ఈస్టిండియా కంపెనీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రకం | Public |
---|---|
పరిశ్రమ | అంతర్జాతీయ వాణిజ్యము |
స్థాపన | 1600 |
స్థాపకుడు | John Watts |
క్రియా శూన్యత | జూన్ 1, 1874 |
విధి | రద్దు చేయబడింది. |
ప్రధాన కార్యాలయం | , |
ఈస్టిండియా కంపెనీ (East India Company) 1600 సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ. బ్రిటీష్ వాళ్ళు ఈ సంస్థ ద్వారా భారతదేశంలో వర్తక వాణిజ్యములను నెరపడానికి వచ్చి భారత దేశాన్ని ఆక్రమించారు.భారతదేశ చరిత్రలో ఈస్టిండియా కంపెనీ ఒక సాధారణ వాణిజ్య కంపనీయే కాదు అది ఒక మహా సామ్రాజ్యం.
18వ శతాబ్దం
[మార్చు]సా.శ.1700 సంవత్సరం సమయానికి భారతదేశంలో ఈస్టిండియా కంపెనీలో దక్షిణభారతదేశానికి రాజధానిగా చెన్నపట్టణం ఉండేది. ఐతే పరిపాలించేదుకు రాజ్యాలు మాత్రం ఏమీ ఉండేవి కాదు. చెన్నపట్టణం కోటలోనూ, తూర్పు సముద్ర తీరాన్ని వర్తక స్థానాలుండేవి. మొగలాయి చక్రవర్తిని, నవాబులను ఆశ్రయించి పట్టాలుగా పొందిన కొన్ని గ్రామాలు మాత్రం ఉండేవి. చెన్నపట్టణంలో కోట ఉండేది, దానికి ఆనుకుని జార్జి టౌన్ ఉన్నచోట నల్లవారి బస్తీ అన్న పేట ఉండేది. 1693లో తండయారుపేట, పొరశవాకం, ఎగ్మూరు, తిరువళిక్కేణి అనే గ్రామాలు పొందారు. విశాఖపట్టణం, వీరవాసరం, పులికాట్, ఆర్మగాను, కడలూరు మొదలైన గ్రామాలు, పట్టణాల్లో వివిధ వర్తకస్థానాలు ఉండేవి. 1701నాటికి వీరి స్థితి దక్షిణ భారతదేశంలోని నవాబులు, రాజుల దయాదాక్షిణ్యాలపైన కూడా ఆధారపడివుండేది. సేనానాయకునిగా, నవాబు ప్రతినిధిగా అంచెలంచెలుగా ఎదుగుతూ సా.శ.1700 నాటికి కర్ణాటక నవాబు అయిన దావూద్ ఖాన్ హోదా స్వీకరించగానే చెన్నపట్టణం ఈస్టిండియా వర్తకసంఘం గవర్నర్‌గా ఉన్న కెప్టెన్ థామస్ పిట్ పెద్ద, చిన్న తుపాకులు, ముఖం చూసుకునేందుకు అద్దాలు, విదేశీ మద్యం, ఇతర విలువైన వస్తువులు కానుకగా పంపారు. ఇంతటి కానుకలు కూడా దావూద్ ఖాన్ కు మన్నించకపోగా అతను వచ్చిన రాయబారిని అగౌరవపరిచారు. ఆపై సంవత్సరం 1701 జూలైలో దావూద్ ఖాన్ 10వేల ఆశ్వికులు, కాల్బలం తీసుకుని వచ్చి చెన్నపట్టణం దగ్గర్లో శిబిరం వేసుకున్నాడు. దీనికి భయపడ్డ పిట్ మరిన్ని బహుమానాలు పంపగా నవాబు స్వీకరించలేదు, ఈ స్థితిగతులు ప్రమాదభరితంగా ఉండడంతో అతను నౌకాదళాన్ని రేవులోకి దింపి నగరంలో సిద్ధంగా ఉంచారు. ఆపైన మాత్రం బహుమానాలు తీసుకుని కొంత ఉపశమించి, గవర్నరుతో విందారగించి, మద్యం స్వీకరించాడు. తన ఏనుగులు, అశ్వదళాలతో చెన్నపట్టణంలో ఊరేగుతానని నవాబు భయపెట్టగా అతనికి మరికొంత మద్యాన్ని పోయించి మత్తెక్కించారు. ఆపైన సంవత్సరం కూడా నగరాన్ని దిగ్బంధించడంతో ఇదంతా సొమ్ము కోసం చేస్తున్న పనిగా అవగాహన చేసుకున్న పిట్ కర్ణాటక నవాబుకు రూ.25వేలు లంచంగా ఇచ్చి తృప్తి పరిచారు. 1707లో శక్తివంతులైన మొఘల్ చక్రవర్తుల్లో ఆఖరివాడైన ఔరంగజేబు చక్రవర్తి మరణించాకా పరిపాలనకు వచ్చిన షాఅలం చక్రవర్తి అయ్యాడు. అతని పాలన అంతా నజీరు మూలంగా జరుగుతూండగా మంత్రి జూడీఖాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తి తిరువత్తియ్యూరు, కత్తివాగము, నుంగంబాకం, వ్యాసార్పాడి, సత్తెనగాడులనే గ్రామాలను కంపెనీ కౌలుతీసుకుంది.[1]
ఇవి కూడ చూడండి
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]- The Twilight of the East India Company: The Evolution of Anglo-Asian Commerce and Politics, 1790-1860 Archived 2020-05-28 at the Wayback Machine: బోయ్డెల్ & బ్రూవర్, ఉడ్‌బ్రిడ్జ్, 2009
- From Trade to Colonization: ఈస్టిండియా కంపెనీ యొక్క చారిత్రక డైనమిక్స్
- ఈస్టిండియా కంపెనీ చిహ్నములు , గుర్తులు
- [1] రహస్య వ్యాపారం గుత్తాధిపత్యం ఆధారంగా.
- [2] Archived 2007-10-28 at the Wayback Machine - బ్రిటీష్ గ్రంథాలయ సంకలనము
- Trading Places: ఈస్టిండియా కంపెనీ , ఆసియా
- ఈస్టిండియా కంపెనీ చరిత్ర
- ఈస్టిండియా కంపెనీ ఓడలు
- భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ
- లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లోని సంకలనాలు
- బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ
- ఈస్టిండియా కంపెనీ చరిత్ర , రాజకీయాలు
- ఆంగ్లేయుల విస్తరణ
- Nick Robins, New Statesman, 13 December 2004, ప్రపంచపు మొదటి బహుళజాతి Archived 2012-02-04 at the Wayback Machine
- Karl Marx, New York Tribune, 1853–1858, భారతదేశంలో తిరుగుబాటు
- East India Company: Its History and Results article by Karl Marx, MECW Volume 12, p. 148
- East India Club Gentlemen's club originally for officers and former officers of the Company, now open to others.
- Text of East India Company Act 1773
- Text of East India Company Act 1784
- John Stuart Mill and The East India Company, Vinay Lal's review of Lynn Zastoupil's 1994 book
- The Richest East India Merchant: The Life and Business of John Palmer of Calcutta, 1767-1836 (Worlds of the East India Company) by Anthony Webster
- "The East India Company – a corporate route to Europe" on BBC Radio 4’s In Our Time featuring Huw Bowen, Linda Colley and Maria Misra
- 1800లలో ఈస్టిండియా కంపెనీ
- ది బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ
మూలాలు
[మార్చు]- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.