ఆపేక్ష (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపేక్ష
(1953 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ నరేష్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఆపేక్ష 1953లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది తమిళ సినిమా అంబుకు డబ్బింగ్ చేయబడిన సినిమా. దీనిని నటేష్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎం.నటేష్ నిర్మించాడు. ఈ సినిమాలో శివాజి గణేశన్, టి.ఆర్.రాజకుమారి, పద్మిని ప్రధాన పాత్రలలో నటించారు.[1]

ఈ సినిమాకు కథ ఎం.నటేష్ రాయగా విద్యాధన్ సంభాషణలు రాసాడు. ఈ చిత్రానికి జి.విఠల్ రావు ఛాయాగ్రహణం చేసాడు. కూర్పు ఎస్.ఎ.మురుగేశన్ చేసాడు.

కథ[మార్చు]

తంగం అనే యువతి రాజమానిక్యం ముదలియార్ అనే వృద్దుడఒమ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతని మొదటి వివాహం మూలంగా అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు: ఒక కుమార్తె లక్ష్మి, ఒక కుమారుడు సెల్వం. రెండవ భార్య తంగం గర్భవతిగా ఉన్నప్పుడు ముదలియార్ మరణిస్తాడు. సెల్వం ధనవంతురాలైన మాలతితో ప్రేమలో పడగా, తిరుమలై అనే విలాస పురుషుడు వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు. వితంతువు తంగం బిడ్డ జన్మించినప్పుడు, ఆ బిడ్డకు సెల్వం తండ్రి అని లక్ష్మి పుకార్లను వ్యాపింపజేస్తుంది. వారికి అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తుంది. ఈ పుకార్లను నమ్మిన మాలతి, తంగంను హింసించడం ప్రారంభిస్తుంది. ఈ సమస్యలను తంగం ఎలా అధికమిస్తుందనేది మిగిలిన కథ

తారాగణం[మార్చు]

పురుష తారాగణం
  • శివాజీ గణేషన్ సెల్వం
  • టి. ఎస్. బాలయ్య తిరుమలైగా
  • రాజమణిక్కంగా డి.దురైసామి
  • కె. కుమార్ వలె తంగవేలు
  • భాస్కర్‌గా స్నేహితుడు కె. రామసామి
సహాయ తారాగణం
  • కుమారి రాజమ్, ఆదిలక్ష్మి, రీటా, మోహన,, సరస్వతి.
స్త్రీ తారాగణం
  • టి. ఆర్. రాజకుమారి తంగం గా
  • పద్మిని మాలతిగా
  • లలిత రీతాగా
  • మ. ఋషేంద్రమణి విజయగా
  • టి. ఎస్. జయ బాలమణిగా
  • ఎస్.పద్మ లక్ష్మిగా

మూలాలు[మార్చు]

  1. Guy, Randor (18 April 2015). "Anbu 1953". The Hindu. Chennai. Archived from the original on 23 April 2015. Retrieved 12 May 2017.