ఇబ్రహీం జద్రాన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఖోస్త్, ఆఫ్ఘనిస్తాన్ | 2001 డిసెంబరు 12|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 15) | 2019 సెప్టెంబరు 5 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూన్ 14 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 48) | 2019 నవంబరు 11 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 5 September 2023 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 41) | 2019 నవంబరు 14 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 27 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–present | Mis Ainak నైట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 7 June 2023 |
జద్రాన్ (జననం 2001 డిసెంబరు 12) ఆఫ్ఘన్ క్రికెటరు. అతను 2019 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం టెస్టుల్లో అడుగుపెట్టాడు.[2]
దేశీయ కెరీర్
[మార్చు]అతను 2017 ఆగస్టు 11న 2017 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో మిస్ ఐనాక్ రీజియన్ కోసం లిస్టు ఎ క్రికెట్‌లో ప్రవేశించాడు. [3] 2017 సెప్టెంబరు 12న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్ కోసం ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు [4]
2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నంగర్హర్ జట్టులో ఎంపికయ్యాడు. [5]
2021లో ఇబ్రహీం, బెర్క్‌షైర్‌లోని బోయిన్ హిల్ తరపున ఆడాడు. ఓపెనర్‌గా ఆడుతూ, 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేశాడు. [6]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]డిసెంబరు 2018లో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అండర్-23 జట్టులో ఎంపికయ్యాడు. [7]
డిసెంబరు 2017లో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [8] అతను 186 పరుగులతో టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [9]
2019 ఆగష్టులో ఇబ్రహీం, బంగ్లాదేశ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [10] [11] 2019 సెప్టెంబరు 5న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన రంగప్రవేశం చేశాడు [12] మరుసటి నెలలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [13] అతను 2019 నవంబరు 11న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ఆడాడు.[14] 2019 నవంబరు 14న వెస్టిండీస్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున T20I ల్లో రంగప్రవేశం చేసాడు. [15]
2019 డిసెంబరులో, అతను 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [16] అతను ఐదు మ్యాచ్‌ల్లో 240 పరుగులతో టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [17] 2022 జూన్‌లో, జింబాబ్వేతో జరిగిన రెండవ మ్యాచ్‌లో జద్రాన్, 120 పరుగులతో అజేయంగా వన్‌డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. [18] 2022 నవంబరులో, అతను తన రెండవ వన్‌డే సెంచరీ (106), శ్రీలంకపై పల్లెకెల్లెలో చేశాడు. [19] ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అదే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో, 162 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో తన దేశానికి చెందిన ఆటగాడి అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. [20] అతను 92.66 సగటుతో 278 పరుగులతో సిరీస్‌ను ముగించి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. [21]
ఆరు నెలల తర్వాత, 2023 జూన్‌లో ఇబ్రహీం, 2023 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై 98 పరుగులు చేసి, హంబన్‌తోటలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. [22] శ్రీలంకలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను 106, 10, 162, 98 పరుగులు చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
- ↑ "Ibrahim Zadran". ESPN Cricinfo. Retrieved 11 August 2017.
- ↑ "4th Match, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Khost, Aug 11, 2017". ESPN Cricinfo. Retrieved 11 August 2017.
- ↑ "3rd Match, Shpageeza Cricket League at Kabul, Sep 12 2017". ESPN Cricinfo. Retrieved 12 September 2017.
- ↑ "Gayle, Afridi, Russell: icons in Afghanistan Premier League". ESPN Cricinfo. Retrieved 11 September 2018.
- ↑ "Thames Valley Cricket League - Player History". www.tvlcricket.com. Retrieved 2022-11-30.
- ↑ "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
- ↑ "Afghanistan Under-19s Squad / Players". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
- ↑ "ICC Under-19 World Cup, 2017/18 - Afghanistan Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 February 2018.
- ↑ "Afghanistan squads announced for Bangladesh Test and Triangular Series in September". Afghan Cricket Board. Archived from the original on 20 August 2019. Retrieved 20 August 2019.
- ↑ "Rashid Khan to lead new-look Afghanistan in Bangladesh Test". ESPN Cricinfo. Retrieved 20 August 2019.
- ↑ "Only Test, Afghanistan tour of Bangladesh at Chattogram, Sep 5-9 2019". ESPN Cricinfo. Retrieved 5 September 2019.
- ↑ "Focus on youth as Afghanistan revamp squads for West Indies series". ESPN Cricinfo. Retrieved 25 October 2019.
- ↑ "3rd ODI (D/N), West Indies tour of India at Lucknow, Nov 11 2019". ESPN Cricinfo. Retrieved 11 November 2019.
- ↑ "1st T20I (N), West Indies tour of India at Lucknow, Nov 14 2019". ESPN Cricinfo. Retrieved 14 November 2019.
- ↑ "Afghanistan U19 squad announced for ICC U19 World Cup". Afghanistan Cricket Board. Retrieved 8 December 2019.
- ↑ "ICC Under-19 World Cup, 2019/20 - Afghanistan Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 February 2020.
- ↑ "Bowlers, Ibrahim Zadran, Rahmat Shash help Afghanistan seal ODI series". ESPN Cricinfo. Retrieved 6 June 2022.
- ↑ "Ibrahim, Farooqi, Naib lead Afghanistan to comfortable win". ESPNcricinfo. Retrieved 26 November 2022.
- ↑ "Ibrahim Zadran breaks record during epic hundred against Sri Lanka". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-30.
- ↑ "Afghanistan tour of Sri Lanka 2022/23 Stats". ESPNcricinfo. Retrieved 3 June 2023.
- ↑ "Ibrahim Zadran, seamers help Afghanistan stroll to a comfortable win". ESPNcricinfo. Retrieved 3 June 2023.