result = 11.

పై ప్రోగ్రాములో '+' ఉపయోగించి రెండు అంకెలను కూడి ఫలితం ప్రింట్ చేశాము. ఈ '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి లేక అధికంగా ఉపయోగించుకుని ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని కూడవచ్చు.

ఉదాహరణకి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిద్దాము. ఒక నియోజక వర్గములో వంద పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ నియోజక వర్గములో అయిదు పార్టీలు పోటి చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు రోజున వేగంగా ఫలితాలను తెలుసుకుందుకు '+' సంజ్ఞ్యను ఉపయోగించ వచ్చు. అదే ఆపరేటర్ ఓవర్‌లోడింగ్.

గమనిక: ఈ క్రింది ప్రోగ్రాం కేవలం అర్ధం కావటం కోసమే. ఎక్కడా పనిచేయదు.


class party(abc, ijk, lmn, pqr, xyz)

ప్రోగ్రాం

party p;

for(i=0; i<=100;i++)

{

takeinfo p(abc[i], fgh[i], lmn[i], pqr[i], xyz[i])

votes of party abc[i] ?

votes of party fgh[i] ?

votes of party lmn[i] ?

votes of party pqr[i] ?

votes of party xyz[i] ?

abc=abc+abc[i]

fgh=fgh+fgh[i]

lmn=lmn+lmn[i]

pqr=pqr+pqr[i]

xyz=xyz+xyz[i]

}

print total votes = abc, fgh, lmn, pqr, xyz.

abc, fgh, lmn, pqr, xyz అనేవి పార్టీ పేర్లు.

పై ప్రోగ్రామును ఒక్క సారి రన్ చేయగానే వంద సార్లు మననుంచి పార్టీల ఓట్ల సమాచారము తీసుకుని వెంటనే ఓట్లను విడివిడిగా కూడి, ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి విడివిడిగా ఫలితాన్ని ప్రింటు చేస్తుంది. రెండు అంకెలను కూడినంత తేలికగా వంద సమూహ అంకెలను కూడి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉదాహరణలో వాడుకరి తన దగ్గర ఉన్న ఎక్కువ సమాచారాన్ని తనకు వీలైన రూపంలో ఇచ్చి, '+' ఆపరేటారుని ఓవర్ లోడ్ చేసి, అధికంగా వాడుకుని తనకు అనువైన రూపంలో ఫలితాన్ని పొందారు. అదే '+' ని అధికోపకారిణి చేయటం.


ఇలా అనేక ఆపరేటర్లను ఓవర్ లోడ్ చేసి మనకు కావలసిన ఫలితాన్ని అధికంగా పొందవచ్చు. కానీ ఆ ఆపెరేటార్ ను ప్రాథమిక లక్షణముతో మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే '+' కూడికలకు మాత్రమే వాడాలి. మార్కులు, ఓట్లు, తెర మీద బొమ్మలు, మొదటి పేరు చివరి పేరు ఇలా ఏవైనా కూడికలకు మాత్రమే ఉపయోగించాలి. తెర మీద బొమ్మలు కలిసిపోవటం, విడిపోవటం ఇంకా ఇలా చాలా ఆపెరతార్ ఓవర్ లోడింగ్ వల్లనే సాధ్యపడతాయి.

మూలాలు[మార్చు]