ఆరోగ్యకరమైన ఆహారం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దస్త్రం:Colorful Photo of Vegetables.png
ఆరోగ్యకరమైన ఆహారంలో తాజా కూరగాయలు ప్రధానమైనవి.

ఆరోగ్యకరమైన ఆహారం (Healthy diet) అనేది ఆరోగ్య నిర్వహణ లేదా అభివృద్దికి సహాయపడుతుంది. ఇది అనేక దీర్ఘకాలిక ఆరోగ్య అపాయాలు అయిన స్థూలకాయం, గుండె జబ్బులు, చక్కర వ్యాధి మరియు క్యాన్సర్ మొదలైన వాటిని నివారించటానికి ముఖ్యమైనది.[1]

ఒక ఆరోగ్యకరమైన ఆహారం అన్ని పోషకాలను సరైన మొత్తాలలో తీసుకోవటం మరియు కావలసిన మొత్తంలో నీటిని త్రాగటం వంటివి కలిగి ఉంటుంది. పోషకాలను అనేక రకాల ఆహార పదార్ధాల నుండి పొందవచ్చును, అందువలన ఆరోగ్యకరమైన ఆహారాలుగా పరిగణింపబడే అనేక రకాల ఆహారాలు ఉన్నాయి.

ఆహారపు సిఫార్సులు[మార్చు]

ఆరోగ్యం యొక్క నిర్దిష్ట కోణాలను ప్రోత్సహించటానికి అసంఖ్యాక వైద్య మరియు ప్రభుత్వ సంస్థలచే రూపొందించబడిన అనేక ఆహారాలు మరియు సిఫార్సులు ఉన్నాయి. సాచ్యురేటెడ్ కొవ్వులకి బదులుగా పాలీఅన్సాచురేటేడ్ కొవ్వులను తినటం వలన కరోనరీ గుండె జబ్బు తగ్గించవచ్చని సాక్ష్యాలు మద్దతు ఇస్తున్నాయి.[2]

ప్రపంచ ఆరోగ్య సంస్థ[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జనాభాలు మరియు వ్యక్తులు ఇద్దరినీ పరిగణించి క్రింది 5 సిఫార్సులు చేసింది:[3]

ఇతర సిఫార్సులు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

 • కణాల పునరుద్దరణ మరియు మాంసకృత్తుల రవాణాకి కావలసినంత మొత్తంలో ఇసేన్షియల్ ఎమినో ఆసిడ్లు ("పూర్తీ మాంసకృత్తులు"). జంతువులలో అన్ని ఇసేన్షియల్ ఎమినో ఆసిడ్లు ఉంటాయి. కొన్ని ఎంపిక చెయ్యబడ్డ మొక్కలు (ఉదాహరణకి సోయా మరియు హేమ్ప్) అన్ని ఇసేన్షియల్ ఎమినో ఆసిడ్లు ఇస్తాయి. ఇతర మొక్కల యొక్క మిశ్రమం కూడా అన్ని ఇసేన్షియల్ ఎమినో ఆసిడ్లు ఇస్తుంది. అవకాడో వంటి ఫలాలు మరియు గుమ్మడి విత్తనాలు కూడా అన్ని ఇసేన్షియల్ ఎమినో ఆసిడ్లు కలిగి ఉంటాయి.[4][5]
 • విటమిన్స్ మరియు నిర్దిష్ట ఖనిజాలు వంటి అవసరమయిన సూక్ష్మపోషకాలు.
 • నేరుగా విషతుల్యం అయిన (ఉదా: హెవీ మెటల్స్) మరియు క్యాన్సర్ కారకాలు (ఉదా: బెంజీన్) వంటి పదార్ధాలను దూరంగా ఉంచటం;
 • మానవ రోగకారక క్రిములు (ఉదా: E. coli, టేప్ వర్మ్ గుడ్లు) చే మలినమైన ఆహార పదార్ధాలకి దూరంగా ఉండటం.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్[మార్చు]

