Jump to content

ఇండ్ల చంద్రశేఖర్

వికీపీడియా నుండి
ఇండ్ల చంద్రశేఖర్
పుట్టిన తేదీ, స్థలం (1984-10-21) 1984 అక్టోబరు 21 (వయసు 40)
కందుకూరు
వృత్తినాటకరంగ ఉపాధ్యాయుడు
భాషతెలుగు
జాతీయతభారతదేశం
పౌరసత్వంభారతదేశం
విద్యపిహెచ్‌డి(నాటకరంగం)
పూర్వవిద్యార్థినిర్మల్ విద్యా నికేతన్, కందులూరు(2000)
ఆంధ్ర ప్రదేశ్ సాంఘీక సంక్షేమ జూనియర్ కళాశాల, వెలిగొండ(2000-2002)
బి ఎస్సీ కంప్యూటర్స్, జవాహర్ భారతి డిగ్రీ కళాశాల కావలి(2006)
మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం(2006-2008)
M.Phil Pondicherry Central University (2008-09)
PhD UoH(2010-2020)
కాలం2003-ప్రస్తుతం
రచనా రంగంకథ, నాటకం, నవల
విషయందళిత క్రైస్తవం, కాల్పనిక సాహిత్యం
గుర్తింపునిచ్చిన రచనలురంగుల చీకటి, ఎర్ర గబ్బిలాల వేట[1]
పురస్కారాలురావి శాస్త్రి కథా పురస్కారం(2022), డా. వి. చంద్రశేఖర రావు కథా పురస్కారం(2021), నంది నాటక పురస్కారం(2010)
జీవిత భాగస్వామిఎజిల్ మతి
సంతానంరాజీవ్‌లోచన్, ఆద్విశ్రిత

ఇండ్ల చంద్రశేఖర్ రచయిత, నాటక దర్శకుడు. ఇతడు రాసిన రంగుల చీకటి కథా సంకలనానికి 2021లో డా, వి. చంద్రశేఖర్ రావు కథా పురస్కారం, 2022లో రావి శాస్త్రి కథా పురస్కారం దక్కాయి.[2]

బాల్యం, చదువు

[మార్చు]

21 అక్టోబర్ 1984న టంగుటూరు మండలం కందుకూరులో ఇండ్ల సత్యవతి, అంకయ్య దంపతులకు పుట్టాడు. పదవ తరగతి వరకు కందులూరులోని నిర్మల్ విద్యా నికేతన్ లో చదువుకున్నాడు. ఇంటర్ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకులంలో చదువుకున్నాడు. బిఎస్సీ కంప్యూటర్స్ జవాహర్ భారతి డిగ్రీ కళాశాలలో పూర్తి చేసాడు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో స్నాతకోత్తర డిగ్రీలో గోల్డ్ మెడల్ పొందాడు. పాండిచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో ఎం ఫిల్ పూర్తి చేసాడు. పిహెచ్‌డి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో "ఆడియెన్స్ రిసెప్షన్" అంశంపై 2020లో పూర్తి చేసాడు.

ఉద్యోగం

[మార్చు]

ది ఆఘాఖాన్ అకాడెమీ హైదరాబాదులో నాటకరంగోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

రచనా వ్యాసంగం

[మార్చు]

కథా సంకలనం

[మార్చు]
  • రంగుల చీకటి
  • యెర్రగబ్బిలాల వేట

గుర్తింపు

[మార్చు]
  • రెండు సార్లు కేంద్ర సాహిత్య అకాడెమీ యువ కథా సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా పాల్గొనడం.
  • నాటకరంగంలో జేఅరెఫ్ నెట్
  • నంది పురస్కారం
  • సాక్షి ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి

మూలాలు

[మార్చు]
  1. "Hyderabad Book Fair : నా జ్ఞాపకాలకు, నా జ్ఞానాన్ని కలిపి యెర్రగబ్బిలాలుగా చేసి.. !". Andhrajyothy Telugu News. 28 December 2022. Retrieved 23 September 2023.
  2. "Chandrasekhar Indla - Holding the baton of Telugu theatre | Aga Khan Academies". www.agakhanacademies.org. Retrieved 23 September 2023.