ఇ. అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇ. అహ్మద్
ఇ. అహ్మద్

ఇ. అహ్మద్


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం మలప్పురం

వ్యక్తిగత వివరాలు

జననం (1938-04-29) 1938 ఏప్రిల్ 29 (వయసు 85)
కన్నూర్ (కేరళ), కేరళ
రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
జీవిత భాగస్వామి కీ.శే. జుహరా అహ్మద్
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె
నివాసం కన్నూర్ (కేరళ)
వెబ్‌సైటు http://eahamed.com/
సెప్టెంబరు 13, 2007నాటికి

ఇ. అహ్మద్ (ఆంగ్లం : E. Ahamed) (జననం 29 ఏప్రిల్, 1938) ప్రస్తుతం 15వ పార్లమెంటులో, రైల్వేశాఖ సహాయ మంత్రి. ఇతను మలప్పురం, కేరళ నుండి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున గెలుపొందాడు. 14 వ లోక్‌సభలో విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా వున్నాడు.

జీవితం - విద్య[మార్చు]

ఏప్రిల్ 29, 1938 లో, కేరళలోని కన్నూర్ లో జన్మించాడు. టెల్లిచెరిలోని బ్రెన్నెన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బి.ఎ.బి.ఎల్. పూర్తి చేశాడు. ఆతరువాత న్యాయవాద వృత్తిలో ప్రవేశించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కేరళ శాసనసభ;

1967 నుండి 1991 వరకు కేరళ శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. 1982 నుండి 1987 వరకు, కేరళ పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు చేశాడు.

లోక్‌సభ;

1991 లో మొదటిసారిగా పొన్నై లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యాడు. ఈ కాలంలో అనేక కమిటీలకు ప్రాతినిధ్యం వహించాడు. 1992 నుండి 1997 వరకు భారత్ తరఫున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకు, భారత డెలిగేషన్ లో ఒక సభ్యుడు. 2004 నుండి 2009 వరకు విదేశీవ్యవహారాలకు సహాయ మంత్రిగాను, 2009 నుండి రైల్వేశాఖ సహాయమంత్రిగా సేవలందిస్తున్నాడు.

ఇతరములు[మార్చు]

ఇతను అనేక విద్యాసంస్థలతోను, సాంస్కృతిక సామాజిక సంస్థలతో సంబంధాలు కలిగివున్నాడు. ఇతను మూడు పుస్తకాలనూ రచించాడు.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇ._అహ్మద్&oldid=3256016" నుండి వెలికితీశారు