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధికంగా పళ్ళు, కూరగాయలు మరియు ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లు మరియు సాచ్యురేటెడ్ క్రొవ్వును తక్కువగా కలిగి ఉన్న ఆహారాన్ని సూచిస్తుంది.[6]

DASH ఆహారం[మార్చు]

మిశ్రమం[మార్చు]

అధిక మొత్తాలలో తీసుకోవటం వలన విషతుల్యం చెయ్యకుండా ఒక వ్యక్తీ యొక్క అవసరాలను తీర్చటానికి ఒక ఆరోగ్యకరమైన ఆహారం స్థూలపోషకాలు/శక్తి (క్రొవ్వులు, మాంసకృత్తులు మరియు పిండి పదార్ధాలు) మరియు సూక్ష్మపోషకాల యొక్క సమతుల్యాన్ని కలిగి ఉండాలి.

అనారోగ్యపు ఆహారాలు[మార్చు]

అనారోగ్యకరమైన ఆహారం అనేక ధీర్గకాలిక రోగాల కొరకు ప్రధాన అపాయకరమైన విషయం, వాటిలో కొన్ని: అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి, అసాధారణ రక్త లిపిడ్స్, అధిక బరువు/స్థూలకాయం, కార్దియోవాస్క్యులార్ వ్యాధులు, మరియు క్యాన్సర్.[7]

WHO అంచనా ప్రకారం ప్రతీ సంవత్సరం 2.7 మిలియన్ మరణాలు ఆహారంలో ఫలాలను మరియు కూరగాయలను తక్కువగా తీసుకోవటం వలెనే సంభవిస్తున్నాయి అని తెలిసింది.[7] ప్రపంచవ్యాప్తంగా 19% గాస్ట్రో ఇంటేస్తైనల్ క్యాన్సర్, 31% ఇకమిక్ గుండె జబ్బు, మరియు 11% గుండెపోటులు,[1] కూడా అనారోగ్యకరమైన ఆహారం వలెనే వస్తున్నవి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించాదగిన మరణ కారణాలలో ఒకటిగా దీనిని చేస్తున్నాయి.[8]

ఆహారపు చేరికల పై వాదన[మార్చు]

కొంతమంది[who?] ఆహారానికి చేర్చే పదార్ధాలు అయిన కృత్రిమ తీపి కారకాలు, రంగులు, నిల్వ ఉంచటానికి వాడే పదార్ధాలు, మరియు రుచి కోసం వాడేవి మొదలైనవి క్యాన్సర్ ప్రమాదాన్ని లేదా ADHD వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతాయని వాదిస్తారు.[9]

ఫాస్ట్ ఫుడ్[మార్చు]

ఫాస్ట్ ఫుడ్ విమర్శకులకి ఉదాహరణలు జామి ఒలివర్, మోర్గాన్ స్పుర్లోక్ మరియు ఎరిక్ స్చ్లోస్సేర్ లను కలిగి ఉంటాయి.

అధికమైన ఆహారం[మార్చు]

ప్రజారోగ్యం[మార్చు]

1990 మధ్య వరకు అధిక కొలెస్ట్రాల్ యొక్క భయాలు తరచుగా వినిపించేవి. ఏది ఏమయినప్పటికీ, ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధన అధిక మరియు అల్ప సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మధ్య వ్యత్యాసాన్ని చూపించింది (వరుసగా 'మంచి' మరియు 'చెడు' కొలెస్ట్రాల్) ఇది కొలెస్ట్రాల్ యొక్క సమర్ధమైన చెడు ప్రభావాలు గురించి మాట్లాడుతున్నప్పుడు సూచించబడాలి. రకరకాల ఆహారపు క్రొవ్వు రక్తంలో కొలెస్ట్రాల స్థాయుల పై రకరకాల ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకి, పాలీఅన్సాచ్యురేటేడ్ కొవ్వులు రెండు రకాల కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి; మోనోఅన్సాచ్యురేటేడ్ క్రొవ్వులు LDL మరియు HDL లను తగ్గిస్తాయి; సాచ్యురేటెడ్ క్రొవ్వులు HDL[ఆధారం కోరబడింది] ను పెంచుతాయి లేదా HDL మరియు LDL రెండింటినీ పెంచుతాయి; మరియు ట్రాన్స్ క్రొవ్వులు LDL ను పెంచుతాయి మరియు HDL ను తగ్గిస్తాయి.ఆహారపు కొలెస్ట్రాల్ కేవలం జంతు ఉత్పత్తులు అయిన మాంసం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులలో ఉంటుంది, కానీ అధ్యయనాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న ఆహారపు క్రొవ్వు కూడా రక్తంలోని కొలెస్ట్రాల్ పై చాలా తక్కువ ప్రభావాన్ని చూపిందని నిరూపించాయి[ఆధారం కోరబడింది].

