ఇంద్రదీప్ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రదీప్ సిన్హా
రాజ్యసభ సభ్యుడు
In office
1974–1986
వ్యక్తిగత వివరాలు
మరణం9 జూన్ 2003
కళాశాలపాట్నా విశ్వవిద్యాలయం

ఇంద్రదీప్ సిన్హా (1914 జూలై[1] - 2003 జూన్ 9) [2] స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 1964 నుండి పదెళ్లు సభ్యత్వంతో పాటూ బీహార్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆదాయ మంత్రిగా కూడా పనిచేశారు.

రాజకీయ జీవితం

[మార్చు]

బీహార్‌లోని ప్రస్తుత సివాన్ జిల్లాలోని షకర గ్రామంలో జన్మించాడు. 1938లో[3] పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. దాదాపు 25 పుస్తకాలు రాశాడు. సిన్హా 1940లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.[4] లెక్చరర్ గా జర్నలిస్ట్ గానే కాక, సిన్హా 1962 నుండి 1967 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ బీహార్ రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శిగా ఉన్నారు. 1973 నుండి 1990 ల చివరి వరకు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హన్కార్, జనశక్తి, న్యూ ఏజ్ వారపత్రికలకు సిన్హా ఎడిటర్ వ్యవహరించారు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వంతో ఇంద్రదీప్ సిన్హా తన శాసన జీవితాన్ని 1964లో ప్రారంభించి 1974 వరకు కొనసాగారు. అతను 1967 నుండి 1968 వరకు బీహార్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆదాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఆదాయ మంత్రిగా, అతను పేదల పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రంలో భూమిలేని వారికి భూమి పంపిణీకి చర్యలు తీసుకున్నారు. సిన్హా 1974 ఏప్రిల్ నుండి 1980 ఏప్రిల్ వరకు, తిరిగి 1980 జూలై నుండి 1986 జూలై వరకు రెండు పర్యాయాలు రాజ్యసభలో బీహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు.

పాక్షిక పుస్తకాల జాబితా

[మార్చు]
  • క్రైసిస్ ఆఫ్ క్యాపిటలిస్ట్ పాత్ ఇన్ ఇండియా: ది పాలసీ ఆల్టర్నేటివ్స్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (1982)
  • ఆన్ సర్టేన్ ఐడియలాజికల్ పొజిషన్ప్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (1983)
  • రియల్ ఫేస్ ఆఫ్ జెపీ'స్ టోటల్ రివల్యూషన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (1974)
  • సమ్ ఫీచర్స్ ఆఫ్ కరెంట్ అగ్రరెయిన్ సిట్యుయేషన్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా కిసాన్ సభ (1987)
  • ది చేంజింగ్ అగ్రరెయిన్ సీన్: ప్రాబ్లమ్స్ అండ్ టాస్క్స్, పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ (1980)
  • సమ్ క్వశ్చన్స్ కన్సర్నింగ్ మార్క్సిజం అండ్ ది పీసన్ట్రీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (1982)

మూలాలు

[మార్చు]
  1. "Indradeep Sinha cremated". The Times of India. 2003-06-11. Archived from the original on 2011-09-28. Retrieved 2008-01-11.
  2. http://www.tribuneindia.com/2003/20030611/nation.htm
  3. V.Gangadhar (1 ఆగస్టు 2003). "Com. Indradeep Sinha Remembered". New Age. Archived from the original on 7 నవంబరు 2007. Retrieved 4 ఏప్రిల్ 2008.
  4. "CPI veteran Indradeep passes away". The Times of India. 2003-06-10. Archived from the original on 2012-10-23. Retrieved 2008-01-11.