ఇంగ్లీష్ పార్క్, యెరెవాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంగ్లీష్ పార్క్
Armenia - A Wedding (5034068397).jpg
ఇంగ్లీష్ పార్క్ యొక్క కేంద్ర ఫౌంటెన్ చుట్టూ కొత్తగా పెళ్ళైన జంటలు
రకముప్రజా పార్కు
స్థానముకెంట్రాన్ జిల్లా, యెరెవాన్, ఆర్మేనియా
అక్షాంశరేఖాంశాలు40°10′27″N 44°30′29″E / 40.17417°N 44.50806°E / 40.17417; 44.50806Coordinates: 40°10′27″N 44°30′29″E / 40.17417°N 44.50806°E / 40.17417; 44.50806
విస్తీర్ణం5.5 హెక్టార్లు
నవీకరణ1860లలో
పునఃప్రారంభం అక్టోబర్ 3 1910
నిర్వహిస్తుందియెరెవాన్ నగర కౌన్సిలు
స్థితిసంవత్సరమంతటా తెరిచి ఉంటుంది

ఇంగ్లీష్ పార్క్ (ఆంగ్లం:English Park, Yerevan, అంగ్లియాకన్ ఐగి) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నగరంలోని ఇటలీ వీధిపై ఉన్నది. ఇది నగరం కేంద్రలో ఉన్న కెంట్రోన్ జిల్లాలో రిపబ్లిక్ స్క్వేర్ కు దక్షిణాన 5.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

చరిత్ర[మార్చు]

1860 సంవత్సరాల నాటి యెరెవాన్ లోని పురాతన పార్కులలో ఇంగ్లీష్ పార్క్ ఒకటి. దీనిలో మొదటి ప్రపంచ యుద్ధం (1910) వరకు ప్రధాన పునర్నిర్మాణం చోటుచేసికుంది.[1] 1920వ సంవత్సరంలో, ఇంగ్లీష్ పార్కులో అర్మేనియా యొక్క ఆధునిక చరిత్రలో మొట్టమొదటి ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు, యెరెవాన్, అలెగ్జాండ్రోల్ బృందాలు ఒకరితో ఒకరు ఇక్కడ తలపడ్డారు.[2] సోవియట్ పాలిస్తున్న సంవత్సరాలలో ఈ పార్కుకు 26 బాకు కమిషార్లు అనే పేరు పెట్టారు. అర్మేనియా స్వాతంత్ర్యం తరువాత, పార్క్ యొక్క అసలు పేరు పునరుద్ధరించబడింది.

సున్దుకియన్ అకాడెమిక్ థియేటర్, ఆర్మేనియాలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం, అర్మేనియాలోని ఇటాలియన్ రాయబార కార్యాలయం, యెరెవాన్ యొక్క ఉత్తమ వెస్ట్రన్ కాంగ్రెస్ హోటల్ పార్క్ యొక్క అంచున ఉన్నాయి.

1976 లో గాబ్రియేల్ సుండ్కుయాన్ యొక్క కాల్పనిక పాత్ర పెపో యొక్క స్మారక చిహ్నం పార్కులో నిర్మించారు.

పెళ్లి ఛాయాచిత్రాలకు పార్కులో ఉన్నటువంటి కేంద్ర ఫౌంటన్లు ఒక ప్రముఖ ప్రదేశం.

చిత్రమాల[మార్చు]

మూలాలు[మార్చు]