ఇండోర్ బిజాసన్ మాతా దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండోర్ బిజాసన్ మాతా దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మధ్య ప్రదేశ్
జిల్లా:ఇండోర్ జిల్లా
ప్రదేశం:ఇండోర్

ఇండోర్ బిజాసన్ మాతా దేవాలయం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్ పట్టణంలో ఉన్న హిందూ దేవాలయం. నవరాత్రి సందర్భాలలో వేలాదిమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.[1]

చరిత్ర

[మార్చు]

బిజాసన్ టేక్రి అనే కొండ మీద ఒక చిన్న పార్క్, చెరువు, ప్రసిద్ధ మాతా దేవాలయం ఉన్నాయి. 1760 సంవత్సరంలో శివాజీ రావ్ హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. దుర్గామాత మొత్తం 9 అవతారాలు ఈ దేవాలయంలో స్థాపించబడ్డాయి. కొండపైభాగంలో ఉన్న ఈ దేవాలయంలో అల్లావుద్దీన్ పూజలు నిర్వహించాడని, మాండవ్ రాజును ఓడించడానికి దుర్గాదేవి దీవెనలు కోరాడని నమ్ముతారు.

పండుగలు

[మార్చు]

ఇక్కడ ప్రధానంగా నవరాత్రి పండుగను జరుపుకుంటారు.[2] తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల్లో, ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరను కూడా నిర్వహిస్తారు.

ప్రదేశం

[మార్చు]

ఇండోర్ రైల్వేస్టేషన్ నుండి 9.8 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. బిజాసన్ మాతా దేవాలయమున్న కొండ నుండి దేవి అహల్యా బాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కనిపిస్తుంది. ఇతర వాహనాల ద్వారా కూడా దేవాలయానికి సులభంగా చేరుకోవచ్చు.[3]

మూలాలు

[మార్చు]
  1. "1000 साल पुराना है इंदौर के बिजासन माता मंदिर का इतिहास". Nai Dunia. 2017-09-27. Retrieved 2022-09-28.
  2. Amitabh (2018-02-26). "Bijasan Mata Mandir Indore Darshan, Aarti, Opening Time & Pooja Timings". Darshan Booking. Archived from the original on 2022-09-28. Retrieved 2022-09-28.
  3. Getinfocity (2018-03-11). "Bijasan Mata Temple Indore". GetInfoCity. Retrieved 2022-09-28.