నేరుగా పిల్లల వద్దకి మార్కెట్ చెయ్యబడుతున్న, సామూహికంగా ఉత్పత్తి చెయ్యబడిన, ప్రాసెస్ చెయ్యబడిన "చిరుతిళ్ళు" లేదా "తీపి" ఉత్పత్తులు యొక్క మీడియా కవరేజీ తినే అలవాట్లను అభివృద్ధి చెయ్యటానికి చేసిన ప్రణాళికా కృషిని అణగదొక్కాయి. ఆహారం కొరకు ఉన్న అలాంటి ప్రకటనలతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే మధ్యం మరియు ఫాస్ట్ ఫుడ్ లు ఉత్సాహం, తప్పించుకోవటం మరియు తక్షణ తృప్తి అందించేవిగా చిత్రీకరించబడతాయి.

ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ సంస్థలు "జంక్" ఆహారాల పై విచ్చలవిడిగా ఖర్చుపెట్టిన మొత్తాన్ని మరియు మీడియా కవరేజీ యొక్క విధానాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపికలను ప్రోత్సహించాలని కూడా వ్యాపారాల పై ఒత్తిడి తెచ్చాయి, జంక్ ఆహారపదార్ధాలు ప్రభుత్వ పాఠశాలలో లభ్యం కాకుండా పరిమితం చెయ్యటం మరియు అధిక క్రొవ్వు ఉన్న ఆహారం పై పన్ను విధించటం చేసాయి. ఈ మధ్యనే యునైటెడ్ కింగ్డం మెక్ డొనాల్డ్స్ దాని యొక్క ఉత్పత్తులను ప్రచారం చేసుకొనే హక్కులను తీసివేసింది, ఎందుకంటే చాలా మటుకు ఆహారపదార్ధాలు తక్కువ పోషక విలువలు కలిగి ఉన్నాయి మరియు అవి "ఆన్నందకరమైన భోజనం' అనే ముసుగుతో పిల్లలను గురిపెడుతున్నాయి. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ తన సొంత ప్రభుత్వ-నిధులతో ప్రకటలను విడుదల చేసింది, వాటికి "Food4Thought" అని నామకరణం చేసింది, పాస్ట్ గుడ్ యొక్క హింసాత్మక స్వభావం సాధారణంగా ఏ విధంగా కలిగి ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తూ అది పిల్లలను మరియు పెద్దలను లక్ష్యాలుగా చేసుకుంది.

సాంస్కృతిక మరియు మానసిక విషయాలు[మార్చు]

ఒక మానసిక కోణం నుండి చాలా తక్కువ తినే అలవాట్లు ఉన్న ఒక వ్యక్తీ ఒక నూతన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవటం చాలా కష్టం. ఇది యుక్తవయస్సులో పొందిన రుచులు మరియు క్రొవ్వు పదార్ధాల కొరకు ఉన్న ప్రాధాన్యత వలన కావచ్చు. ఒకవేళ చాక్లెట్లు వంటి బహుమతులు అనుమతిస్తే అలాంటి వ్యక్తిని ఆరోగ్యకరమైన ఆహారానికి మార్చటం సులభం అవుతుంది; స్వీట్లు మానసిక సతిని స్థిరపరుస్తాయి, అందువలన సరైన పోషకాలను తీసుకోవటానికి ప్రేరేపిస్తాయి.

