Jump to content

ఆర్చి

వికీపీడియా నుండి
A masonry arch
1. Keystone 2. Voussoir 3. Extrados 4. Impost 5. Intrados 6. Rise 7. Clear span 8. Abutment
An arch

ఆర్చి అనగా భవనానికి ప్రారంభంలో పైన వంపు తిరిగిన విభాగం.[1][2] ఈ వంపు తిరిగిన భాగం గుండ్రంగా, ఒక వృత్తం యొక్క భాగం వలె ఉంటుంది, ఈ భాగం రెండు భాగాలుగా మధ్య భాగానికి ఒక వృత్తం యొక్క భాగానికి మరొక వృత్త భాగంగా సమానంగా ఉంటుంది. భవనాల యొక్క ఆర్చీల తయారీలో తరచుగా చిన్నరాళ్ళు లేదా ఇటుకలు ఉపయోగిస్తారు. ఆర్చి యొక్క అగ్రభాగాన ఉన్న రాయిని కీస్టోన్ అంటారు, ఈ కీస్టోన్ మిగిలిన ఆర్చి రాళ్లను పై నుండి కిందికి పడకుండా ఉంచగలుగుతుంది. ఆర్చీలు ద్వారబంధాలు, కిటికీలకు పై భాగాన ఉంటాయి.

పురాతన కాలం నుండి ఆర్చ్ భవనాలు, ఇతర నిర్మాణాలు నిర్మించబడ్డాయి. క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలో మెసొపొటేమియన్లు ఇటుకలను ఉపయోగించి ఆర్చినను నిర్మించారు.[3] ఈ ఆర్చిలు సాంకేతికంగా పురాతన రోమన్లు నిర్మించిన మొట్టమొదటివి.

ఐరోపా నిర్మాణాలలో అర్ధ వృత్తాకార ఆర్చిలు ఉపయోగించబడ్డాయి. అటువంటి వంపులు దాని కేంద్రంలో కేంద్రీకృతమై ఉన్నందున శక్తి బలంగా ఉంటుంది. అర్ధ వృత్తాకార ఆర్చిలు విస్తరించి, దీర్ఘవృత్తాకార ఆర్చిలు కూడా తయారు చేయబడ్డాయి. ఇటువంటి ఆర్చిలు ఇటలీలోని పోంటే శాంటా ట్రినిటాలో కనిపిస్తాయి. పారాబొలిక్ ఆర్చ్‌లు బలమైన ఆర్చిలు. స్పానిష్ వాస్తుశిల్పి అయిన ఆంటోని గూడి పారాబొలిక్ ఆర్చ్‌ల ఆలోచనను మొదటిసారిగా కనుగొన్నాడు. వంగిన, పారాబొలిక్ (పరావలయ) ఆర్చిలు నేరుగా భవనాల పునాదులపై ఉంటాయి. ఈ వంపులకు ఆధారం అవసరం లేదు, ఎందుకంటే ఆర్చిలపై ఉన్న శక్తి నేరుగా నేలపైకి వెళుతుంది.

గుర్రపుడెక్క ఆకారపు ఆర్చిలు ప్రాథమికంగా అర్ధ వృత్తాకార ఆర్చిలు, కానీ దిగువ భాగాలు పొడవుగా ఉంటాయి, మధ్యలో కలుస్తున్నట్లు కనిపిస్తాయి, భారతదేశంలోని 1వ శతాబ్దపు రాక్-కట్ ఆర్చిలు అటువంటి ఆర్చ్‌లకు తొలి ఉదాహరణలు. మొదటి గుర్రపుడెక్క ఆర్చి 3వ శతాబ్దానికి చెందిన ఇథియోపియాలోని అక్సుమ్ రాజుల నిర్మాణాలలో ఉంది. అదే సమయంలో నిర్మించిన గుర్రపుడెక్క ఆర్చిలు కూడా సిరియాలో కనుగొనబడ్డాయి. ఏ ఆర్చ్ మొదట నిర్మించబడింది అనేదానికి, కచ్చితమైన ఆధారాలు లేవు.

మూలాలు

[మార్చు]
  1. "arch, n. 2" Oxford English Dictionary 2nd ed. 2009.
  2. "vault, n. 2." The Century Dictionary and Cyclopedia Dwight Whitney, ed.. vol. 10. New York. 1911. 6707. Print.
  3. "Ancient Mesopotamia: Architecture". The Oriental Institute of the University of Chicago. Archived from the original on 16 May 2012. Retrieved 16 May 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్చి&oldid=4076803" నుండి వెలికితీశారు