ఆసు రాజేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆసు రాజేంద్ర ప్రముఖ కథా రచయిత. ఆయనకు 1981లో "గుండె చప్పుళ్ళు " రచనకు గానూ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన పూర్తి పేరు ఆసు బాబూ రాజేంద్ర ప్రసాద్. ఆయన అమలాపురంలో బలరాం, నాగమణి దంపతులకు జూలై 20,1955 న జన్మించాడు. ఆయన ఎస్.బి.కె.ఆర్ కళాశాలలో బి.కాం చదివారు. ఆయన వృత్తి వ్యాపారం అయితే ప్రవృత్తి కవిత్వం. ఆయన కవితలు కొన్ని హిందీ, ఇంగ్లీషులో అనువదించబడ్డాయి.

ముద్రిత గ్రంథాలు[మార్చు]

 • వంటింటి సాహిత్యం (ఆసు హాస్య కవితలు) - 1981
 • గుండె చప్పుళ్ళు (మినీకవితల మాక్సీ సంపుటి) -1981
 • నాలుగు దిక్కులు (కవితా సంకలనం) - 1981
 • పడగ కింద పసితనం (దీర్ఘ వచన కవిత) - 1983
 • రాజకీయ భాగోతం (వచన కవితలు) - 1997
 • కార్డియోగ్రాఫ్ (మనోవిశ్లేషణ కవితలు) - 1990
 • దివ్యధారం (ఆధ్యాత్మిక స్రవంటి) చైతన్య కవిత - 1998
 • ప్రకృతి ఒడిలో (హైకూలు) చైతన్య కవిత - 2000
 • అంతర్ముఖం - కోనసీమ వాయిస్ రెగ్యులర్ ఫీచర్స్

సాహిత్య కార్యక్రమాలు[మార్చు]

1972 లో సమతా రచయిల సంఘ సంఘం సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా బాధ్యతన నిర్వహించారు. 1980లో కోనసీమ ఫిల్మ్‌ సొసైటీ లిమిటెడ్ ఎడిటోరియల్ బోర్దు మెంబరుగా ఉన్నారు. 1987లో కళాసాహితీ సాహితీ సాంస్కృతిక సంస్థ కోనసీమ విభాగానికి ప్రతినిధిగా వ్యవహరించారు. అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు.

అముద్రిత రచనలు[మార్చు]

 1. ప్రకృతి ఒడిలో (500 హైకూల పెద్ద సంపుటి)
 2. గోరంత దీపాలు (సూక్తులు)
 3. చకచక బండి (బాలగేయాలు)
 4. ఆల్చిప్పలో సముద్రం (మినీ కథల సంపుటి)
 5. మౌన సముద్రం (వచన కవితలు)

పురస్కారాలు[మార్చు]

 • 1986 : మైసూరు వారి ధ్వన్యాలోక సంస్థ వారిచే రెసిడెంట్ ఫెలోషిప్ పురస్కారం.
 • స్వర్ణ నంది, ఐదు కాంస్యనందులు పురస్కారాలు గెలుచుకున్న అమరజీవి నాటకానికి పాటలను రచించాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]