ఇండోర్ గేమ్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రతి మనిసి బాల్యం ఆటలతోనే ప్రారంభం అవుతుంది.'ఆడుతూ పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు వుండదు' అనే సామెత అందరికి తెలిసినదే. ఆటలు/క్రీడలు ఆడటం వలన మనిసి ఆరోగ్యంగా, ఉత్యాహంగా వుండగలడు. క్రీడల అవశ్యకతను అన్ని దేశాలు గుర్తించాయి. అందువలన అన్ని దేశాలు ప్రభుత్వ మంత్రిమండలిలో క్రీడలకై ఒక శాఖను తప్పనిసరిగా కేటాయిస్తారు. వాటి ద్వారా క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుంది. వాటి ద్వారా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయంగా ఆటలను ఆడటం జరుగుతున్నది. వేల సంవత్సరముల క్రితమే ఒలంపిక్‌ ఆటలు గ్రీసులో మొదలైనవి.

క్రీడలు రెండు రకములు. ఒకటి బయటి ఆవరణలో ఆడే క్రీడలు.వీటిని అవుట్‌డోర్ గేమ్స్‌ (out door) అందురు. పుట్‌బాల్ (Foot ball), హకీ (hockey), సాప్ట్‌బాల్ (saft ball) కబాడి (kabhadi), మరియు క్రికెట్ (cricket) వంటివి. పై కప్పు కలిగి కలిగిన స్టెడియంలో ఆడే గేమ్స్‌ను ఇండోర్‌గేమ్స్ అంటారు. విటిలో కొన్నింటిని అవుట్‌డోర్ లోకూడా ఆడవచ్చును. కొన్ని రకముల ఇండోర్ గేమ్స్‌ గురించి దిగువన పెర్కొనడం జరిగింది.

టేబుల్‌ టెన్నిస్‌[మార్చు]

ప్రధాన వ్యాసం: టేబుల్ టెన్నిస్

టెబుల్ టెన్నిస్‌ను 'పింగ్‌పాంగ్ 'గేమ్‌ అని కూడా అంటారు. కీ.శ.1880 లో ఇంగ్లాండ్‌లో ఈ గేమ్‌ మొదలైంది. ఈ గేమ్‌ యిద్దరు లేక నలుగురు ఆడెదరు. యిద్దరు ఆడినచో సింగిల్‌గేమ్‌ అని, నలుగురు ఆడినచో డబుల్స్‌ అంటారు. ఈ గేమ్‌ను మొదట్లో లంచ్‌ తరువాత విరామ సమయములో కాలక్షేపంగా ఆడేవారు. కాల క్రమేన ఈ గేమ్‌ యొక్క ప్రాముఖ్యత మారింది. కీ.శ.1988 లో ఒలంపిక్‌లో ఈ గేమ్‌ ఆడెటందుకు అనుమతి లభించింది. తరువాత కీ.శ.2002 లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో అనుమతించబడింది. టేబుల్‌టెన్నిస్ యొక్క బోర్డ్‌ 9X5 అడుగుల సైజులో వుండును. గ్రౌండ్‌ నుండి బోర్డ్ 30" అంగుళముల ఎత్తులో వుండును. బోర్డ్ కు మధ్యలో అడ్డంగా ఒక నెట్ (net) కట్టబడి వుండును.ఈ నెట్‌ ఆరుఅంగుళముల ఎత్తు కలిగివుండును. ప్లేయరులు బోర్డ్‌కు ఇరువైపుల చివరలో నిలబడి ఆడేదరు. బ్యాట్‌ లేక రాకెట్‌ కొద్దిగా అండాకారములో వుండును. బ్యాట్‌ చెక్కతో చెయ్యబడి, రెండు పక్కల రబ్బరు షిల్డింగ్‌ కలిగి వుండును. రాకెట్ బ్లేడ్ వెడల్పు 6.0" అంగుళములు, పొడవు 6.5" అంగుళములు వుండును. బాల్‌ లేలికగా వుండు, లోపలి భాగములో గాలి వుండును. బాల్‌ సైజు 38-40 మి.మీ. వుండును. ప్రతి గేమ్‌లో11 పాయింట్్‌లు వుండును.ఎవ్వరు ముందుగా 11 పాయింట్ 6లు చెస్తారో అతను గెలచినట్లుగా ప్రకటిస్తారు. మొదటగా సర్వీసు చెయ్యు ఆటగాడు, బంతి మొదట తన వైపు కోర్ట్‌లో బౌన్స్‌అయ్యి, తరువాత ప్రత్యర్థి కోర్ట్‌లోనికి వెళ్ళెలా కొట్టవలెను. ప్రత్యర్థి తిరిగి బంతిని, అవతలి కోర్ట్‌లోనికి వెళ్ళెలాకొట్టవలెను. అలా కొట్టలేక పోయిన పాయింట్ కొల్పొవును. ప్రతి ఆటకు ఆట గాళ్లు బోర్డ్‌సైడ్‌ మారెదరు. 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఆటలు ఆడి ఎక్కువ గేమ్‌లు గెలచిన వ్యక్తిని ఫైనల్‌గా గెలచినట్లుగా ప్రకటిస్తారు.[1].[2]

