ఆయుష్మాన్‌ భారత్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆయుష్మాన్‌ భారత్‌ ఈ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు. ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపు 10కోట్ల కుటుంబాల వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఈ పథకాన్ని మోదీకేర్‌గా అభివర్ణింస్తారు [1] ఈ పథకం యొక్క తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2018న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ప్రారంభించారు.

మూఖ్యాంశాలు[మార్చు]

జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం[మార్చు]

ఈ పథకం కింద ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల వరకు బీమా కల్పింస్తారు. ఈ పథకం వల్ల దాదాపు 10కోట్ల మంది పేద కుటుంబాలు లబ్ధి పొందుతాయి. దీని వల్ల 50కోట్ల మంది వినియోగదారులు లబ్ధి పొందుతారు.

ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలు:[మార్చు]

ఈ పథకం కింద సమగ్ర ఆరోగ్య సంరక్షణ కింద 1.5లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించనున్నారు. ఇందు కోసం రూ.1200కోట్లను కేటాయించారు. దీని వల్ల ఉపాధి కల్పన, మహిళలకు ఉపాధి కలుగుతుంది.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ పథకం వల్ల భారతదేశ జనాభాలోని 40శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

మూలాలు[మార్చు]

  1. ఆయుష్మాన్‌ భారత్‌. "ఆరోగ్య సంరక్షణకు 'మోదీకేర్‌'". ఈనాడు. www.eenadu.net. Archived from the original on 4 ఫిబ్రవరి 2018. Retrieved 14 February 2018.