ఆర్థిక సంక్షోభం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వియన్నా[permanent dead link] స్టాక్ ఎక్సేంజి లో 1973 మే 9 న బ్లాక్ ఫ్రైడే. 1873 లో భయం, లాంగ్ డిప్రెషన్ తరువాత ప్రజలు.

ఆర్థిక సంక్షోభం (ఆంగ్లం: Financial Crisis) అంటే కొన్ని ద్రవ్యపరమైన ఆస్తులు ఉన్నట్టుండి తమ నామమాత్ర మూల్యాన్ని (nominal value) కోల్పోయే విస్తృతమైన పరిస్థితి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం, ఆర్థిక బుడగలు పేలిపోవడం, ద్రవ్య (కరెన్సీ) సంక్షోభం, ప్రభుత్వం తాము చేసిన అప్పులు చెల్లించకపోవడం మొదలైనవి ఆర్థిక సంక్షోభం కిందికి వస్తాయి.[1][2] చాలామంది ఆర్థికవేత్తలు ఆర్థిక సంక్షోభాలు ఎందుకు ఏర్పడతాయి, వాటిని ఎలా నివారించాలనేందుకు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ వాటి శాస్త్రీయత మీద ఆర్థికవేత్తలకు ఏకాభిప్రాయం లేదు. అప్పుడప్పుడూ ఆర్థిక సంక్షోభాలు ఏర్పడుతూనే ఉన్నాయి.

రకాలు[మార్చు]

బ్యాంకింగ్ సంక్షోభం[మార్చు]

బ్యాంకులో డబ్బు దాచుకున్న ఖాతాదారులంతా ఉన్నట్టుండి తమ డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే దానిని బ్యాంక్ రన్ అని అంటారు. బ్యాంకులు సాధారణంగా తమ వద్ద ఉన్న కొంత సొమ్మును మాత్రమే ఉంచుకుని మిగతా చాలా భాగం అప్పుల రూపంలో వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటారు. ఒక్కసారిగా చాలామంది ఖాతాదారులు వచ్చి తమ సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వలేరు. అప్పుడు బ్యాంకు దివాలా తీస్తుంది. ఖాతాదారులు తమ డిపాజిట్లను కోల్పోతారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ కూడా దీన్ని కాపాడలేదు. ఇలాంటి పరిస్థితులు కేవలం ఒకటో రెండో బ్యాంకులు కాక మరెన్నో బ్యాంకుల్లో జరుగుతూ ఉంటే దాన్ని సిస్టమిక్ బ్యాంకింగ్ క్రైసిస్ లేదా బ్యాంకింగ్ పానిక్ అంటారు.[3]

కరెన్సీ సంక్షోభం[మార్చు]

ఎక్స్‌చేంజ్ మార్కెట్లో పాల్గొనేవారు ఏదైనా కరెన్సీ స్థిరమైన ఎక్స్‌చేంజ్ రేటు నిలవదని గ్రహించడం వలన తమ స్పెక్యులేషన్ ద్వారా సదరు కరెన్సీ తొందరగా విలువ కోల్పోయేలా చేస్తారు. అప్పుడు కరెన్సీ సంక్షోభం ఏర్పడుతుంది.

ఊహాజనిత బుడగలు, కుప్పకూలడం[మార్చు]

కొన్ని రకాల ఆస్తులు ఒక్కోసారి ఎక్కువ కాలం పాటు మామూలు కంటే ఎక్కువ ధరలు పలుకుతూ పోతాయి. ఈ పరిస్థితి మామూలుగా ఎక్కువ మంది విక్రేతలు, తాము పెట్టుబడి పెట్టే సొమ్ము భవిష్యత్తులో అది తమకు ఎంత ఆదాయం ఆర్జించిపెడుతుంది అని కాకుండా, కేవలం రాబోయే కాలంలో ధర పెరుగుతుందనీ, అప్పుడు అమ్మితే సులభంగా లాభాలు గడించవచ్చనీ ఆలోచించినప్పుడు సంభవిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Charles P. Kindleberger and Robert Aliber (2005), Manias, Panics, and Crashes: A History of Financial Crises, 5th ed. Wiley, ISBN 0-471-46714-6.
  2. Luc Laeven and Fabian Valencia (2008), 'Systemic banking crises: a new database'. International Monetary Fund Working Paper 08/224.
  3. Fratianni, Michele U.; Marchionne, Francesco (10 April 2009). "The Role of Banks in the Subprime Financial Crisis". Review of Economic Conditions in Italy. SSRN 1383473.