బాడ్మింటన్[మార్చు]

ప్రధాన వ్యాసం: బాడ్మింటన్

బాడ్మింటన్‌ గేమ్‌[3] మొదటగా ఇంగ్లాండ్‌లో చిన్న పిల్లలు ఆడుకునే ఆటగా మొదలైంది. ఆ తరువాత భారత దేశములో బ్రిటీష్‌ వారి పాలన కాలములో, బ్రిటీష్‌ ఆర్మి వారు ఇండియాలో ఆదటం ప్రారంభించారు. మొదట్లో ఈ గెమ్‌ను 'Poona'అని పిలిచెవారు. కీ.శ.1938 లో అంతర్జాతియ బడ్మింటన్ ఫెడరెసన్‌ ఏర్పడినది. ఈ ఫెడరెసన్‌లో ప్రస్తుతం 130 దేశాలు సభ్యత్యము కలిగి ఉన్నాయి. ఒలంపిక్స్‌లో ఈ ఆటకు కీ.శ.1992 లో స్దానము కల్పించారు. బాద్మింటన్‌ కాక్‌ను (cock) బాతు ఈకలతో, చెక్క కార్క్‌తో చేస్తారు. కాక్‌లో 16 ఈకలు వుండును. రాకెట్‌ లేదా బ్యాట్ ను హికరి కార్బను మిశ్రమముటో లేదా స్టిల్‌తో తయారు చేస్తారు. సింగిల్‌ గేమ్‌ కోర్ట్‌ 17X44 అడుగుల సైజులో వుండును. డబుల్స్ అయినచో 20X44 అడుగుల సైజులో వుండును. కోర్ట్‌ చుట్టు 5 అడుగుల ఖాలీ వుండవలెను. కోర్ట్‌ను కాంక్రోట్‌ లేదా బుటిమినష్‌ తారుతో తయారు చెయ్యుదురు. కోర్ట్‌ను రెండు సమభాగములుగా చెస్తూ, మధ్యలో అడ్దంగా ఒక నెట్‌ రెండు పోస్టులకు గాట్టిగా లాగీ కట్టబడి వుండును. నెట్‌ఎత్తు పోస్టుల వద్ద 5 అడుగుల 1 అంగుళము (5'-1"), మరియు కోర్ట్‌మధ్యలో 5 అడుగులు (5'-0") వుండును. ప్రతి గేమ్‌కు 15 పాయింట్‌లు వుండును. లేడి ప్లేయర్స్‌ గేమ్‌ అయినచో 11 పాయింట్‌లు వుండును. సర్వీసింగ్‌ను కోర్ట్‌ యొక్క ఒక చివర నుండి బౌండరి లైన్‌ వెలుపలనుండి ప్రత్యర్థి కోర్ట్‌ లోపల ( బౌండరి లైన్ ్‌లోపల) వెళ్ళెలా కాక్‌ కొట్టవలెను. తన కోర్ట్‌లోనికి వచ్చిన బంతిని/కాక్ తిరిగి ప్రత్యర్థి కోర్ట్‌లోనికి పంపలేకపోయిన, పాయింట్ కొల్పొవును.సర్విస్ చేసిన ఆట గాడు అయ్యినచో సర్విస్ అవతలి ఆతగాడికి వెళ్ళును. ప్రతి గేమ్‌ అయ్యిన తరువాత కోర్ట్‌సైడ్‌ మారవలెను.[4]

