ఇంటర్నెట్ కేఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోల్డెన్ ప్రిన్సెస్ లో ఇంటర్నెట్ కేఫ్, లైబ్రరీ.
మన్స్టర్, జర్మనీలో ఒకేచోట ఇంటర్నెట్ కేఫ్, సబ్ పోస్ట్ ఆఫీస్

ఇంటర్నెట్ కేఫ్ లేదా సైబర్ కేఫ్ అనేది రుసుము తీసుకొని ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ఒక వేదిక. ఈ మాటలని పాశ్చాత్య దేశాలలో ఇంటర్నెట్ కఫే అనిన్నీ సైబర్ కఫే అనిన్నీ ఉచ్చరిస్తారు. ఇక్కడ సాధారణంగా కంప్యూటర్ ఉపయోగించుకున్న సమయం ఆధారంగా రుసుము వసూలు చేస్తారు.

చరిత్ర

[మార్చు]

దక్షిణ కొరియాలో మొదటి ఆన్లైన్ కేఫ్, ఎలక్ట్రానిక్ కేఫ్ అనే పేరుతో ప్రారంభమైంది, దీనిని మార్చి 1988 లో హన్‌జిక్ విశ్వవిద్యాలయం ముందు సియోల్లో హన్ శాంగ్-సు, కేయుం నూరి ప్రారంభించారు. ఇది రెండు 16-bit కంప్యూటర్లను కలిగి ఉన్నది, వీటికి టెలిఫోన్ లైన్ల ద్వారా ఆన్లైన్ సర్వీస్ నెట్వర్క్ అనుసంధానించబడింది. ఆన్లైన్ సేవా వినియోగదారుల యొక్క ఆఫ్లైన్ సమావేశాలు ఎలక్ట్రానిక్ కేఫ్ లో జరిగేవి, ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ కార్యకలాపాలు అనుసంధానం చేసే స్థలం అయ్యింది. కొరియాలో ఆన్లైన్ కేఫ్ ఇతర పురోగతి సాధించిన దేశాలకు 2-3 సంవత్సరములకు ముందే ప్రారంభమయింది.

ఆన్లైన్ కేఫ్ పద్ధతి యునైటెడ్ స్టేట్స్ లో జూలై 1991 లో ప్రారంభమైంది, శాన్ ఫ్రాన్సిస్కోలో వేన్ గ్రీగోరి అనే అతను ఎస్ ఎఫ్ నెట్ కాఫీహౌస్ నెట్వర్క్ పేరుతో దీనిని ప్రారంభించాడు.

గ్రిగోరి తాను రూపొందించిన 25 కాయిన్ కంప్యూటర్ టెర్మినల్స్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంతా కాఫీహౌస్లలో స్థాపించాడు. 32 లైన్ బులెటిన్ బోర్డు సిస్టంలోకి ఈ కేఫ్ టెర్మినల్స్ డయల్ చేయబడేవి, అది ఫిడోనెట్ మెయిల్, 1992 నుండి ఇంటర్నెట్ మెయిల్ సహా ఎలక్ట్రానిక్ సేవలను ఒక వ్యూహంగా అందించేది.

పూర్తి ఇంటర్నెట్ యాక్సెస్ (సైబర్ కేఫ్) తో కేఫ్ అనే భావన ఇవాన్ పోప్ 1994 ప్రారంభంలో కనుగొన్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]