ఆహారాన్ని తీసుకోవటానికి సంబంధించి మనకి చిన్నతనంలో ఉన్న అనుభవాలు తరువాత జీవితంలో ఆహారం పై మన అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయనేది తెలిసిన విషయమే. దీని నుండి, మనం యెంత తింటాం అనే పరిధులు, అదే విధంగా మనం తినని ఆహార పదార్ధాలు వంటి వాటిని మనం నిర్ధారించుకోగలుగుతాము - ఇది ఆరగించటంలో సమస్యలైన ఎనోరేగ్జియా, బులిమియా లేదా ఆరోరేగ్జియ వంటివి రావటానికి కారణం అవుతుంది. మనం భోజనాల యొక్క లేదా మనం రోజూ తినే ఆహారం యొక్క పరిమాణాన్ని ఏ విధంగా తీసుకుంటాం అనే విషయంలో కూడా ఇది వాస్తవం; వారు పెరిగిన విధం బట్టి వ్యక్తులు చిన్న మరియు పెద్ద భోజనాల యొక్క వివిధ అంచనాలను కలిగి ఉంటారు.

అయితే మొక్కలు, కూరగాయలు మరియు ఫలాలు ధీర్గకాలిక వ్యాధి వచ్చే అవకాశాన్ని తగ్గించటంలో సహాయపడతాయి,[ఆధారం కోరబడింది] మొక్కల ఆధారిత ఆహార పదార్ధాల ద్వారా వచ్చే ఆరోగ్య లాభాలు, అదే విధంగా ఆరోగ్యపు లాభాలను పొందటానికి ఆహారంలో యెంత శాతం మొక్కల ఆధారితమైనది అయి ఉండాలి అనేది తెలియదు. అదే విధంగా, సంఘంలో మరియు పోషకాహార నిపుణుల వలయాల మధ్య మొక్కల-ఆధారిత ఆహార పదార్ధాలను కలిగి ఉన్న ఆహారం ఆరోగ్యం మరియు దీర్గాయువులతో సంబంధం కలిగి ఉంటుంది, అదే విధంగా కొలెస్ట్రాల్ తగ్గించటానికి, బరువు తగ్గటానికి మరియు కొన్ని విషయాలలో ఒత్తిడిని తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.[ఆధారం కోరబడింది]

అయితే, పోషకాల విభాగం, సాంస్కృతిక పోకడలు, మతపరమైన నిషేధాలు లేదా వ్యక్తిగత పరిగణలలో వచ్చిన శాస్త్రీయ అభివృద్దులు ప్రకారం "ఆరోగ్యకరంగా తినటం" అని పిలువబడే ఆలోచనలు వివిధ సమయాలు మరియు ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "WHO | Promoting fruit and vegetable consumption around the world". WHO. 
 2. Mozaffarian D, Micha R, Wallace S (2010). "Effects on coronary heart disease of increasing polyunsaturated fat in place of saturated fat: a systematic review and meta-analysis of randomized controlled trials". PLoS Med. 7 (3): e1000252. doi:10.1371/journal.pmed.1000252. PMC 2843598. PMID 20351774. 
 3. "WHO | Diet". WHO. 
 4. [1]
 5. [2]
 6. Walker C, Reamy BV (April 2009). "Diets for cardiovascular disease prevention: what is the evidence?". Am Fam Physician 79 (7): 571–8. PMID 19378874. 
 7. 7.0 7.1 "WHO | Diet and physical activity: a public health priority". 
 8. Lopez AD, Mathers CD, Ezzati M, Jamison DT, Murray CJ (May 2006). "Global and regional burden of disease and risk factors, 2001: systematic analysis of population health data". Lancet 367 (9524): 1747–57. doi:10.1016/S0140-6736(06)68770-9. PMID 16731270. 
 9. Jay L. Hoecker, M.D. "ADHD diet: Do food additives cause hyperactivity?". 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Public health