ఆపరేషన్ అశ్వమేధ్
హైజాకింగ్ సారాంశం | |
---|---|
తేదీ | ఏప్రిల్ 24 – 25, 1993 |
సారాంశం | విమాన హైజాకింగ్ |
ప్రదేశం | ఢిల్లీ, శ్రీనగర్ మధ్య హైజాక్ చేయబడినది |
ప్రయాణీకులు | 141 |
సిబ్బంది | 6 |
గాయాలు (ప్రాణాపాయం) | 0 |
మరణాలు | 1 హైజాకర్ |
విమానం రకం | బోయింగ్ 737 |
ఆపరేటర్ | ఇండియన్ ఎయిర్ లైన్స్ |
విమాన మూలం | ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిల్లీ, భారతదేశం |
గమ్యం | అమృత్‌సర్, భారతదేశం |
ఆపరేషన్ అశ్వమేధ్ అనునది ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు రేస్క్యూ ఆపరేషన్. ఏప్రిల్ 24, 1993 ఏప్రిల్ 25 న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐ.సి.427 విమానాన్ని భారతదేశంలో హైజాక్ చేసారు. ఈ హైజాకింగ్ జరిగినపుడు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డులకు చెందిన కమాండోలు అందులో గల 141 మంది బందీలను అమృత్ సర్ విమానాశ్రయంలో రక్షించారు. ఈ హైజాక్ కు కారణమైన మొహమ్మద్ యూసుఫ్ షా అనే హైజాకర్ కమాండోలు విమానంలోకి ప్రవేశించి బందీలకు ఏ హాని చేయకముందే ఐదు నిమిషాల లోపునే చంపబడ్డాడు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను "ఆపరేషన్ అశ్వమేథ్" గా నామకరణం చేసారు.
హైజాకింగ్
[మార్చు]ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐ.సి 427 ఢిల్లీ నుండి 13:57 గంటలకు శ్రీనగర్ వెళ్ళుటకు బయలుదేరినది. విమానంలో 141 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. వారిలో 126 మంది పెద్దలు, 9 మంది పిల్లలు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం గగన తలంలోనికి ప్రవేశించిన తరువాత ఒక ప్రయాణీకుడు తన పేరును సయ్యద్ సలాలుద్దీన్ గా చెప్పుకొని తన వద్ద పిస్టల్స్, హాండ్ గ్రానైడ్స్ ఉన్నవనీ, విమానాన్ని కాబూల్ వైపుకు దారిమళ్ళించాలనీ చెప్పాడు. 14:43 గంటలకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు విమానం హైజాక్ చేయబడి ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ కు దారి మళ్ళిస్తున్నట్లు సమాచారం అందినది.[1]
లాహోర్ కు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాన్ని పాకిస్తాన్ గగన తలంలో ప్రవేశించడాన్ని నిరాకరించింది. అపుడు విమానం తిరిగి భారతదేశానికి వచ్చింది.[2] చివరికి విమానం భారతదేశంలోని అమృత్‌సర్ లో 15:20 గంటలకు ల్యాండ్ అయినది. హైజాకర్ విమానాన్ని ఇంధనంతో నింపాలని కాబూల్ కు వెళ్ళాలనీ డిమాండ్ చేసాడు. భారతదేశ క్యాబినెట్ సెక్రటేరియట్ కు సంబధించిన విపత్తు నిర్వహణా గ్రూపు (సి.ఎం.జి), ఢిల్లీ విమానాశ్రయానికి చెందిన కేంద్ర కమిటీ ఈ సంఘటనకు స్పందించింది. అమృత్‌సర్ జిల్లా కు చెందిన డిప్యూటీ కమీషనర్, పోలీసు సూపరింటెండెంట్ లు హైజాకర్ తో చర్చలు జరిపారు. 18:00 గంటలకు అమృత్‌సర్ కు పంజాబ్ పోలీసు డైరక్టరు జనరల్ వచ్చారు. ఆయన హైజాకర్ తో చర్చలు జరిపారు. హైజాకర్ మొండిగా తన డిమాండుపై పట్టు పట్టి విమానం లో వార్నింగ్ కొరకు కాల్పులు జరిపాడు.[1]
ఎన్.ఎస్.జి ఆపరేషన్
[మార్చు]హైజాకర్ విమానంలో కాల్పులు జరిపిన తరువాత, సి.ఎం.జి స్పందించి అదాంపూర్ మీదుగా అమృత్‌సర్ కు ఒక ఎన్.ఎస్.జి కమాండో దళాన్ని పంపింది. అదేవిధంగా చర్చించేవారికి తన చర్చలు కొనసాగించవలసినదిగా సలహా యిచ్చారు. 23:00 లకు హైజాకర్ తన డిమాండ్లను పరిష్కరించకపోతే తాను విమానాన్ని పేల్చివేస్తానని ప్రకటించాడు. సి ఎం జి విమానంలోకి ప్రవేశించుటకు ఎన్.ఎస్.జి కమాండోలకు, చర్చించేవారికి సూచనలిచ్చింది.[1] తరువాత రెండు గంటలలో ఆ బృందం గ్రౌండ్ పరిస్థితిని అంచనా వేసి ఆపరేషన్ కు పథకం వేసింది. ఏప్రిల్ 25 01:00 లకు 60 మంది ఎన్.ఎస్.జి కమాండోలు 52 ప్రత్యేక ఏక్షన్ బృందం విమానంలోనికి వెళ్ళుటకు సిద్దమయ్యారు. హైజాకర్ ఈ ఆకశ్మికంగా కమాండో బృందాలు లోపలికి రావడంతో ఆశ్చర్యపడ్డాడు. హైజాకర్ స్పందించి విమానంపై కాల్పులు జరిపు నష్ఠం కలిగించే లోపుగా సైలన్స్ పిస్టల్ తో ఒక కమాడో హైజాకర్పై కాల్పులు జరిపాడు. ఈ ఆపరేషన్ ఐదు నిమిషాలలో ముగిసింది. ఈ ఆపరేషన్ లో ఎటువంటి గాయాలు పడినవారు గానీ, ఇతర నష్ఠం కలిగిన బందీలు కానీ లేరు.[1][3][4]
తరువాత పరిణామాలు
[మార్చు]ఆ తరువాత ఆ హైజాకర్ జలాలుద్దీన్ అలియాస్ మొహమ్మద్ యూనస్ షా గా గుర్తింపబడ్డాడు.[3] మృతదేహం స్థానిక పోలీసులకు అందజేసారు. పిస్టల్ చే కాల్చబడినందున ఆయనకు హాస్పటల్ కు తరలించారు. ఆయన నుండి పూర్తిగా లోడ్ చేయబడిన 9 mm పిస్టల్స్ రెండింటిని స్వాధీనం చేసుకున్నారు.[1] భారత అధికారులు ఆ హైజాకర్ హిజ్బుల్ మొజాహిద్దీన్ కు చెందిన సభ్యుడని ప్రకటించాయి. కాని ఆ సంస్థ బాధ్యత వహించుటకు నిరాకరించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Hijacking of Indian Airlines Flight IC427 on 24th April 1993". Parliament of India. 1993-04-26. Archived from the original on 2018-01-20. Retrieved 2016-05-05.
- ↑ 2.0 2.1 "Indian Commandos Kill Gunman to Thwart Hijacking". Los Angeles Times. 1993-04-25.
- ↑ 3.0 3.1 Limca Book of Records. Bisleri. 1999.
- ↑ "National Security Guard". Indian Defence Review. 8 (3). Lancer: 61. 1993.