ఆరోన్ గేల్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | ఆరోన్ జేమ్స్ గేల్ |
పుట్టిన తేదీ | బాల్‌క్లూతా, ఒటాగో, న్యూజిలాండ్ | 1970 ఏప్రిల్ 8
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1989/90–1999/00 | Otago |
మూలం: CricketArchive, 2024 27 February |
ఆరోన్ జేమ్స్ గేల్ (జననం 1970, ఏప్రిల్ 8)[1] న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. 1992-93 సీజన్‌లో కాంటర్‌బరీకి వ్యతిరేకంగా ఒటాగో తరపున హ్యాట్రిక్ సాధించాడు.
గేల్ 1970లో ఒటాగోలోని బాల్‌క్లూతాలో జన్మించాడు. అతను డునెడిన్‌లోని ఒటాగో బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. వృత్తిపరంగా అకౌంటెంట్‌గా పనిచేశాడు. అతను న్యూజిలాండ్ కొరకు అండర్-19 టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. 1995లో న్యూజిలాండ్ టెస్ట్ జట్టులో భాగంగా భారతదేశంలో పర్యటించాడు.[2]
2000ల ప్రారంభంలో అతను హేర్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ కోసం ఇంగ్లాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడాడు.[3]
2022 నవంబరులో, హోకిటికాలోని రోలెస్టన్ రైజ్ గోల్ఫ్, క్రికెట్ క్లబ్‌లో జీవితకాల సభ్యునిగా గేల్ చేర్చబడ్డాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Aaron Gale, Cricinfo. Retrieved 2022-08-19.
- ↑ New Zealand in India, Oct-Nov 1995 – New Zealand Squad, CricInfo. Retrieved 2023-12-21.
- ↑ Deane S (2003) Hamish Marshall shows his best touch in London, CricInfo, 15 July 2003. Retrieved 2022-08-19.
- ↑ Sherman J (2022) Gale inducted, Hokitika Guardian, 7 November 2022, p. 10.