Jump to content

ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం

వికీపీడియా నుండి
ఏపికార్ల్ పరిశోధనా కేంద్రంలో పశువుల పెంపకం, వ్యాధి నిర్ధారణ కిట్లు, వ్యాక్సిన్ల తయారీతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తిపై ప్రయోగాలు జరుగుతాయి.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం (ఐజికార్ల్‌) ను 200 వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పులివెందులలో అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం (ఐజికార్ల్‌)ను పులివెందుల పెద్దరంగాపురం సమీపంలో ఏర్పాటు చేశారు. 650 ఎకరాలు కేటాయించారు . 2009 జనవరి 25న ప్రారంభించారు. ఇందులొ పరిశోధనా క్షేత్ర భవనం, ఉద్యోగుల నివాసం, అతిథి గృహాలు, క్యాంటీన్‌, ల్యాబొరేటరీలు, శాస్త్రజ్ఞుల హాస్టళ్లు, సబ్‌స్టేషన్‌, రోడ్లు, వాణిజ్య సముదాయం, మిగతా అత్యాధునిక భవనాలతో పాటు తదితర అత్యున్నతస్థాయి ప్రమాణాలతో నిర్మీంచారు . ఈ సంస్థ ద్వారా అభివృద్ధి ఫలాలను దేశ రైతాంగానికేకాక ప్రత్యేకించి ఆసియా, ఆప్రికా, లాటిన్‌ అమెరికా దేశాల రైతాంగానికి కూడా లబ్ధిచెకూరుతుంది . 77 ఎకరాల్లో ఈ పరిశోధనా కేంద్రాన్ని నిర్మాణం పూర్తిచేశారు. పశువులకు వచ్చే గాలికుంటువ్యాధి, ఆంత్రాక్స్ తదితర రోగాలు, అణురూప, కణజన్యు శాస్త్రం, పునరుత్పత్తి, శీతలీకరణ జీవశాస్త్రం, నానో బయాలజీ, పశుపోషణ, ఇమ్యునాలజి, నాణ్యత నియంత్రణలపై పరిశోధనలు చేసేందుకు ఈ కేంద్రం నిర్మించారు. తద్వారా పశువులకు సంబంధించిన వ్యాక్సిన్లు, మందులు కనుగొనాలనేది ఉద్దేశం.[1] అత్యున్నతస్థాయి ప్రమాణాలతో 386 కోట్లతో రూపొందించిన కూడా వాడకం లేనందున భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-30. Retrieved 2015-02-02.

బయటి లంకెలు

[మార్చు]