మౌస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ (చక్రం) అనే మూడు బటన్లు కలిగివున్న కంప్యూటర్ మౌస్.

కంప్యూటరులో ఒకరకమయిన ఇన్పుట్ సాధనము మౌస్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పనులు సులభంగా, కమాండులు టైపు చేయనవసరం లేకుండా చేయవచ్చును. కంప్యూటర్ యొక్క పరికరాలలో ముఖ్యమైనది మౌస్. దీనిని చేతితో అటు, ఇటు తిప్పుతూ దానికి ఉన్న బటన్లను నొక్కుతూ దీనిని ఉపయోగిస్తారు. దీనికి సాధారణంగా లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ (చక్రం) అనే మూడు బటన్లు ఉంటాయి. పిఎస్2 మౌస్ ను సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉపయోగిస్తారు, ఇది వైరు ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడుతుంది. యుఎస్‌బి మౌస్ ను సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో, ల్యాప్‌టాప్‌‌లలో ఉపయోగిస్తారు, ఇది వైరు ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడుతుంది. వైర్‌లెస్ మౌస్ సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో, ల్యాప్‌టాప్‌‌లలో, కొత్త టి.విలలో ఉపయోగిస్తారు, దీనికి వైరు ఉండదు, కాబట్టి దీనిని వైర్ లెస్ మౌస్ అంటారు. వైర్ లెస్ మౌస్‌కు బ్యాటరీ సెల్స్ వేయాల్సివుంటుంది.

మౌస్‌కి అడుగు భాగాన బంతి వంటిది, లేదా లైట్ వుంటుంది. బంతి వంటిది మనం మౌస్‌ను మౌస్ ప్యాడ్‌కి లేదా ఏదైనా ఉపరితలానికి ఆనించి కదలించినప్పుడు బంతి కూడా తిరుగుతుంది, తద్వారా కంప్యూటర్ తెరపై కర్సర్ కదులుతుంది. అలాగే లైట్ కూడా మనం మౌస్‌ను మౌస్ ప్యాడ్‌కి లేదా ఏదైనా ఉపరితలానికి ఆనించి కదలించినప్పుడు ఆ లైట్ ఇచ్చే సంకేతాల ద్వారా కంప్యూటర్ తెరపై కర్సర్ కదులుతుంది.

మౌస్‌ను కదిలించినప్పుడు కంప్యూటర్ తెరపై బాణం గుర్తు కదులుతుంటుంది, ఈ గుర్తును కర్సర్ అంటారు. కంప్యూటర్ తెరపై కర్సర్ ఉన్న స్థానాన్ని బట్టి బటన్లు నొక్కడం ద్వారా కంప్యూటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. కంప్యూటర్ కీబోర్డు లోని కీలను కూడా ఆన్ స్క్రీన్ కంప్యూటర్ కీబోర్డు ద్వారా మౌస్ తో ఉపయోగించవచ్చు.

లెఫ్ట్ బటన్ ద్వారా ఫైళ్ళను సేవ్ చేయవచ్చు, లింకుల ద్వారా వేరే వెబ్ పేజీకి నేరుగా చేరుకోగలము. వెబ్ పేజీని మినిమైజ్ చేయడానికి, పెద్దదిగా చేయడానికి, క్లోజ్ చేయడానికి ఇంకా అనేక రకాల పనులకు లెఫ్ట్ బటనును ఉపయోగించవచ్చు. సాధారణంగా లెఫ్ట్ బటన్ ఉపయోగించడానికి కుడి చేతి యొక్క చూపుడు వేలును ఉపయోగిస్తాము.

రైట్ బటన్ ద్వారా కాపీ చేయడం, పేస్టు చేయడం, పైళ్ళకు పేర్లు మార్చడం వంటి అనేక పనులు చేయవచ్చు. ఏదైనా ఫైళ్ళను వేరు వేరు సాఫ్ట్‌వేర్లలో ఒపెన్ చేసుకోవడానికి రైట్ బటన్ ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక వీడియో ఫైలుపై రైటు క్లిక్ చేయడం ద్వారా ఒపెన్ విత్ ను సెలక్ట్ చేసినప్పుడు ఆ ఫైలు ఒపెన్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్లను సూచిస్తుంది, అప్పుడు మనకు అవసరమైన సాఫ్ట్‌వేర్ లో దానిని ఒపెన్ చేసుకోవచ్చు, ఉదాహరణకు వీడియోను ప్లే చేయడానికి ఉపయోగపడే విఎల్‌సి ప్లేయర్, విండోస్ మీడియా ప్లేయర్ లను సూచిస్తే మనం దేనిపై లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తామో ఆ ప్లేయర్‌లో వీడియో ప్లే అవుతుంది. సాధారణంగా రైట్ బటన్ ఉపయోగించడానికి కుడి చేతి యొక్క మధ్య వేలును ఉపయోగిస్తాము.

స్క్రోల్ వీలు (చక్రం) బటన్ ద్వారా చక్రాన్ని త్రిప్పుతూ వెబ్ పేజీలోని పేజీలను, ఫైళ్లను పైకి, క్రిందకు జరపవచ్చు. వెబ్ పేజీలో హైపర్ లింకుల వద్ద స్క్రోల్ బటన్ నొక్కినప్పుడు ఆ హైపర్ లింకు యొక్క వెబ్ పేజీ మరొక కొత్త విండోలో ఒపెన్ అవుతుంది. అయితే కొన్ని స్క్రోల్ చక్రాలు పైకి క్రిందికి స్క్రోల్ చేయడానికి మాత్రమే అనుమతిస్తాయి. సాధారణంగా స్క్రోల్ వీలు బటన్ ఉపయోగించడానికి కుడి చేతి యొక్క చూపుడు వేలును ఉపయోగిస్తాము. స్క్రోల్ వీల్ సాధారణంగా మౌస్ యొక్క ఎడమ, కుడి బటన్ల మధ్య ఉంటుంది.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

మౌస్ అంటే ఏమిటి ?[మార్చు]

మనం బయట ప్రపంచంలో వస్తువులను ఎత్తదనికి, పట్టుకోవడానికి, తీసుకొని వెళ్లడానికి మనిషి తమ చేతులను ఉపయోగిస్తాడు.

కానీ, అదే పనిని మీరు Computer Archived 2021-07-20 at the Wayback Machineలో చేయాల్సి ఉంటే మీరు ఎలా చేస్తారు?. ఎందుకంటే కంప్యూటర్ కి చేతులు ఉండవు. మరి మీరు ఎలా పని చేస్తారు ?

పదండి మేము మీకు చేబ్తము.

అసలైతే, కంప్యూటర్ కి కూడా పని చేయడానికి ఒక చెయ్యి ఉంటుంది. అవును మీరు చదివింది నిజమే.

ఆ చెయ్యిని మనం Mouse అనే పేరుతో పిలుస్తాము. అయితే ఈ వఖ్య ద్వారా మనం Mouse అంటే ఏమిటి ? Archived 2021-07-22 at the Wayback Machine, Mouse యొక్క ఉపయోగం ఎలా  చేయాలి? అంతేదీ తెలుసుకుందాం.

"https://te.wikipedia.org/w/index.php?title=మౌస్&oldid=4075464" నుండి వెలికితీశారు