ఆప్టికల్ మౌస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైక్రోసాఫ్ట్ వైర్లెస్ ఆప్టికల్ మౌస్

కంప్యూటర్ కు సంబంధించిన ఒక పరికరం ఆప్టికల్ మౌస్. గతంలో ఉపయోగించిన రోలర్ మౌస్ స్థానాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ఆప్టికల్ మౌస్ భర్తీ చేస్తుంది. ఆప్టికల్ అనే పేరుకు తగ్గట్టు ఆప్టికల్ మౌస్‌లో ముఖ్యంగా ఒక బుల్లి కెమెరా ఉంటుంది. ఈ బుల్లి కెమెరా సెకనుకు 1500 ఫ్రేముల్ని ఫొటో తీయగలదు. ఈ బుల్లి కెమెరా ఫొటోలు తీయడానికి మనం కెమెరాలో ఫ్లాష్ వాడినట్టు ఆప్టికల్ మౌస్ తన ఫొటోల్ని తీయడానికి వీలుగా దాదాపు ఆవిచ్ఛిన్నంగా వెలిగే ఓ ఎర్రని లేజర్ లైట్ ఉంటుంది. ఈ కెమెరా సాధనాల్ని మౌస్ అడుగు భాగంలో అమర్చుతారు. కంప్యూటర్ ను ఉపయోగించే వారు మౌస్ ని కదలించినప్పుడు అడుగు భాగమున ఉన్న లైట్ మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. వెనువెంటనే అక్కడున్న బుల్లి కెమెరా ఉపరితలం ఫొటోలను వందలాదిగా తీసి కంప్యూటర్‌కు చేరవేస్తుంది. కంప్యూటరులో ఉన్న ఓ ప్రత్యేక దృశ్య గణన విభాగం బొమ్మల్లో కలిగిన మార్పుని గుర్తించటం ద్వారా మౌస్ ఎటువైపు కదిలిందో గుర్తిస్తుంది. దీని కనుగుణంగా కంప్యూటరు తెరమీద కర్సర్ కదులుతుంది. అవసరమైన ఫైలు మీదకు కర్సర్ వచ్చినపుడు నొక్కవలసిన బటన్లు నొక్కి ఆ ఫైలును ఉపయోగించుకోవచ్చు. మౌస్ పైభాగాన ఉన్న పల్లచక్రాన్ని తిప్పినప్పుడు అది ఓ పరారుణ కాంతి పుంజాన్ని పదేపదే అడ్డుకునేలా చేసి స్క్రోలింగ్ చేసేందుకు వీలుకల్పిస్తుంది, తద్వారా మానిటర్ లోని దృశ్యం స్క్రోల్ అవుతుంది.