ఆలూ టిక్కీ
Appearance
మూలము | |
---|---|
మూలస్థానం | భారతదేశము, పాకిస్తాన్ |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఉత్తర భారతదేశము, పంజాబ్ |
వంటకం వివరాలు | |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడి |
ప్రధానపదార్థాలు | బంగాళాదుంపలు , మసాలాలు |
వైవిధ్యాలు | రగడ పట్టీస్ |
ఆలూ టిక్కీ ఒక భారతీయ శాకాహార వంటకము. దీనిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆరగిస్తుంటారు.
కావలసిన పదార్థాలు
[మార్చు]- బంగాళదుంపలు - 3
- క్యారెట్, బీన్స్
- క్యాలీఫ్లవర్ - 100 గ్రాములు
- జీలకర్ర - 1 టీ స్పూన్,
- మిరియాల పొడి - పావు టీ స్పూన్
- పసుపు - అర టీ స్పూన్,
- అల్లం - 50 గ్రాములు
- చాట్ మసాలా - పావు టీ స్పూన్
- కొత్తిమీర - 1 కట్ట,
- పుదీనా - 1 కట్ట
- ఉప్పు - సరిపడా,
- కారం - తగినంత,
- నూనె - తగినంత
తయారీ
[మార్చు]- బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మెదపాలి.
- క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్‌లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి.
- అందులో జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, పుదీనా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కొద్దిగా అదమాలి.
- వీటిని పెనంమీద నూనెతో కాల్చుకుని పైన చాట్ మసాలా చల్లాలి.