ఇళ్ళ ఆదిలక్ష్మి
ఇళ్ళ ఆదిలక్ష్మి | |
---|---|
జననం | రామశెట్టి ఆదిలక్ష్మి తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | రంగస్థల నటి |
మతం | హిందు |
భార్య / భర్త | ఇళ్ళ వెంకట్రావు |
తండ్రి | రామశెట్టి సుబ్బారావు |
తల్లి | జయమ్మ |
ఇళ్ళ ఆదిలక్ష్మి రంగస్థల నటి.[1]
జననం
[మార్చు]ఆదిలక్ష్మి, రామశెట్టి జయమ్మ, సుబ్బారావు దంపతులకు తాడేపల్లిగూడెంలో జన్మించింది. తన 18వ ఏట నాటకరంగంలోకి ప్రవేశించింది. తండ్రి సుబ్బారావు రంగస్థల నటుడు, దర్శకుడు.
నాటకాలలో
[మార్చు]ఆదిలక్ష్మి తన తలిదండ్రుల స్ఫూర్తితో కట్నాలు-కాపురాలు, నిప్పురవ్వలు, పూలరంగడు, ప్రేమ పూజారి, కాఫీ హోటల్ కాంతమ్మ, పల్లెపడుచు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, చావకూడదు, పెళ్ళిచూపులు, చల్ చల్ గుర్రం, స్వీట్ పాయిజన్ మొదలగు సాంఘిక నాటక/నాటికలలోప్రధాన పాత్రలు ధరించింది.
ఇతర విశేషాలు
[మార్చు]అనురాధ భర్త ఇళ్ళ వెంకట్రావు (రంగస్థల పౌరాణిక నటుడు) స్థాపించిన ‘చంద్రశేఖర కళానిలయం’ ద్వారా శకుంతల, శ్రీ రామభక్తహనుమాన్, పాదుకా పట్టాభిషేకం, మహావీర ఇంద్రజిత్తు నాటకాల్లో ముఖ్యపాత్రలను పోషించింది. అంతేకాక ‘తులసీ జలంధర’లో పార్వతి, ‘భూకైలాస్’లో కైకసి, ‘పల్నాటి యుద్ధం’లో మాంచాల పాత్రలు కూడా ధరించింది. ప్రభుత్వ ప్రచార నాటికలు సుఖీభవ, ఎయిడ్స్, అక్షరదీక్ష ప్రదర్శనల్లో పాల్గొన్నది.
మూలాలు
[మార్చు]- ↑ ఇళ్ళ ఆదిలక్ష్మి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబర్ 2011, పుట. 19.