ఆబ్రహాము లింకను చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆబ్రహాము లింకను చరిత్ర
పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
సంపాదకులు: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్ర
ప్రచురణ: విజ్ఞాన చంద్రికా మండలి
విడుదల: 1907
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 218


ఆబ్రహాము లింకను చరిత్ర ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రచించిన విశిష్ట రచన. దీనికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు సంపాదకత్వం వహించారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ (1809-1865) జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రచించబడి విజ్ఞాన చంద్రికా మండలి, మద్రాసు ద్వారా ముద్రించబడింది.

రచయిత తన రచనకు ఇంగ్లీషులో థేయర్సను రచించిన "ఆబ్రహాము లింకను జీవితము" ఆధారమని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న వారందరికీ తన ఈ కృతిని అంకితమిచ్చారు.

విశేషాలు

[మార్చు]

ఈ పుస్తకాన్ని 20 ప్రకరణాలుగా లిఖించారు. ఆబ్రహాము లింకను తల్లిదండ్రులు, జననము, శైశవము,. బాల్యము, నూతన నివాస స్థల నిర్మాణము, దుఃఖదినములు, ఉల్లాసతర దినములు, క్రొత్తతల్లి, క్రొత్తవిద్యాలయములు, కృషి, సంపాదనలు, ప్రవృద్ధి, ప్రకాశములు, తెప్పపై ప్రయాణము, ఇల్లినాయి చేరుట, న్యూ ఆర్లియన్సుకు రెండవయాత్ర, క్రొత్తయంగడి గుమస్తా, యుద్ధమునకు బోవుట, అయాచిత గౌరవప్రాప్తి, న్యాయవాదిత్వము, గౌరవాధిక్యతం చెందుట, "సితగృహా" లంకరణము, సైనికుల పట్ల ప్రేమ, బానిసలకై పడిన పాట్లు, ద్వితీయ నిర్వచనము, యుద్ధసమాప్తి, ఘోరహత్య మొదలైన విశేషాలను ఈ గ్రంథంలో వివరించారు.

మూలాలు

[మార్చు]