ఇన్స్టంట్ ఫిల్మ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ISO 640, కలర్ ఇన్స్టంట్ ఫిలిం పై Polaroid Type 600 కెమెరా ద్వారా తీయబడ్డ ఒక ఛాయాచిత్రం

ఇన్స్టంట్ ఫిల్మ్ (ఆంగ్లం: Instant Film) అనునది పోలరాయిడ్ సంస్థచే కనుగొనబడ్డ ఇన్స్టంట్ కెమెరాలో వాడబడే ఒక రకమైన ఫిలిం. ఇన్స్టంట్ కెమెరా ద్వారా బహిర్గతం అవగనే ఈ ఫిలిం పై ముందే అద్దబడి ఉన్న రసాయనాల వలన ఫిలింపై సంవర్థనం జరుపబడి కొన్ని సెకనుల వ్యవధిలోనే ఛాయాచిత్రంగా మారిపోతుంది.

ఉత్పత్తులు[మార్చు]

ప్రస్తుతం ఇన్స్టంట్ ఫిలిం రెండు బ్రాండులలో లభిస్తుంది.

పోలరాయిడ్ ఇన్స్టంట్ ఫిలిం ఈ క్రింది పరిమాణాలలో లభిస్తుంది.

 • 24 mm × 36 mm
 • 50.8 cm × 61 cm
 • 83mm × 108mm

ఇన్స్టాక్స్ ఫిలిం ఈ క్రింది పరిమాణాలలో లభిస్తుంది.

 • మిని: 46 mm × 62 mm (1.8 in × 2.4 in)
 • స్క్వేర్ (చతుర్భుజం) : 62 mm × 62 mm (2.4 in × 2.4 in)
 • వైడ్ (వెడల్పు) : 99 mm × 62 mm (3.9 in × 2.4 in)

సాంప్రదాయ ఫిలిం చుట్టతో పోలిస్తే ఇన్స్టంట్ ఫిలిం యొక్క నాణ్యత తక్కువగా ఉన్ననూ ఫిలిం సంవర్థనకై వేచి ఉండకుండా (అప్పటికి ఇంకా డిజిటల్ కెమెరాలు కనుగొనబడలేదు కాబట్టి) తక్షణమే ఛాయాచిత్రం కావలసిన చోట దీనిని ఉపయోగించేవారు. ఉదా: చట్టపరమైన వినియోగానికి, ఆరోగ్య సంరక్షణకి, సైంటిఫికి అప్లికేషన్లకు, పాస్ పోర్ట్, ఇతర గుర్తింపు కార్డులకి లేదా కేవలం ఛాయాచిత్రాలని తక్షణమే చూడటానికి ఉపయోగించేవారు. సంప్రదాయ ఫిలింను వాడే ముందు, ఒక ఛాయాచిత్రం ఎలా వస్తుందో ముందే ఒక అవగాహనకి రావటానికి కూడా ఇన్స్టంట్ ఫిలింని ఉపయోగించేవారు. ఛాయాచిత్రం తీయగనే స్క్రీన్ పై అగుపించే డిజిటల్ ఫోటోగ్రఫీ రావటంతో ఇన్స్టంట్ ఫిలిం తెరమరుగైనది.

ప్రస్తుతం లభించే ఇన్స్టంట్ ఫిలింల జాబితా[మార్చు]

ద ఇంపాజిబుల్ ప్రాజెక్ట్[మార్చు]

 • PX 100 First Flush
 • PX 600 Silver Shade
 • PX 680 Color Shade
 • Impossible Cool
 • PQ Silver Shade (B&W)
 • PX 70 Color Protection
 • PX 680 Color Protection
 • PZ 680 Color Protection

ఫూజీ ఫిలిం[మార్చు]

 • Instax Mini
 • Instax Wide

మూలాలు[మార్చు]