ఇమ్రాన్ ఖాన్ (క్రికెటర్, జననం 1987)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇమ్రాన్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ ఇమ్రాన్ ఖాన్
పుట్టిన తేదీ (1987-07-15) 1987 జూలై 15 (వయసు 37)
లోయర్ దిర్ జిల్లా, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 218)2014 అక్టోబరు 20 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2019 నవంబరు 21 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–presentఖైబర్ పఖ్తూన్వా
2021–presentMultan Sultans
కెరీర్ గణాంకాలు
పోటీ Test ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 10 113 74 77
చేసిన పరుగులు 16 709 181 16
బ్యాటింగు సగటు 2.28 6.62 6.96 4.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 6 32 18* 11
వేసిన బంతులు 1,636 16,729 3,439 1,633
వికెట్లు 29 382 92 85
బౌలింగు సగటు 31.62 25.27 34.27 25.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 20 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3 0 0
అత్యుత్తమ బౌలింగు 5/58 9/69 6/48 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 11/– 16/– 10/–
మూలం: ESPNcricinfo, 22 March 2022

మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (జననం 1987, జూలై 15) పాకిస్తానీ క్రికెటర్. 2014, అక్టోబరు 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున ఆరంగ్రేటం చేసాడు.[1] ఇమ్రాన్ దేశీయంగా పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, జరై తారకియాతి బ్యాంక్, పెషావర్ పాంథర్స్ తరపున ఆడాడు.[2]

జననం

[మార్చు]

మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ 1987, జూలై 15న ఖైబర్ పఖ్తుంక్వాలోని లోయర్ దిర్‌లోని మైదాన్ లోయలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2017 పాకిస్తాన్ కప్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా తరపున మూడు మ్యాచ్‌లలో ఆరు అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రాణించాడు.[3]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

2019 అక్టోబరులో, ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్టు జట్టుకు తిరిగి పిలవబడ్డాడు, అక్కడ అతను ఆడిన ఆటలో ఒకే వికెట్ తీసుకున్నాడు.[8] ఖాన్ చివరిసారిగా 2017 జనవరిలో టెస్టు క్రికెట్ ఆడాడు.[9] 2019 డిసెంబరులో, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[10]

2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[11][12] అయితే, 2020 జూన్ 23న, కరోనా-19కి పాజిటివ్ పరీక్షించిన పాకిస్తాన్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్ళలో ఖాన్ ఒకడు.[13] జులైలో, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ 20 మంది సభ్యుల జట్టులో షార్ట్‌లిస్ట్ చేయబడ్డాడు.[14][15]

2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[16][17] 2021–22 జాతీయ టీ20 కప్‌లో పదహారు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.[18]

మూలాలు

[మార్చు]
  1. "Australia tour of United Arab Emirates, 1st Test: Australia v Pakistan at Dubai (DSC), Oct 22–26, 2014". ESPN Cricinfo. Retrieved 22 October 2014.
  2. Imran Khan – CricketArchive. Retrieved 15 December 2014.
  3. "Pakistan Cup, 2017 Khyber Pakhtunkhwa: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 19 April 2018.
  4. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  5. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  6. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  7. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
  8. "Scorecard of game on australia tour 2019". ESPN Cricinfo.
  9. "Fresh faces in Pakistan squads in post-Sarfaraz Ahmed overhaul". ESPN Cricinfo. Retrieved 28 October 2019.
  10. "Fawad Alam returns to Pakistan's Test squad for Sri Lanka series". ESPN Cricinfo. Retrieved 7 December 2019.
  11. "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 12 June 2020.
  12. "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 12 June 2020.
  13. "Seven more Pakistan players test positive for Covid-19". ESPN Cricinfo. Retrieved 23 June 2020.
  14. "Pakistan shortlist players for England Tests". Pakistan Cricket Board. Retrieved 27 July 2020.
  15. "Wahab Riaz, Sarfaraz Ahmed in 20-man Pakistan squad for England Tests". ESPN Cricinfo. Retrieved 27 July 2020.
  16. "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
  17. "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
  18. "Iftikhar Ahmed's all-round heroics see Khyber Pakhtunkhwa to successful National T20 title defence". Pakistan Cricket Board. Retrieved 13 October 2021.

బాహ్య లింకులు

[మార్చు]