ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి. సత్యనారాయణ
నిర్మాణం కె.ఎల్. నారాయణ
తారాగణం వెంకటేష్,
సౌందర్య,
వినీత,
కోట శ్రీనివాసరావు,
మల్లికార్జునరావు,
కాశ్మీర షా [1][2] The film was successful at the box office.[3]
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్
భాష తెలుగు

చిత్ర కథ

[మార్చు]

వెంకటేష్, సౌందర్యలకు పిల్లలు కలుగరు. సౌందర్యలో ఉన్న లోపాన్ని కప్పిపెట్టి వెంకటేష్ సర్దుకు వస్తుంటాడు. ఒకమారు వెంకటేష్ నేపాల్ కు వెళ్ళినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆమెకు ఒక మగపిల్లవాడు కూడా పుడతాడు. ఆ పిల్లవాడినే వెంకటేష్ దత్తతకు ఇంటికి తెస్తాడు. కాని వెంకటేష్ తండ్రి కోట శ్రీనివాసరావుకు అసలు సంగతి తెలిసి ఆ నేపాలి అమ్మాయి(వినీత)ని తన వూరికి తెస్తాడు. ఆ అమ్మాయే వంట మనిషిగా వెంకటేష్, సౌందర్యల వద్ద చేరుతుంది. ఇక కథ ఇంకా అనేక మలుపులు తిరుగుతుంది.[4]

పాటలు

[మార్చు]

పాటల రచయిత: సామవేదం షణ్ముఖశర్మ

  • బోల్ .. బోల్ .. ముత్యాలే - ఎస్.పి., సుజాత
  • ప్రియురాలే ప్రేమగా - ఎస్.పి., చిత్ర
  • పాపరో .. పాప్.. పాప్ - మనో, సంగీత
  • అమ్మనే అయ్యనురా - చిత్ర
  • ఓ లక్ష్మీ తిమ్మిరెక్కిందే , మనో
  • చిలకతో మజా, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-18. Retrieved 2021-09-30.
  2. "Archived copy". Archived from the original on 16 January 2012. Retrieved 2 January 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.
  4. NTV (21 May 2021). "పాతికేళ్ళ 'ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు'". Archived from the original on 10 సెప్టెంబరు 2021. Retrieved 10 September 2021.