ఆమ్రపాలి గ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆమ్రపాలి గ్యాన్
జననం1985 Edit this on Wikidata (age 39)
ముంబై (భారతదేశంEdit this on Wikidata
పూర్వ విద్యార్థి
  • California State University, Los Angeles Edit this on Wikidata
OccupationMarketing executive, ముఖ్య కార్యనిర్వాహక అధికారి Edit this on Wikidata
ఉద్యోగి
  • OnlyFans
  • Red Bull Edit this on Wikidata

ఆమ్రపాలి  గ్యాన్‌ ఒక భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త. ఆమె డిసెంబర్ 2021లో ఓన్లీఫాన్స్ అనే కంటెంట్ క్రియేటర్ల సైట్ కు సిఇఒగా నియమితులయ్యారు, ఆమె సెప్టెంబర్ 2020లో చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గా చేరారు. [1] ఆమె వ్యవస్థాపక సిఇఒ టిమ్ స్టోక్లీ తరువాత బాధ్యతలు అధిష్టించారు. [2]

ప్రారంభ జీవితం

[మార్చు]

గ్యాన్‌ భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. [3] ఆమె కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ లో గ్రాడ్యుయేట్. [4] కాలిఫోర్నియాలో FIDM (ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ మర్చండైజింగ్‌) నుంచి మర్చండైజ్ మార్కెటింగ్‌లో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సాధించింది. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పీఆర్‌ అండ్‌ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను అభ్యసించింది. ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంట్రప్రెన్యూర్‌షిప్ సర్టిఫికేట్ తీసుకుంది. ఇలా మూడు డిగ్రీ పట్టాలు సాధించిన ఆమ్రపాలి కన్జూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆపై ఆర్కెడ్‌ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా, కన్నాబిస్‌ కేఫ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, క్వెస్ట్‌ న్యూట్రీషియన్‌కు బ్రాండ్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌గా, రెడ్‌ బుల్‌ మీడియా హౌజ్‌లో కూడా వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వహించింది. ఇప్పుడు ఓన్లీఫ్యాన్స్‌ సీఈవోగా కొత్త బాధ్యతలు స్వీకరించింది. [5]

మూలాలు

[మార్చు]
  1. "OnlyFans founder is making way for firm's marketing chief". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-12-21. Retrieved 2021-12-24.
  2. Spangler, Todd; Spangler, Todd (2021-12-21). "OnlyFans Founder Resigns, Company Names Marketing Chief New CEO". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-24.
  3. "Who is Amrapali Gan, the new OnlyFans CEO? Know India connection". HT Tech (in ఇంగ్లీష్). 2021-12-22. Retrieved 2021-12-24.
  4. "Meet Amrapali Gan, Indian-origin CEO of adult website OnlyFans". Business Today (in ఇంగ్లీష్). Retrieved 2021-12-24.
  5. Telugu, TV9 (2021-12-23). "Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి." TV9 Telugu. Retrieved 2021-12-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)