ఇర్విన్ రోజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇర్విన్ రోజ్
ఇర్విన్ రోజ్, c. 2000
జననం(1926-07-16) 1926 జులై 16
బ్రూక్లైన్, న్యుయార్క్ యు.ఎస్.ఎ
మరణం2015 జూన్ 2 (2015-06-02)(వయసు 88)
డీర్ ఫీల్డ్, మాంచెస్టర్, యు.ఎస్
జాతీయతయునైటెడ్ స్టేట్స్
రంగములుజీవ శాస్త్రము
విద్యాసంస్థలుఫాక్స్ ఛేజ్ కాన్సర్ సెంటర్
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం
యాలె విశ్వవిద్యాలయం
పూర్వ విద్యార్థిచికాగో విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిఅవాంఛనీయ ప్రోటీన్‌లను నాశనం చేసే కణాల ఆవిష్కరణ
ముఖ్యమైన అవార్డులురసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి (2004)

ఇర్విన్ అల్లాన్ రోస్ (జూలై 16, 1926 – జూన్ 2, 2015) ప్రఖ్యాత అమెరికన్ జీవ రసాయన శాస్త్రవేత్త. అవాంఛనీయ ప్రోటీన్‌లను నాశనం చేసే కణాలను కనుక్కొన్నందుకు రోజ్ 2004లో రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. సర్వికల్ క్యాన్సర్, సిస్టిక్ ఫిబ్రోసిస్ వంటి వ్యాధులకు నూతన చికిత్సలను ఆవిష్కరించడానికి ఈయన పరిశోధనలు పనికొచ్చాయి.

జీవిత విశేషాలు[మార్చు]

రోజ్ అమెరికా లోని బ్రూక్లైన్(న్యూయార్క్) లో జ్యూయిష్ కుటుంబంలో ఎల్లా(గ్రీన్‌వాల్డ్), హారే రాయ్‌జే దంపతులకు జన్మించారు.[1]రోజ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో రెండవ ప్రపంచయుద్ధంలో నావీలో పనిచేయుటకు ఒక సంవత్సరం ముందు చేరాడు. యుద్ధం నుంచి వచ్చిన తరువాత ఆయన 1948 లో బి.ఎస్, 1952 లో జీవ రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి ని చిగాగో విశ్వవిద్యాలయం నుండి పొందారు.[2] ఆయన 1954 నుండి 1963 వరకు యాలే స్కూల్ ఆఫ్ మెడిసన్ లో జీవ రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా పనిచేసారు. ఆ తరువాత 1963 లో ఆయన ఫాక్స్ ఛేజ్ క్యాన్సర్ సెంటర్ లో 1963 లో చేరి ఆయన 1995 లో పదవీవిరమణ వరకు అక్కడే పనిచేసారు.[3] ఆయన 1970 లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక జీవ రసాయన విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసారు.[4] ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయలోని ఇర్విన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఫిజియాలజీ, బయోఫిజిక్స్ విభాగాలకు ప్రొఫెసర్ గా యున్నారు. అచ్చటనే ఆయనకు 2004 లో నోబెల్ బహుమతి ప్రకటించబడినది.[3]

ఇర్విన్ రోజ్ పిలడెల్ఫియాలో ఫాక్స్ ఛేజ్ క్యాన్సర్ సెంటర్ లో పనిచేయునపుడు అనేక మంది పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ నిచ్చారు. 'కిస్‌ ఆఫ్‌ డెత్‌' సర్వైకల్‌ క్యాన్సర్‌, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ వ్యాధులకు మూలకారకాలు ప్రోటీన్లను జీవకణాలు ధ్వంసం చేసే ప్రక్రియను కనుగొ న్నందుకు ఇర్విన్‌రోజ్‌ను నోబెల్‌ బహుమతి వరించింది. ఆయన 2015 జూన్ 2 న డీర్‌ఫీల్డ్, మసాచుసెట్స్ లో మరణించారు.[2][5]

ప్రచురణలు[మార్చు]

 • Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.
 • Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.

మూలాలు[మార్చు]

 1. Nobelprize.org - Irwin Rose Autobiography
 2. 2.0 2.1 Chang, Kenneth (2 June 2015). "Irwin A. Rose, Nobel-Winning Biochemist, Dies at 88". New York Times. Retrieved 4 June 2015.
 3. 3.0 3.1 Weil, Martin (3 June 2015). "Irwin Rose, who shared 2004 Nobel Prize in chemistry, dies at 88". Washington Post. Retrieved 4 June 2015.
 4. "Selected Awards and Honors to Penn Faculty and Alumni: Nobel Prizes". University of Pennsylvania Website. Archived from the original on 3 నవంబర్ 2013. Retrieved 4 June 2015.
 5. ABC News. "2004 Nobel Chemistry Winner Irwin Rose Dies at 88". ABC News.
 • Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.

ఇతర లింకులు[మార్చు]