ఇంద్రవెల్లి స్థూపం
Established | ఏప్రిల్ 20, 1987 |
---|---|
Location | ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, తెలంగాణ, భారతదేశం |
ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా నిర్మించారు. ఇది తెలంగాణ రాష్ట్రం , ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలంలో ఆదివాసీ అమర వీరుల ఇంద్రవెల్లి స్థూపం ఉంది.[1] [2][3][4] [5] [6][7]
సభ ఏర్పాటు
[మార్చు]ఆదివాసీలు పోడు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని,పండించిన పంట,అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేసింది.
సంఘటన,కారణాలు
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం)భూమి బదలాయింపు చట్టం -1959 వచ్చింది. దీనికి 1970లో మార్పులు చేశారు దీనినే 1/70 చట్టంగా పిలుస్తారు. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులు (అమ్మకం, కౌలు, గిఫ్ట్) చెల్లకుండా చర్యలు చేపట్టారు. అడవిపై ఆదివాసీలకే హక్కు ఉండాలని ఈ చట్టం చెబుతోంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించడం అంతరించిపోతున్న ఆదివాసీ తెగలను కాపాడడం కోసం 1/70 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ పరిణామాల తర్వాతే ఇంద్రవెల్లి సంఘటనకు దారితీసింది.వలసదారుల దోపిడీ నిరాటంకంగా కొనసాగడం, భూముల అన్యాక్రాంతం, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల ప్రాబల్యం పెరగడం వలన, జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం అయ్యాయి. వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981 నాడు ఒక సమావేశానికి పిలుపు నిచ్చింది. మొదలు సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆదివాసుల నుంచి వస్తున్న స్పందనను చూసి సభపై నిషేధం విధించారు. ఈ విషయం తెలియని ఆదివాసులు జన సంద్రమై అడవిని దాటుకొని ప్రవాహంలా ఇంద్రవెల్లికి వచ్చారు. అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అడవుల్లో దిగాయి. వేలాదిగా వస్తున్న నిరాయుధులైన ఆదివాసులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు.ఆదివాసీలు బాటపట్టి అడవిలో పరుగులు తిస్తుంటే,పోలీస్ బలగాలు వెంటాడి కాల్చిచంపారు.[8][9]
అమరవీరుల సంస్మరణ దినం
[మార్చు]ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20 ను ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినంగా ఆదివాసులు జరుపుతుంటారు[10]
స్మారకస్థూపం ఏర్పాటు
[మార్చు]రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 42 ఏళ్లు: ఇది 'స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్' కథ". BBC News తెలుగు. 2022-04-20. Retrieved 2024-04-20.
- ↑ "ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా?". Sakshi. 2021-04-19. Retrieved 2024-04-20.
- ↑ Desk 4, Disha Web (2023-12-08). "ఇంద్రవెల్లి అమరుల స్థూపం విస్తరణ.. ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు". www.dishadaily.com. Retrieved 2024-04-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu, ntv (2023-04-20). "Indravelli incident: మాయని ఇంద్రవెల్లి గాయాలు.. మారణకాండకు 42ఏళ్లు". NTV Telugu. Retrieved 2024-04-20.
- ↑ ఈనాడు (2024-04-20), నింగికెగిసిన అడవిబిడ్డలకు సలాం, retrieved 2024-04-20
- ↑ "చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం". EENADU. Retrieved 2024-07-03.
- ↑ Bureau, The Hindu (2024-07-01). "Bhumi puja performed for development of Smriti Vanam at Indervelli Adivasi martyrs' column". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-07-03.
- ↑ "ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా?". Sakshi. 2021-04-19. Retrieved 2024-04-20.
- ↑ "నెత్తుటి జ్ఞాపకానికి 39 ఏళ్లు". Sakshi. 2020-04-20. Retrieved 2024-04-20.
- ↑ నమస్తే తెలంగాణ (2024-04-20), మానని గాయం, retrieved 2024-04-20