ఆల్ఫా న్యూమరిక్ డేటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Alphanumeric keyboard.jpg

ఆల్ఫా న్యూమరిక్ డేటాలో ఆల్ఫాబెటిక్ డేటాకి సంబంధించిన అక్షరాలు (a నుండి z వరకు చిన్నవి, A నుండి Z వరకు పెద్దవి) గుర్తులు (?, %, @ మొదలగునవి) అంకెలు (0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9) కూడా ఉంటాయి. అయితే ఇందులో అంకెలకు స్థాన విలువ ఉండదు. ఈ అంకెలు కూడా సాధారణ అక్షరాలలాగే (Characters) పరిగణించబడతాయి. ఇందులో వచ్చే అంకెలు, సంఖ్యలతో కూడికలు, తీసివేతలు లాంటి లెక్కలు చేయలేము. ఉదాహరణకు : జేమ్స్‌బాండ్ 777, XYZ - 1632, AIW 4289

ఆల్ఫా న్యూమరిక్ డేటాను కంప్యూటర్ అర్ధం చేసుకొనే పద్ధతి[మార్చు]

కంప్యూటర్ మెమరీ చిన్న చిన్న సెల్స్ (Cells) అనేకం కలయికగా ఏర్పడుతుంది అని గమనించాము. ఒక్కొక్క దానిని Memory Cell అంటారు. ఈ Memory Cell ఒక Switch లాగ పనిచేస్తుంది. దీనికి రెండే రెండు స్థితులు ఉంటాయి. ఒకటి "ON" ఇంకొకటి "OFF". ONలోఉంటే హై ఓల్టేజి ప్రవహిస్తుంది. ఈ స్థితిని "1" (one) గా గుర్తిస్తారు. OFFలో ఉంటెలో ఓల్టేజి ప్రవహిస్తుంది. ఈ స్థితిని "0" (zero) గా గుర్తిస్తారు. మనం ఏదైనా డేటాని కంప్యూటర్ మెమరీకి అందివ్వాలంటే ఆ డేటాని ఈ రెండు అంకెల (1,0) వివిధ సముదాయాలుగా ఏర్పాటు చేసి అందించవలసి ఉంటుంది. వీటిని Binary Digits (BITS) అంటారు. మనం "A" అనే అక్షరాన్నికీ బోర్డు మీద ప్రెస్ చేసినపుడు "A" అనే అక్షరానికి నిర్ణయించబడిన బైనరీ డిజిట్స్ సృష్టించబడి మెమరీలో నిల్వ ఉంటుంది.

కంప్యూటర్ అర్ధం చేసుకునే బైనరీ డిజిట్స్ రెండు మాత్రమే (1,0) అని గ్రహించాము. మనకు ఇంగ్లీషులో కాపిటల్ లెటర్స్ వరకు చూసుకున్నా 26 ఉన్నాయి. మరి ఈ రెండు బైనరీ డిజిట్స్ తోటి 26 కాపిటల్ లెటర్స్ కంప్యూటర్ కు అర్ధమయ్యేలాగా ఎలా చెప్పాలి అనే ప్రశ్న సహజంగా కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానము పరిశీలించుదాము.

ఉదాహరణకు A అనే అక్షరానికి బదులు "1", B అనే అక్షరానికి బదులు "0" అని అనుకుంటే, రెండు అక్షరాలను మాత్రమే కంప్యూటర్ గుర్తించేలా చెయ్యగలము. మరొక విధముగా ఆలోచన చేస్తే 1,0 అనే రెండు బిట్స్ తోటి ఎన్ని సముదాయములు చేయగలమో చూద్దాము. 00, 01, 10, 11 అని మనము నాలుగు కాంబినేషన్స్ చేయగలిగాము. ఈ నాలుగు కాంబినేషన్స్ తోటి Aకి బదులు "00" Bకి బదులు "01" Cకి బదులు "10" Dకి బదులు "11" అనే నాలుగు అక్షరాలు మాత్రమే గుర్తించగలము. 000, 001, 010, 011, 100, 101, 110, 111 అని మూడు బిట్స్ తోటి ఎనిమిది కాంబినేషన్స్ చేయగలిగాము. అయినప్పటికి 26 అక్షరాలను గుర్తించటానికి అవకాశం కలుగలేదు. నాలుగు Bits తోటి 32 సముదాయములు చేయగలిగాము. అంటే 32 అక్షరాలు గుర్తించవచ్చు. కాని మనకు ఇంగ్లీషులో కాపిటల్ లెటర్స్ మాత్రమే కాదుగదా, స్మాల్ లెటర్స్, 0 నుండి 9 వరకు అంకెలు, క్వచిన్ మార్క్ (?) పర్సంటేజ్ (%) మొదలగు గుర్తులు కూడా ఉన్నాయి. ఇవన్ని కలుపుకుంటే సుమారుగా 94 వరకు ఉన్నాయి. 94 కాంబినేషన్స్ కావాలంటే ఒక్కొక్క అక్షరానికి అవసరమైన బిట్స్ పెంచుకుంటు పోవాలి. కాబట్టి ఆరు Bits తోటి 64 కాంబినేషన్స్ చేయగలము. అదే ఏడు బిట్స్ అయితే 128 కాంబినేషన్స్ చేయగలము. కాబట్టి మనకు అవసరమైన 94 అక్షరాలను గుర్తించటానికి ఒక్కొక్క అక్షరానికి ఏడు బిట్స్ ఉండేలా చూసుకొనగలిగితే సరిపోతుంది. కొన్ని తెలుగు వంటి ప్రత్యేకమైన భాషలలో అక్షరాలు, అంకెలు, గుర్తులు కలిపితే 128 కంటే ఎక్కువ వస్తాయి. అందువలన 8 బిట్స్‌తో అయితే 256 సముదాయములు చేయగలము. ఇలాగ ఒక్కొక్క అక్షరానికి గుర్తించటానికి వీలుగా, 1, 0 అనే బైనరీ డిజిట్స్ తో ఏర్పడిన కోడ్‌ను "బైనరీ కోడ్" అంటారు.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