వాలీబాల్‌[మార్చు]

ప్రధాన వ్యాసం: వాలీబాల్

వాలిబాల్‌ గేమ్‌ మొదటగా కీ.శ.1895 లో అమెరిక (U.S) లోమొదలైంది.ఆటలో రెండు టీములు (Teams) వుండును. ప్రతి టిములో 6 మంది ఆటగాళ్ళు వుండును. వాలిబాల్‌ను ఇండోర్‌గేమ్ గానే కాకుండగా, అవుట్‌డోర్‌ గేమ్‌గా బీచ్ వాలిబాల్‌ (Beach valley ball), గ్రాస్ వాలిబాల్ (grass valley ball) గేమ్‌గా కూడా ఆదెదరు. కీ.శ.1964 నుండి ఒలంపిక్‌ గేమ్స్ లో కూడా ఆడటం ప్రారంభమైంది. కోర్టు పొడవు 18 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు వుండును.కోర్టును రెండు (9X9mts) సమభాగములుగా చేస్తూ మధ్యలో ఒక నెట్‌వుండును. నెట్ యొక్క పై అంచు నుండి గ్రౌండ్‌కు 2.43 మీటర్ల ఎత్తులో వుండును. మహిళల గేమ్‌ అయ్యినచో 2.24 మీటర్ల ఎత్తులో వుండును. బాల్‌గోళాకారముగా వుండును. బాల్‌ను చర్మముతో లేదా సింథటిచర్మంతో తయారు చెయ్యుదురు. బాల్‌ చుట్టుకొలత 65-67 సెం.మీ. వుండును. బాల్ లోపలి గాలి వత్తిడి (pressure) 0.3-0.32 కీ.జి/సెం.మీ2 వుండవలెను. ప్లేయరులు తమ చేతులతో బంతిని అవతల కోర్టులోనికి వెళ్ళెలా కొట్టవలెను. తమ కోర్టులోనికి వచ్చిన బంతిని అవతలి కోర్టులోనికి వెళ్ళునట్లు చెయ్యుటకు మూడుసార్లు బంతిని టచ్‌చయ్యడం కాని, కొట్తడం, నెట్టడం కాని చెయ్యవచ్చును. అయితే వరుసుగా ఒకే ప్లేయరు రెండుసార్లు బంతిని తాకడం కాని కొట్టడం కాని చెయ్యరాదు. అవతలి కోర్టు నుండి వచ్చిన బంతిని ఒక ప్లేయరు చేతులతో పైకి లేచెలా కొట్టగా, రెండో ప్లేయరు బంతిని అవతలి కోర్టులోనికి వెళ్ళెలా కొట్టును. అలా కొట్తిన బంతి అవతలి కోర్టు గ్రౌండు్‌ను తాకిన, లేదా అవతలి వారు కొట్టిన బంతి అవతల నెట్6ను తగిలి ఆ కొర్టులోనే వుండిపోయిన పయింట్‌ను కోల్పొవును. ప్రతి టీము వాళ్ళు తమ ప్రత్యర్థి కోర్టులోని గ్రౌండ్‌ను తాకెలా 'షార్ప్‌ షాట్స్'కొట్టెందుకు ప్రయత్నిస్తారు.ప్రతి గేములో ఒక సెట్్‌కు 25 పాయింట్‌లు వుండును.ఒక గేములో 5 సెట్‌లు వుండును. 5 వ సెట్‌కు మాత్రం 15 పాయింట్‌లు మాత్రమే వుండును. బాల్‌ను చేతులతో మాత్రమే కాకుండగా, తలతో, భుజాలరో, మెడవెనుక భాగంతో మూవ్‌ చెయ్యవచ్చును. ఒక టీములో సెట్టర్స్ (setters), మరియు హిట్టర్స్ (hitters), వుంటారు. సెట్టరు బంతిని వడుపుగా పైకి లేపగా, హీట్ట్టరు బంతిని ప్రత్యర్థి కోర్తులో గ్రౌండ్‌నును తగిలే బంతిని కొట్టును.

