ఇస్మాయిల్‌ఖాన్‌పేట దుర్గాభవాని దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్గాభవాని దేవాలయం
దుర్గాభవాని దేవి
దుర్గాభవాని దేవి
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సంగారెడ్డి జిల్లా
ప్రదేశం:ఇస్మాయిల్‌ఖాన్‌పేట్
సంగారెడ్డి మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:దుర్గాదేవి

ఇస్మాయిల్‌ఖాన్‌పేట దుర్గాభవాని దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ గ్రామంలో ఉన్న దేవాలయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో మూడురోజులపాటు వార్షికోత్సవాలు జరుగుతాయి. లక్ష దీపోత్సవం కార్యక్రమం ఇక్కడి ప్రత్యేకత.[1]

చరిత్ర[మార్చు]

ఈ గ్రామంలో ఉన్న పురాతన కోటలో ఈ దేవాలయం నిర్మించబడింది. 800 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయం కర్ణాటకలోని బసవ కల్యాణ పీఠాధిపతి అయిన స్వామి మదనానంద సరస్వతిచే పునరుద్ధరించబడింది. ఈ ఆలయం శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థాన్, దక్షిణామ్నాయ శారదా పీఠం ఆధీనంలోకి వస్తుంది. ఈ దేవాలయానికి ఎనిమిది ప్రకారాలు నిర్మించబడ్డాయి. ఇక్కడికి వచ్చిన భక్తుల కోర్కెలు నెరవేరుతుండడం వల్ల మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దేవాలయానికి నిత్యం భక్తులు వచ్చి తమ మొక్కును చెల్లించుకుంటారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.

ప్రత్యేకత[మార్చు]

ఇక్కడి దేవత 15 అడుగుల ఎత్తుతో ఒకే రాతితో చేయబడింది, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దుర్గామాత విగ్రహమిది.[2]

ఉత్సవాలు[మార్చు]

  1. వార్షికోత్సవం: ప్రతి సంవత్సరం మార్చి నెలలో మూడురోజులపాటు దేవాలయ వార్షికోత్సవాలు నిర్వహించబడుతాయి. ఈ వార్షికోత్సవం చివరిరోజు లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. దేవాలయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న లక్ష దీపోత్సవం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ దీపాలను వెలిగిస్తారు.[3]
  2. నవరాత్రి ఉత్సవాలు: ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ రోజూ ఒక్కోరూపంలో అమ్మవారిని అలంకరిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "కన్నుల పండువగా అమ్మవారి వార్షికోత్సవాలు". andhrajyothy. 2019-03-25. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.
  2. "Welcome to Official Website of Telangana Tourism Corporation". tourism.telangana.gov.in. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.
  3. "నందీశ్వర వాహనంపై ఊరేగిన వీరభద్రుడు". EENADU. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.