బాస్కెట్ బాల్[మార్చు]

ప్రధాన వ్యాసం: బాస్కెట్ బాల్

బాస్‌కెట్ బాల్ గెమ్‌[5] మొదటగా USAలో 1891 లో స్పింప్‌ఫిల్డ్‌లో ఆడారు. కీ.శ.1936 లో ఒలంపిక్‌లో చేర్చారు.ఒక టిములో 13-15 మంది ప్లెయరులు వుంటారు. కాని కోర్టులో ఆట ఆడెటప్పుడు 5 మంది మాత్రమే ఆడుచు, ఒక ప్లెయరు కోర్టు లోపలికి వెళ్ళగా, మరో ప్లెయరు కోర్టు వెలుపలికి వచ్చును. కోర్టు 28 మీటరుల పొడవు, 15 మీటరుల వెడల్పు వుండును. కోర్టుకు చివర యిరువైపుల బౌండరి లైన్ వద్ద రెందు బాస్కెట్‌ నెట్ పోస్ట్‌లు వుండును. ఈ పోస్టులకు 6X3.5 సైజు బోర్డ్‌ అమరచ్చ బడివుండును. ఈ బోర్డులకు 18 అంగుళముల డయామీటరు వున్న రింగులు వుండి, దానికి క్రింద ఒపన్‌ వున్న నెట్‌వుండును. రింగ్‌ యొక్క పై అంచునుండి గ్రౌండ్‌లెవెల్‌ వరకు 10 అడుగుల ఎత్తు వుండును. కోర్ట్‌ లోపల కొన్ని సర్కిల్స్‌ గియ్యబడి వుండును. ఆయా సర్కిల్స్‌నుండి ప్లెయరులు బాల్‌ను రింగులో పడెలా వెయ్యటన్ని బట్టి పాయింట్స్‌ వుండును. బాల్‌సైజు పురుషుల గేమ్‌అయినచో 29.5 అంగుళంలువుండి, 624 గ్రాముల బరువు వుండును.మహిళల గేమ్‌అయినచో బాల్‌సైజు 28.5 గ్రాములు వుండి, 567 గ్రాముల బరువు వుండును.ప్రతి గేమ్ కు 10-12 నిమిషాలకు ఒక బ్రేకు చొప్పున 4 బ్రేకులు వుండును. ఎవ్వరు ఎక్కువ పయింట్‌లు సాధిస్తే వారు గెలచినట్లు. బాల్ అందుకున్న ప్లేయరు, ప్రత్యర్థి ప్లేయరుకు అందకుంద తప్పించుకును ముందుకు వెళ్ళుచు, అవసమైనప్పుడు, తన టీములోని ప్లేయరుకు బాల్‌ను పాస్‌చేస్తూ, ముందుకు వెళ్ళి, ప్రత్యర్థి కోర్ట్‌లోని రింగులో బాల్ వెయ్యవలెను. బాల్‌ను చేతితో మాత్రమే తాకవలెను. కాలితో తన్నరాదు. వుద్ధెశ్యపూరకంగా ప్రత్యర్థి ప్లేయరును నెట్టడంకాని, తోయడం కాని చెయ్యరాదు.

కారమ్‌బోర్డ్‌గేమ్(carrom Board Game)[మార్చు]

కారమ్ బోర్డు
కారమ్ మెన్

కారమ్‌బోర్డ్[6] ఆటలోని పరికరములు 1. కారమ్‌బోర్డ్ 2. కారమ్‌మెన్‌ లేదా కాయిన్స్, 3. స్ట్రైయికర్‌ 1. కారమ్‌బోర్డ్: నలుచదరంగా వుండి, ప్లైవుడ్ (ply wood) తో చేసిన బోర్డ్. అంచులకు చెక్క ఫ్రెమ్‌ వుండును. బోర్డ్‌సైజు74X74 సెం.మీ.వుండును. చెక్క ఫ్రెమ్‌1.25-3.0 అంగుళముల మందం వుండును. బోర్డ్ నాలుగు మూలలలో నాలుగు సాకెట్‌ హోల్స్‌ వుండును. బోర్డ్ ఉపరితలము నునుపుగా వుండి, కాయిన్స్, స్త్రైకరు, ఘర్షన లేకుండగా కదిలా వుండును. బోర్డ్‌మీద మార్కింగ్‌లు వుండును. పొడవుగా, నాలుగు వైపుల వున్న మార్కింగ్‌ మధ్య స్ట్రెకరు వుంచి కాయిన్స్ కొట్టవలెను. ఈ గేమ్‌ను యిద్దరు లేదా నలుగురు ఆడవచ్చును. యిద్దరు అయినచో ఎదురెదురుగా ప్లేయరులు కుర్చుంటారు. నలుగురు అయినచో ఒకే టీముకు చెందినవారు ఎదురెదురుగా కూర్చొవలెను.

2. కారమ్‌మెన్ లేదా కాయిన్స్: కారమ్స్‌చెక్క లేదా అక్రిలిక్‌ మెటెరియల్‌తో చెయబడి వుండును. ఇవి వర్తులాకారముగా వుండును. 19 కాయిన్స్ వుండును. అందులో 9 కాయిన్స్ నల్లగా, 9 కాయిన్స్ తెల్లగా వుండును, మరియు ఒక కాయిన్ ఎర్రగా వుండును. ఎర్ర కాయిన్‌ను రాణి (Queen) కాయిన్‌ అంటారు.

3. స్ట్రయికర్: దీన్ని అక్రిలిక్‌మెటెరియల్‌తో తయారు చెయ్యుదురు. మిగత కాయిన్స్‌కన్న యిది పెద్దదిగా వుండును. వివిధ రంగులలో వుండును. స్ట్రయికరుతో కాయిన్స్‌ను కొట్టెదరు. బోర్డ్‌మీద స్ట్రయికరు ఘర్షన లేకుండగా కదులుటకై బోర్డ్్‌మీద బోరిక్‌ ఆసిడ్‌ను చల్లెదరు.

ఆడె విధానము: మొదట కాయిన్స్‌ను బోర్డ్‌మధ్యలో వున్న వృత్తములో పేర్చవలెను. రెడ్‌కాయిన్ సెంటరులో వుండెలా, తెల్లకాయిన్స్‌'Y'ఆకారములో వుండెలా అమర్చవలెను. టస్‌గెలచిన వారు మొదట స్ట్రయిక్ చెయ్య వలెను. టస్ గెలచినవారు తెల్లకాయిన్స్‌ను కొట్టవలెను.స్ట్రయికరుతో కాయిన్స్‌ సాకెట్‌హోల్‌లో పడేలా కొట్టవలెను. రెడ్ కాయిన్‌ను సాకెట్‌లో పడేలా కోట్టిన వెంటనే మరో కాయిన్‌ను 'కవరింగ్‌ కాయిన్'గా కొట్టవలెను. లేనిచో తిరిగి రెడ్6కాయిన్ బోర్డ్ మీదికి వెళ్లును. ఎవ్వరి కాయిన్స్ ్‌ముందుగా బోర్డ్‌మీద ముందుగా ఖాళి అయ్యినచో వారు ఆ సెట్‌ గెలచినట్లు. బోర్డ్ మీద వున్న ప్రత్యర్థి కాయిన్స్‌ బట్టి పాయింట్స్ ను లెక్కించెదరు. రెడ్్‌కు 3 పాయింట్స్‌ యివ్వబడును. ఒక గేం్‌కు 25 పాయింట్స్‌ వుండును.మోదటగా 25 పాయింట్స్ చేసినవారు విజేతలు.

ఆధారాలు[మార్చు]